
ప్రాణం తీసిన వేగం
దొరవారిసత్రం: అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాల్జే సింది. బైక్‌పై వేగంగా వచ్చిన యువకులు...
దొరవారిసత్రం: అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాల్జే సింది. బైక్‌పై వేగంగా వచ్చిన యువకులు ఆగివున్న గ్యాస్‌ట్యాంకర్‌ను ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన తల్లంపాడు సమీపంలోని స్వర్ణా టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..తడ మండలం బోడిలింగాలపాడుకు చెందిన పొట్టింగ్ రమణయ్య, నాగేశ్వరమ్మల ఏకైక కుమారుడు మహేష్(23). గ్రామానికే చెందిన అయ్యగొల్లం శ్రీధర్‌తో కలిసి మహేష్ పల్సర్ బైక్‌పై సూళ్లూరుపేట వచ్చాడు.
అక్కడి నుంచి దొరవారిసత్రం వైపు వస్తుండగా టోల్‌ప్లాజా వద్ద బైక్ అదుపుతప్పింది. మొదట ప్లాజా వద్ద ఉన్న కాలువ గోడను ఢీకొని అనంతరం సమీపంలో రోడ్డు పక్కన నిలిపివున్న గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొంది. మహేష్ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రగాయాల పాలైన శ్రీధర్‌ను ప్లాజా అంబులెన్స్‌లో సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకి తీసుకెళ్లారు. మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దొరవారిసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్లాజా ఆవరణలో దుకాణాలు
తల్లంపాడు ప్రాంతంలోని స్వర్ణాటోల్‌ప్లాజా ప్రాంతంలో ఇటీవల కాలంలో పలు దుకాణాలు వెలిశాయి. ఈ క్రమంలో లారీలతో పాటు పలు భారీ వాహనాలను డ్రైవర్లు వాటి వద్ద నిలిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్లాజాకు 100 మీటర్ల దూరంలో నిలిపివున్న గ్యాస్ ట్యాంకర్‌ను బైక్ ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.