![Manchu Mohan Babu Visited Apollo Hospital For Sai Dharam Tej - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/13/Mohan-babu.jpg.webp?itok=oq3toGym)
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన నటుడు సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తాజాగా సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి బయటికి వస్తాడు అని చెప్పారు.
చదవండి: ‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి’
ఆదివారం తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించారు. 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై ఇసుక ఉండడంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయి అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి
Comments
Please login to add a commentAdd a comment