
Sai Dharam Tej Accident Video: మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స)
ప్రస్తుతం సాయిధర్‌మ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియో మీ కోసం..