Pushkara works
-
దేవుడి పేరుతో రాజకీయం
ఆధ్యాత్మికత కన్నా ఆర్భాటాలు, ప్రచారానికే ప్రాధాన్యం పుష్కరాలను ఈవెంట్‌గా మార్చేసిన ముఖ్యమంత్రి * వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం * దేవాలయాలు కూల్చివేసి ఆహ్వానాల పేరిట హడావుడి * పుష్కరాల పనుల్లో కోట్ల రూపాయల అవినీతి * టెండర్లు లేకుండా అస్మదీయులకు నామినేషన్లపై కట్టబెట్టిన వైనం * పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేతకు ఆహ్వానంపై విమర్శలు సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతీ అంశాన్నీ తన ప్రచారానికి ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర పుష్కరాలను సైతం వ్యక్తిగత ఈవెంట్‌గా మార్చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నిన్నా మొన్నటిదాకా రాజధాని అమరావతి, పట్టిసీమలకు పదేపదే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపి అనుకూల మీడియాలో ఆర్భాటంగా ప్రచారం చేయించుకున్న చంద్రబాబు పుష్కరాల్లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. విజయవాడలో దేవాలయాలను అర్ధరాత్రి అడ్డగోలుగా కూలగొట్టిస్తూ, అమరావతిలో సదావర్తి సత్రం భూములను అస్మదీయులకు అప్పనంగా అప్పగిస్తూ, పుష్కరాల పనుల పేరుతో అస్మదీయులకు కోట్ల రూపాయలు దోచిపెడుతూ.. అనుకూల మీడియాలో మాత్రం తానో గొప్ప భక్తుడిగా ప్రచారం చేయించుకుంటున్నారని సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాలను ఈవెంట్‌లా మార్చివేసి, సినీ దర్శకులు బోయపాటి శ్రీనుకు బాధ్యతలు అప్పగించడం... చంద్రబాబు ప్రచారం కోసం తీసిన షూటింగ్ వల్ల జరిగిన తొక్కిసలాటలో 29మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి కూడా చంద్రబాబు పాఠాలు నేర్చుకోలేదని, ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా పుష్కరాల్లోనూ మళ్లీ అదే బోయపాటి శ్రీనుకు పుష్కర ప్రారంభోత్సవ ఏర్పాట్లు, షూటింగ్ బాధ్యతలను అప్పగించడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే చంద్రబాబు ప్రచార యావ, గత ఏడాది ప్రమాదం మరచిపోని ప్రజలే తొలిరోజు పుష్కర స్నానాలకు దూరంగా ఉండటం గమనార్హం. పుష్కరాలకు ఆహ్వానం పేరుతో చంద్రబాబు రాజకీయాలకు పాల్పడుతున్నారని, తన ప్రచారంకోసం ఆఖరుకు దేవుణ్ని కూడా వాడేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. నిజంగా భక్తి ఉంటే..: పుష్కరాల పేరుతో చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా నాటకమేనని, ప్రచారం కోసం చేస్తున్న ప్రహసనమేనని సోషల్ మీడియాలో ఫొటోల సాక్షిగా విమర్శిస్తున్నారు. పుష్కరాల పేరుతో విజయవాడలో దేవాలయాలను కూలగొట్టించడమే ఆయన భక్తి ప్రపత్తులకు ప్రత్యక్ష నిదర్శనమని ఎద్దేవా చేస్తున్నారు. పుష్కర ఏర్పాట్లకు దేవాలయాలు అడ్డంకి అనుకుంటే సంప్రదాయికంగా పూజలు జరిపించి విగ్రహాలు తీసి మరోచోట ప్రతిష్టించవచ్చు. కానీ దేవాలయ బోర్డు సభ్యులను సంప్రదించకుండా అర్ధరాత్రి దౌర్జన్యంగా దేవాలయాలను కూలగొట్టించడం ఏ తరహా భక్తికి నిదర్శనమని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా మసీదులు, చర్చిలపైన కూడా కన్నేశారని.. చివరకు కోర్టు స్టే వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయని ఉదాహరిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో తాను చేసిన ఆర్భాటం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు మరణించినా చంద్రబాబు తీరులో మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. కృష్ణా పుష్కరాల ప్రారంభంలోనూ ఆధ్యాత్మికత కంటే ఆర్భాటాలు, షూటింగ్‌లు, బాణసంచా పేలుళ్లకే ప్రాధాన్యమివ్వడంపై పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు భక్తి కేవలం ప్రచారం కోసమేనని... పలు సందర్భాల్లో షూ విడవకుండా కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఇక అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన భూములను అతి తక్కువ ధరలకు అస్మదీయులకు అప్పగించడం బాబు భక్తికి అద్దం పడుతోందంటున్నారు. పాపాలు చేసేవారే దేవాలయాలకు వస్తారంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఇప్పుడు భక్తి పేరుతో చేస్తున్నవన్నీ ప్రచారం కోసమేనని విమర్శిస్తున్నారు. ఆఖరుకు హారతులను కృష్ణానది అభిముఖంగా కాకుండా వెనక్కు తిరిగి ఇవ్వడం ఆచార విరుద్ధమని ఆధ్యాత్మిక వాదులు మండిపడుతున్నారు. నామినేషన్లపై పనులు... పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ఆ పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ వారికి దోచిపెట్టడం తెలుగుదేశం ప్రభుత్వానికే చెల్లిందని అధికార వర్గాలు సైతం విమర్శిస్తున్నాయి. పుష్కరాలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయో ఏడాది ముందే తెలుసు. ఆ మేరకు పుష్కర పనులకు టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన వారికి పనులు అప్పగించాలని తాము చెబుతున్నా... ముఖ్యమంత్రి చివరి వరకూ పనులకు అనుమతులివ్వలేదని చెబుతున్నారు. చివరకు గడువు దగ్గర పడ్డాక సమయంలేదంటూ టెండర్లు పిలవకుండా నామినేషన్లపై కోట్ల రూపాయల పనుల్ని అస్మదీయులకు కట్టబెట్టేశారని ఒక ముఖ్య అధికారి తెలిపారు. గోదావరి పుష్కరాల్లో నామినేషన్లపై పార్టీ నేతలకు పనులు కట్టబెట్టిన ముఖ్యమంత్రి కృష్ణా పుష్కరాల్లోనూ అదే రిపీట్ చేశారని ఆయన విమర్శించారు. దాని ఫలితంగానే పుష్కరాలు ప్రారంభమయ్యేంత వరకూ పనులు జరుగుతున్నాయని, నాణ్యతకు తిలోదకాలిచ్చి చివరి నిమిషంలో అరకొరగా పనులు పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఆహ్వానాల పేరుతో రాజకీయం... 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఆహ్వానాల పేరుతో హడావుడి చేయడంపై విమర్శలు వినవస్తున్నాయి. రాష్ట్రపతిని, ప్రధానిని మర్యాద పూర్వకంగా పిలవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ బాబు తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం, రాజకీయ అవసరాల పరిరక్షణ కోసం, పరిచయాలు పటిష్టం చేసుకోవడం కోసం తనకు అవసరమనుకున్న వారినే స్వయంగా ఆహ్వానించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద, చిన్న నటులందరికీ పుష్కరాలకు ముందే ఆహ్వానాలు పంపించిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించే విషయంలో ఎలాంటి ప్రొటోకాల్ పాటించలేదని వైఎస్సార్సీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. శుక్రవారం జగన్ నగరంలో లేడన్న విషయం తెలిసీ మంత్రులను పంపించడం, తాము ఆహ్వానించడానికి వెళితే జగన్ లేడంటూ తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకోవడం చంద్రబాబు దిగజారుడు ప్రచారానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. విపక్ష నేత అపాయింట్మెంట్ తీసుకోకుండా మంత్రులు ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్‌కు ఆహ్వానం అందజేయడానికి వారం రోజులుగా అపాయింట్మెంట్ కావాలని చినరాజప్ప ప్రయత్నిస్తే దొరకలేదని రావె ల చెప్పడం, అపాయింట్మెంట్ లేకుండా శుక్రవారం రాత్రి జగన్ ఇంటి వద్దకు మీడియాతో వచ్చి హడావుడి చేయడం, శనివారం ఉదయం జగన్ సాదరంగా స్వాగతించి మర్యాద చేసినా బయటకు వచ్చి విమర్శలు చేయడంపై మండిపడుతున్నారు. ఆహ్వానం విషయంలో అధికార పార్టీ, మంత్రి చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. పుష్కర ఆహ్వానాలనూ రాజకీయం చేయడం అధికార పార్టీకి, సీఎంకు తగదని అంటున్నారు. పుష్కరాలు మొదలయ్యాక జగన్‌కు ఆహ్వానం పంపించడం ప్రభుత్వపరంగా తప్పిదమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పనులు వేగవంతం చేయాలి
అనంతపురం సెంట్రల్ : రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దిగ్విజయం చేయడానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీఐజీ ప్రభాకరరావు, ఎస్పీ రాజశేఖరబాబు, పీటీసీ ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి, జేసీ లక్ష్మికాంతంతో కలిసి ఆయన గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్బంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సూచికగా హీలియం స్కైబెలూన్లను ఎగురవేశారు. వేడుకలకు చూసేందుకు పది వేలకు పైగా జనం వచ్చే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ–2 సయ్యద్‌ఖాజా మొహిద్దీన్, డ్వామా పీడీ నాగభూషణం, డీఎఫ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనే బృందాలు కఠోర సాధనలు (రిహార్సల్స్) చేస్తున్నాయి. -
కొనసాగుతున్న ‘పుష్కర పార్కింగ్’ పనులు
చింతపల్లి : ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అజ్మాపురం, పెద్దమునిగల్, కాచరాజుపల్లి పుష్కర ఘాట్లతో పాటు నాగార్జునసాగర్‌కు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లోభాగంగా హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు వింజమూరు సమీపంలో 70 ఎకరాలలో పార్కింగ్ స్థలంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సదుపాయాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, ఆర్డీఓ గంగాధర్, నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డిలు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం పార్కింగ్ స్థలం వద్ద చెట్ల తొలగింపుతో రోడ్లు, మూత్రశాలలకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగాయి. -
కొనసాగుతున్న ‘పుష్కర పార్కింగ్’ పనులు
చింతపల్లి : ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అజ్మాపురం, పెద్దమునిగల్, కాచరాజుపల్లి పుష్కర ఘాట్లతో పాటు నాగార్జునసాగర్‌కు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లోభాగంగా హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు వింజమూరు సమీపంలో 70 ఎకరాలలో పార్కింగ్ స్థలంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సదుపాయాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, ఆర్డీఓ గంగాధర్, నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డిలు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం పార్కింగ్ స్థలం వద్ద చెట్ల తొలగింపుతో రోడ్లు, మూత్రశాలలకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగాయి. -
పుష్కర నిధులన్నీ తమ్ముళ్ల జేబుల్లోకి...
– టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినవారికే నామినేషన్ పనులు – నాసిరకం నిర్మాణాలు 12 రోజులు కూడా ఉండవు – ఒక్కరికే రూ.106 కోట్ల పనులు కేటాయించిన ప్రభుత్వం ఇదే.. – వందల ఏళ్లనాటి ఆలయాలు, మసీదులు కూల్చటం దారుణం – వైఎస్ విగ్రహం తొలగించిన బాబు మూల్యం చెల్లించుకోక తప్పదు – వైఎస్సార్ సీపీ జిల్లా వ్యహారాల ఇన్చార్జి పెద్దిరెడ్డి ధ్వజం సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం పనులు చేస్తోంది యాత్రికుల సౌకర్యం కోసం కాదని, తెలుగు తమ్ముళ్ల జేబులు నింపడానికని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నాణ్యతాప్రమాణాలను గాలికివదిలేసి, వందల కోట్లు దోచి పెడుతోందని మండిపడ్డారు. సోమవారం విజయవాడలో ఆయన పర్యటించారు. తొలుత ఆయన పార్టీ కార్యాలయంలో ముఖ్యులతో సమావేశమయ్యారు. ఆనంతరం దివంగత వైఎస్సార్ విగ్రహం తొలగించిన కంట్రోల్ రూమ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆతర్వాత పద్మావతి పుష్కర ఘాట్ పరిశీలించారు. ఇది ప్రజలకు వచ్చే పండగలా లేదని తెలుగుదేశం పార్టీకి వచ్చిన పండగలా మార్చి దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం చేస్తున్న నాసిరకం నిర్మాణాలు పుష్కరాలు జరిగే 12 రోజులు కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. తనకు కావాల్సిన వారందరికి నామినేషన్ పద్ధతిలో కోట్ల పనులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఒకే కంపెనీకి రూ . 106 కోట్లు పనులు కేటాయించిన ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. వందల ఏళ్ళ నాటి దేవాలయాలు, చర్చిలు, మసీదులు కూల్చటం దారుణం అన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి... పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సౌకర్యాల్ని పట్టించుకోకుండా పుష్కర పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడుతుందని విమర్శించారు. తోట్లవల్లూరులో రూ. 10 లక్షల ఖర్చుతో పూర్తి అయ్యే ఘాట్‌ను కాంట్రాక్టర్లు రావడం లేదని ఇంతవరకు మొదలు పెట్టకపోవటం దారుణమం అన్నారు. కంకిపాడు టీడీపీ ఎమ్మెల్యే ఇసుక దోపిడీకి ఘాట్ నిర్మిస్తే ఇబ్బంది ఉంటుందని చెప్పి ఘాట్ ఏర్పాటు చేయకపోవటం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. అడ్డదారిలో అరాచకం ... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అడ్డదారిలో తొలగించిన సీఎం చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అడ్డదారిలో పోలీసు బలగాల్ని మోహరించి విగ్రహం తొలగించటం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. వాస్తవానికి విగ్రహం వల్ల ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేదన్నారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఏమీ చేయలేకపోతున్నాం అనే కక్షతో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించారని విమర్శించారు. తొలుత పార్టీ నాయకుడు చంద్రశేఖర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధకృష్ణ, పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పన, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి , పార్టీ సమన్వయకర్తలు సింహాద్రి రమేష్ బాబు, బొప్పన భవకుమార్, ఉప్పాల రాంప్రసాద్, పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల , చందన సురేష్, బీ జాన్‌బీ, మాజీ కార్పొరేటర్ అడపా శేషు , పార్టీ అనుబంధ విభాగాల నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకంగా పుష్కర పనులు
ఆత్మకూర్: ఆత్మకూర్ పీజేపీ ఎక్స్‌రోడ్ నుంచి జూరాల పుష్కరఘాట్ వరకు రూ.4కోట్లతో నాలుగు కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రోడ్డు పనులను నత్తనడకన కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌లో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి భూమిపూజలు చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. పుష్కరాల వరకు పనులను పూర్తి చేయాలని ఆదేశించినా, పనులు మందుకు సాగడం లేదు. రోడ్డు వేయడంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సింగిల్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా మారుస్తూ చేపట్టిన పనులపై ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాటు పనులు నత్త నడకన సాగుతున్నాయి.1600 మీటర్లమేర పాతరోడ్డుకు ఇరువైపుల కొత్తరోడ్డు నిర్మిస్తున్నారు. అలాగే 1400 మీటర్లమేర కొత్తరోడ్డును ఘాట్‌వరకు చేపడుతున్నారు. కొల్లాపూర్‌రూరల్: మంచాలకట్ట గ్రామ సమీపం నుంచి పుష్కరఘాట్ల వరకు వేస్తున్న రోడ్లు ఇంకా పూర్తి కాలేదు. పుష్కరాల సమయం సమీపిస్తుండటంతో కాంట్రాక్టర్లు హడావుడిగా నాసిరకంగా పనులు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా బీటీ, సీసీ రోడ్లు నిర్మాణం కోసం రూ.2.5కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు ఇంకా పూర్తి కాలేదు. గ్రామ సమీపం నుంచి ఘాట్ల వరకు వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. అక్కడక్కడా నాసిరకంగా పనులు చేయడంతో కంకర తేలి నెర్రెలు కనిపిస్తున్నాయి. 4.09 కిలోమీటర్ల రోడ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 60శాతమే పూర్తయ్యాయి. సీసీ రోడ్లకు వాటర్ క్యూరింగ్ చేయడం లేదు. పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. సోమశిలలో ప్రధాన పుష్కరఘాట్ వరకు వేస్తున్న బైపాస్ రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అమరగిరి, మల్లేశ్వరం గ్రామాల్లో వేసిన రోడ్లు దాదాపుగా 90శాతం పూర్తయ్యాయి. ఈ రోడ్లన్నీ పీఆర్ నిధుల నుంచి వేస్తున్నారు. పుష్కరాల సమయం దగ్గర పడుతుండటంతో కాంట్రాక్టర్లు రోడ్ల పనులు నాసిరకంగా చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవటానికే పుష్కరాల పనులు వచ్చాయని, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు. -
కలెక్టర్ సీరియస్
– ఉదయం 8 గంటలకే పాతాళగంగ ఘాట్‌కు చేరుకున్న కలెక్టర్ – ఎవరూ లేకపోవడంతో తీవ్ర అసంతప్తి – కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం శ్రీశైలం : కృష్ణా పుష్కరాల పనులు నత్తనడకన సాగుతుండటంతో కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం జేఈఓ హరినాథ్‌రెడ్డి, తహసీల్దార్ విజయుడుతో కలిసి ఆయన గురువారం ఉదయం 8 గంటలకు రోప్‌వే ద్వారా పాతాళగంగ ఘాట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఏమాత్రం పనులు జరగక పోవడంతో అధికారులు, కాంట్రాక్టర్లను పిలిచి సీరియస్‌గా క్లాస్ తీసుకున్నారు. ఇలా వ్యవహరిస్తే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కర పనులకు కేటాయించిన కాంట్రాక్టర్ కాకుండా సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తుండడంతో అసలు కాంట్రాక్టర్‌ను పిలిపించాల్సిందిగా సూచించారు. అసలు కాంట్రాక్టర్‌ను పిలిపించినా రాకపోవడంతో సదరు కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాన ని హెచ్చరించారు. రోజుకు ఎన్ని క్యూబిక్ మీటర్ల పనులను పూర్తి చేస్తున్నారని అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులను అడుగగా, వారు తెల్ల మోహం వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి లింగాలగట్టు వద్ద జరుగుతున్న ఘాట్ల నిర్మాణపు పనులను పరిశీలించారు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో కలెక్టర్‌కే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అనంతరం టెలీకాన్ఫరెన్స్ ఉండడంతో తహసీల్దార్ కార్యాలయం చేరుకుని అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలానికి వస్తామని పనులు వేగవంతం చేసి డైలీ రిపోర్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. -
నత్తతో పోటీ..!
– పూర్తికాని పుష్కర ఘాట్ పనులు – మాస్టర్‌ప్లాన్ పనులూ అంతంతే – నాణ్యత మరిచిన కాంట్రాక్టర్లు – నిబంధనలు పట్టించుకోని అధికారులు – నేడు సీఎం చంద్రబాబు పర్యటన కష్ణా పుష్కరాలను ఘనంగా జరుపుతాం..పక్కా ప్రణాళికతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం.. –ప్రభుత్వ పెద్దల చెబుతున్న మాటలు ఇవీ. ఇప్పటికీ పూర్తికాని పుష్కర ఘాట్లు..నాసిరకం పనులు.. హడావుడిగా అధికారుల పర్యటనలు..ముంచుకొస్తున్న పుష్కర ముహూర్తం.. – ఇదీ వాస్తవ పరిస్థితి. సాక్షి, కర్నూలు: కష్ణా పుష్కర పనులు గడువులోగా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఆగమేఘాలపై వీటిని పూర్తి చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. పనులు నత్తనడకన.. నాసిరకంగా జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాలకు ఏడాదికి ముందే పక్కా ప్రణాళికతో పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కష్ణా పుష్కరాలను అంతకంటే ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు కానీ.. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. హడావుడిగా పనుల మంజూరు.. నాణ్యతను వదిలేయడం..తదితర కారణాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వథా అయింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం రానున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర పనులపై ప్రత్యేక కథనం. కష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రూ. 