
సాక్షి, హైదరాబాద్: మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన పూర్తిగా కోలుకున్నట్లు బుధవారం వైద్యులు తెలిపారు. సాయితేజ్‌కు వెంటిలేటర్ తొలగించారు. తేజ్ ఆరోగ్యం మెరుగవడంతో కళ్లు తెరిచి చూస్తుండడంతో బుధవారం ఆక్సిజన్ సపోర్టు సైతం తీసేసినట్లు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని పేర్కొన్నారు.
కాగా కొన్ని రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. సొంతంగానే శ్వాస తీసుకుంటూ అందరితో మాట్లాడగలుగుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment