- జాయింట్ కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: జిల్లాలో ప్రజాసాధికార సర్వే వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహశీల్దారులు, మునిసిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భూమి శిస్తు కమిషనర్ జిల్లాకు వచ్చారని, ఆదివారం ఏవేని రెండు మండలాల్లో తనిఖీ చేస్తారన్నారు. పేద ఎస్సీలకు భూ పంపిణీకి సంబంధించిన భూమి కోనుగోలు పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తహశీల్దారులను ఆదేశించారు. ఎన్యుమరేటర్లు ఉదయమే సర్వే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వే నిర్లక్ష్యం చేసినా, నిర్వహించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే 49 శాతం పూర్తయ్యిందని, నెలాఖరుకి 100 శాతం సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు, పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీనివాసులు, సర్వే విభాగం డీటీ భాస్కర నారాయణ పాల్గొన్నారు.
ప్రజాసాధికార సర్వే, జాయింట్ కలెక్టర్, వేగవంతం, Prajasadhikara survey, Joint Collector, speed,