ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో చాలా కంపెనీలు తక్కువ ధరకు మంచి ఫీచర్స్ తో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ భూమి మీద అత్యంత వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ కారు ఉంది అంటే అది "Rimac Nevera" అని చెప్పుకోవాలి. దీని గరిష్ఠ వేగం గంటకు 412 కి.మీ. ఇప్పుడు ఈ వేగాన్ని 'లిటిల్ జెయింట్' అనే ఎలక్ట్రిక్ కారు అధిగమించింది. ఇటీవల పరీక్ష సమయంలో ఈ కారు వేగం గంటకు 574.5 కిలోమీటర్లుగా ఉంది.
టీమ్ వెస్కో 444 రీవోల్ట్ సిస్టమ్స్ రూపొందించిన 'లిటిల్ జెయింట్' ఎలక్ట్రిక్ వాహనం అమెరికాలో ఫుల్ బ్యాటరీతో నడిచే అత్యంత వేగం గల ఈవీగా రికార్డును బద్దలు కొట్టింది. 'లిటిల్ జెయింట్' గంటకు 574.5 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకింది. ఈ లిటిల్ జెయింట్ కారు 1,152 ప్రిస్మాటిక్ లిథియం-అయాన్ బ్యాటరీల చేత నడుస్తుంది. అయితే, పెట్రోల్ తో నడిచే వాహనంతో పోలిస్తే దీని వేగం తక్కువ. భూమి మీద అత్యంత వేగంగా నడిచే కారు పేరు ThrustSSC. దీని గరిష్ఠ వేగం తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ ThrustSSC కారు గంటకు 1227.9 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది.
(చదవండి: భారత రోడ్లపై చక్కర్లు కొడుతున్న టెస్లా కారు!)
Comments
Please login to add a commentAdd a comment