166 కోట్లపైగా వెచ్చించింది. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల కోసం రూ. 24 కోట్లు కేటాయించింది. ప్రధానంగా పుష్కరాల్లో స్నాన మాచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఘాట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తి కావాల్సి ఉన్నా కొత్తగా నిర్మిస్తున్న ఘాట్ల పనులు 60 శాతం కూడా పూర్తికాలేదు. ఈ పనులు మరో 13 రోజులు పూర్తికావడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ఈ పనులు చేపట్టిన జలవనరులశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాతాళాగంగలో కొత్తగా చేపట్టిన పుష్కర ఘాట్ పనులు 50 శాతం దాటగా.. లింగాలగట్టు వద్ద నది మధ్యలో నిర్మిస్తున్న నూతన ఘాట్ పనులు మాత్రమే 60 శాతం చేరుకున్నాయి. అలాగే సంగమేశ్వరంలో హైలెవల్ ఘాట్‌కు ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న ఘాట్ పనులు కూడా 45 శాతం జరగడంతో.. మిగిలిన పనులు నిర్దేశించుకున్న సమయానికి పూర్తి చేస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్లు.. పుష్కరాలకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పుష్కర పనులకు కోట్లాది రూపాయలు వెచ్చించింది. అయితే పనులు చేపట్టేందుకు తగినంత సమయం లేకపోవడంతో ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా పనులు కానిచేస్తున్నారు. వీటిని అధికారులు ఎక్కడా అడ్డుకోకపోవడం గమనార్హం. కొత్తగా నిర్మిస్తున్న ఘాట్లకు సంబంధించి ప్రధానమైన కీవాల్ నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ఇక పాత ఘాట్ల పునరుద్ధరణ పనుల్లో ఎక్కడా నాణ్యత కనిపించకపోవడం కాంట్రాక్టర్ల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు వీటిని సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం.. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాస్టర్‌ప్లాన్ పనుల్లోనూ.. శ్రీశైలం అభివద్ధిలో భాగంగా చేపడుతున్న మాస్టర్‌ప్లాన్ పనుల్లోనూ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. ఎక్కడా నిబంధనలు పాటించకుండా పనులు మమ అనిపిస్తున్నారు. వీరికి ఇంజినీరింగ్ అధికారులు తోడవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా భూగర్భ డ్రెయినేజీ, మంచినీటి సరఫరా పనుల్లో నాణ్యత గాలికొదిలేశారు. పుష్కరాలలోపు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎడాపెడా పనులు కానిస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు కానీ, క్వాలిటీ కంట్రోల్ విభాగం కానీ అటువైపు చూసిన దాఖలాలు లేకపోవడంతో పుష్కర పనుల్లో పిండుకున్నోనికి పిండుకున్నంత అన్నట్లు సాగుతోంది. -
ఎంత ‘ఘాటు’ ప్రేమయో!
పుష్కర పనుల్లో రూ.12.80 కోట్లు వృథా పుష్కర పనుల్లో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. అధికారుల అనాలోచిత నిర్ణయం.. కాంట్రాక్టర్ల ధన దాహం.. వెరసి కోట్లాది రూపాయలు కృష్ణా నదిలో కొట్టుకుపోనున్నాయి. శ్రీశైలంలో చేపట్టిన ఘాట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి పారుతోంది. జిల్లా శివారు ప్రాంతం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. అక్కడ ఏమి చేసినా చెల్లుబాటు అవుతోంది. నీళ్లొస్తే ఘాట్ మునుగుతుందనీ తెలుసు.. నీళ్లు రాకపోతే వృథా అవుతుందనీ తెలుసు.. అయినా ఈ ‘ఘాటు’ ప్రేమ లెక్క వేరు! సాక్షి, కర్నూలు: శ్రీశైలంలో చేపడుతున్న పుష్కర పనుల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. పాతాళగంగ, లింగాలగట్టు వద్ద ఘాట్ల పనులతో కాంట్రాక్టర్ల పంట పండుతోంది. ఆగస్టు 12వ తేదీ నాటికి అధికారులు ఊహించినట్లు శ్రీశైలం రిజర్వాయర్‌లో 830 అడుగుల నుంచి 850 అడుగుల నీరు చేరితేనే పాతాళగంగలో