
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. ఆదివారం అపోలో వైద్యులు అయన కాలర్ బోన్‌కు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న(సోమవారం)హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు సర్జరీ విజయవంతమైందని, ఆయనను మరో 36 గంటల పాటు ఆబ్జర్వేషన్‌లో ఉంచాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాయి తేజ్‌ను ఐసియూలోనే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చదవండి: ఐసీయూలో అయినా వ్యక్తి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి: నిఖిల్
అపోలో అసుపత్రి వైద్యులు డా. అలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్య బృందం తేజ్‌ను క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నిన్న ఆయన వెంటిలెటర్ తొలగించాలని అనుకున్నప్పటిక సాయి స్పృహలోకి వచ్చాకే తొలగిస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తేజ్‌అరోగ్యం నిలకడగా ఉంది, చికిత్సకు స్పందిస్తున్నారని, రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు అపోలో వైద్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment