రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దిగ్విజయం చేయడానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు.
అనంతపురం సెంట్రల్ : రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దిగ్విజయం చేయడానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీఐజీ ప్రభాకరరావు, ఎస్పీ రాజశేఖరబాబు, పీటీసీ ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి, జేసీ లక్ష్మికాంతంతో కలిసి ఆయన గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్బంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సూచికగా హీలియం స్కైబెలూన్లను ఎగురవేశారు.
వేడుకలకు చూసేందుకు పది వేలకు పైగా జనం వచ్చే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ–2 సయ్యద్‌ఖాజా మొహిద్దీన్, డ్వామా పీడీ నాగభూషణం, డీఎఫ్‌ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనే బృందాలు కఠోర సాధనలు (రిహార్సల్స్) చేస్తున్నాయి.