రూ.8.74 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసే వీలుంటుంది. ఒకవేళ అనుకున్న స్థాయిలో నీరు చేరకపోతే భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో రిజర్వాయరు కింది భాగంలోని లింగాలగట్టు వద్ద నది మధ్యలో రూ.4.06 కోట్లతో లోలెవల్ ఘాట్ నిర్మితమవుతోంది. అక్కడే ఎగువ భాగాన ఉన్న పాత ఘాట్‌ను విస్మరించి.. పాత మెట్లకు మరమ్మతులతో పాటు పైభాగంలోని రహదారి వరకు కొత్త ఘాట్ నిర్మాణం రూ.3.49కోట్లతో చేపడుతుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రిజర్వాయర్‌లోని నీటి నిల్వలతో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. మంగళవారం నాటికి డ్యాం నీటి మట్టం 779.1 అడుగులుగా నమోదయింది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవకపోతే.. శ్రీశైలంలో రూ.12.80 కోట్లతో చేపట్టిన రెండు ఘాట్ల ఉద్దేశం ‘నీరు’గారినట్లే. పాత ఘాట్ కొట్టుకుపోయినా.. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీశైలం ఇరిగేషన్ అధికారులు సుమారు రూ.20 కోట్లకు పైగా అంచనాలతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని పరిశీలించేందుకు ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు కె.వి.సుబ్బారావు, రౌతు సత్యనారాయణ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. గత ఏప్రిల్ నెలలో ఆ కమిటీ శ్రీశైలంలో పర్యటించింది. పనులు ఎక్కడెక్కడ చేపడుతున్నారు? ఆ ప్రాంతాలు అనువైనవా? తదితర అంశాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. ఆ ప్రకారమే.. పాతాళాగంగలో మరో కొత్త ఘాట్ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. అదేవిధంగా లింగాలగట్టులో నది మధ్యలో లోలెవల్ ఘాట్‌కు అనుమతించారు. కాగా.. గతంలో నది మధ్యలో నిర్మించిన పాత ఘాట్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీని ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ సజీవం. ఇవేవీ పట్టని ప్రభుత్వ సాంకేతిక నిపుణుల కమిటీ నది మధ్యలో తిరిగి ఘాట్ నిర్మాణానికి పచ్చజెండా ఊపడం విమర్శలకు తావిస్తోంది. నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ప్రయోజం లేదని తెలిసినా.. ప్రభుత్వ అధికారులు నోరు మెదపకపోవడం చూస్తే ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఘాట్ నిర్మాణ పనులు ఆపాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది? కాంట్రాక్టర్ మాత్రం రాత పూర్వకంగా ఆదేశాలు వస్తేనే పనులు ఆపుతామని చెబుతుండటంతో అధికారులు కూడా మౌనం దాల్చినట్లు సమాచారం. నిధులు నీళ్లపాలు : తుంగభద్ర డ్యాంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరి దిగువకు విడుదల చేస్తే శ్రీశైలంలోని లింగాలగట్టు వద్ద నిర్మించిన నూతన ఘాట్, లేదా ఇది వరకే ఉన్న ఘాట్‌ను విస్తరిస్తూ ప్రదేశంలో ఏదో ఒక చోట మాత్రమే భక్తులు స్నానమాచరించే అవకాశం ఉంటుంది. అంటే లింగాలగట్టు వద్ద రూ.4.06 కోట్లు, రూ.3.49 కోట్ల వ్యయంతో నిర్మించిన స్నాన ఘాట్లలో ఒకటి వృథా కానుందన్న మాట. ఒకవేళ జలాశయంలో నీరు తక్కువగా ఉండి.. పుష్కర సమయానికి 2 టీఎంసీల నీటిని కిందకు వదిలితే లింగాలగట్టు వద్ద లోలెవల్ పుష్కర ఘాట్(నది మధ్యలో నిర్మించిన) వినియోగంలోకి రానుంది. అప్పుడు రూ.3.49 కోట్ల నిధులతో నిర్మిస్తున్న హైలెవల్ ఘాట్.. పాతాళగంగ వద్ద రూ.8.74 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మరో ఘాట్ నిరుపయోగం కానుంది. నిపుణుల కమిటీ సూచన మేరకే నిర్మాణాలు లింగాలగట్టు వద్ద నది మధ్యలో సాంకేతిక నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే ఘాట్‌ను నిర్మిస్తున్నాం. ఈ విషయంలో మా పాత్ర ఏమీ లేదు. గతంలోనూ లింగాలగట్టు వద్ద పాత ఘాట్ సమీపంలో నది మధ్యన ఘాట్ ఉంది. అందువల్లే ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం దానికి దూరంగా నది