ముగిసిన ఎస్సై రాత పరీక్ష
25 కేంద్రాలు...11,879 మంది అభ్యర్థులు హాజరు
కరీంనగర్ క్రైం : పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు రోజుల పాటు జరిగిన రాత పరీక్షలు ఆదివారం ముగిశారుు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన 25 కేంద్రాల్లో 11,879 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కరీంనగర్‌లోని వాగేశ్వరీ, అపూర్వ, వాణినికేతన్, శ్రీచైతన్య , ఎస్‌ఆర్‌ఎం, కిమ్స్, వివేకానంద, ఎస్సారార్, అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కాలేజీలు, వాగేశ్వరీ, శ్రీచైతన్య, జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కాలేజీల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది.
నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించలేదు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. పరీక్షలు ముగిసే వరకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేరుుంచారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సెంటర్లను సీపీ స్వయంగా పరిశీలించారు. అడిషనల్ సీపీ అన్నపూర్ణ, ఏసీపీ రామారావు, ఇన్‌స్పెక్టర్లు హరిప్రసాద్, సదానందం, మహేశ్, కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో 500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.