19, 20 తేదీల్లో ఎస్సై రాత పరీక్ష
► 12,305 మంది అభ్యర్థులు
► 25 కేంద్రాలు ఏర్పాటు
► కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్‌క్రైం : పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ (సివిల్/ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ/ఎస్‌పీఎఫ్/ఎస్‌ఏఆర్‌సీపీఎల్/ఎస్‌ఎఫ్‌వో) అభ్యర్థుల రాత పరీక్ష ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసుకమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్‌లో 25 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చె ప్పారు. వాగేశ్వరీ డిగ్రీ కాలేజీ, అపూర్వ, వాణినికేతన్, ప్రభుత్వ మహిళ డిగ్రీ, పీజీ, శ్రీచైతన్య డిగ్రీ, ఎస్‌ఆర్‌ఎం, కిమ్స్, వివేకానంద, ఎస్సారార్, అల్ఫోర్స్ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలు, వాగేశ్వరీ, శ్రీచైతన్య, జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటారుుంచినట్లు తెలిపారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. లాడ్జీలలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఏసీబీ అన్నపూర్ణ, ఏసీపీ రామారావు, మహిళ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ కిషన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు హరిప్రసాద్, సదానందం, కృష్ణగౌడ్, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
అభ్యర్థులకు సూచనలు
టీఎస్‌ఎల్‌ఆర్‌బీ తుది నిర్ణయం మేరకు హాల్‌టికెట్లను జారీ చేశామని, డూప్లికేట్ హాల్‌టికెట్లు జారీ చేయరు. హాల్‌టికెట్‌లో అభ్యర్థి ఫొటో, సంతకాలు స్పష్టంగా ఉండాలని, ఇందుకు హాల్‌టికెట్‌ను లేజర్ ప్రింటర్ ద్వారా తీసుకోవాలి.ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరుఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ట్యాబ్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, వాచ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్‌టేబుళ్లు, పర్స్‌లు, చార్‌ట్స, విడి కాగితం లేదా రికార్డు చేసే పరికరాలు తీసుకురావద్దు. బ్లాక్ లేదా బ్లూ పారుుంట్ పెన్ను, హాల్‌టికెట్, ఏదైన ఒక ఒరిజినల ధ్రువీకరణపత్రం(పాస్‌పోర్టు,పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స) వెంట ఉంచుకోవాలి.
పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలి.పరీక్ష హాల్‌లో బయోమెట్రిక్ వివరాలు తీసుకోవడం సిబ్బంది మరిచిపోతే అభ్యర్థి అడిగి నమోదు చేసుకోవాలి. ఓఎంఆర్‌షీట్‌పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్థనలు, గుర్తింపుచిహ్నాలు రాస్తే పరిగణలోకి తీసుకోరు. అభ్యర్థులు చేతులపై మెహందీ, సిరా రాసుకోవద్దు.