కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికదాడి చేశారు.
ఆసుపత్రిపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
Published Wed, Jul 26 2017 8:31 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో ఉన్న అరుణశివరాం ఆసుపత్రిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పరిశీలనకు వచ్చారు. విచారణలో భాగంగా లింగ నిర్దారణ పరీక్షలు చేసినట్లు ల్యాబ్ అసిస్టెంట్ ఒప్పుకున్నారు. లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమని, ఇటువంటి పనులకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని నగర సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.
Advertisement
Advertisement