![Sai Dharam Tejs Latest Health Bulletin Released By Apollo Hospitals - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/18/sai.jpg.webp?itok=XQ7SbrgM)
Sai Dharam Tej Latest Health Bulletin: హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని, వెంటిలేర్‌ను కూడా తొలిగించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే చికిత్స నిమిత్తం మరికొన్ని రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉంటారని వెల్లడించారు.
కాగా కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఇటీవలో ఆయన కాలర్ బోన్‌కు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే.
చదవండి : కాబోయే భర్తకు గ్రాండ్‌గా సర్‌ప్రైజ్ ఇచ్చిన నయనతార
‘మా’ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నిబంధనలు ఇవే
Comments
Please login to add a commentAdd a comment