మధ్యలోనే ఘాట్ నిర్మిస్తున్నాం. - రాంబాబు, ఎస్ఈ, శ్రీశైలం డ్యాం పుష్కర పనులకు రూ.1.12 కోట్లు * తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణకు కేటాయింపు * వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నెహ్రూనగర్ ఘాట్ల పేరిటా నిధులు * ఘాట్లు లేకపోయినా నిధుల విడుదల కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఘాట్ల వద్ద భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించి ప్రభుత్వం రూ.1.12 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గత సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం వద్ద ఏర్పాటు చేయనున్న ఘాట్‌లో 12 రోజల పాటు నిర్వహించే పుష్కరాలకు 150 మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.53 లక్షలు కేటాయించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 50 షెడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.9లక్షలు.. తాగునీటికి రూ.4.5 లక్షలు వెచ్చించనున్నారు. నెహ్రూనగర్‌లో 30 మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.13లక్షలు.. తాగునీటికి రూ.7లక్షలు.. దుస్తులు మార్చుకునే 30 షెడ్లకు రూ.4.5 లక్షలు మంజూరయ్యాయి. వెలుగోడు రిజర్వాయర్ ఘాట్ వద్ద 10 మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.3.7 లక్షలు.. తాగునీటికి రూ.4లక్షలు.. మహిళలు దుస్తులు మార్చుకునే షెడ్లకు రూ.1.5 లక్షలు మంజూరు చేశారు. ఘాట్లు లేని చోట్ల నిధులు పుష్కర పనుల్లో ప్రభుత్వం నిధులను ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తుందో తాజా కేటాయింపుల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 6 చోట్ల ఘాట్లు ఏర్పాటవుతున్నాయి. శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద రెండు, లింగాలగట్టు వద్ద 2, సంగమేశ్వరం వద్ద రెండు ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఘాట్లు లేని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నెహ్రూనగర్‌లకు నిధులు మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది. పుష్కర పనుల్లో అవినీతిపై విచారణ చేయించాలి కర్నూలు(న్యూసిటీ): కృష్ణానది పుష్కర పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదురుగా ఈ మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కృష్ణానది పుష్కర పనుల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు కుమ్మక్కై కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో పాత పనులకు మెరుగులద్ది బిల్లులు స్వాహా చేస్తున్నారని విమర్శించారు. అవుకు సొరంగం పనుల్లో రూ.44 కోట్లు లూటీ చేసిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అధినేత, ఎంపీ సీఎం రమేష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ పనుల్లో జరిగిన అవినీతి రూ.350 కోట్ల విచారణ చేయించాలన్నారు. నీరుచెట్టు నిధులు దుర్వినియోగమవుతున్నాయన్నారు. రోజూ దిన పత్రికల్లో టీడీపీ నాయకుల అక్రమాలపై కథనాలు వెలువడుతున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.ధర్నాలో సీపీఎం జిల్లా నాయకులు నాగేశ్వరరావు, నగర కార్యదర్శి పుల్లారెడ్డి, నగర నాయకులు గురుశేఖర్, సాయిబాబా, ఆనంద్‌బాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఐద్వా నాయకురాళ్లు అరుణ, ఉమాదేవి, సుజాత, లక్ష్మీదేవి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర పనులను సమీక్షించిన మంత్రి
దండెంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పుష్కర పనులను పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లా దండెంపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఆయన అధికారులతో మాట్లాడారు. పుష్కరాల పనులను జూన్ 15లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.