Instructions to Candidates
-
మున్నిపల్ ఎన్నికలు: గీత దాటితే వేటే..
సాక్షి, మంచిర్యాలటౌన్(అదిలాబాద్): మున్సిపాలిటీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీల్లో డేగకళ్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల విధుల్లో ఉండే అధికార యంత్రాంగం, సిబ్బంది ప్రవర్తనా నియమావళి అనుసరించాల్సిందే. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే ప్రజలు 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. నిబంధనలు.. రాజకీయ పార్టీ, పోటీ చేసే అభ్యర్థి ఉద్రిక్త పరిస్థితులను పెంచేందుకు ప్రయత్నించడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దు. జాతి, మతం, కులం పేరుతో ఓట్లు అడగొద్దు. ఎన్నికల ప్రచారానికి ప్రార్థనా మందిరాలైన దేవాలయాలు, మసీదులు, చర్చిలను వేదికలు చేసుకోవద్దు. పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలు కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు. విపక్ష పార్టీల అభ్యర్థుల నివాసాల వద్ద వారి అభిప్రాయాలు, కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయొద్దు. ప్రభుత్వ, ప్రైవేటు అధికారులు, ఇంటి యజమానుల నుంచి రాతపూర్వకంగా ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించవద్దు. జెండాలు, వాల్‌పోస్టర్లు అతికించడం, ప్రచార రాతలు రాయడం చేయవద్దు. ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా లేకుండా పో స్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు ముద్రించకూడదు. నిబంధనల మేరకు ఖర్చు చేయాలి.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చును బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించాల్సి ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను తెరవాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో రూ. 1 లక్ష వరకు మాత్రమే ఖర్చు చేసేందుకు అనుమతి ఉంది. ప్రచారం సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఖర్చు చేయాలి. రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి అందించిన నిర్ధిష్ట నమూనాలో రోజువారీ ఖర్చుల వివరాలు రాయాలి. ప్రత్యేక ఖాతా తెరిచి అందులో నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో వివరాలు విధిగా ఎన్నికల అధికారికి అందజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త.. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఏ పార్టీకి గానీ, వ్యక్తులకు గానీ అనుకూలంగా లేక వ్యతిరేకంగా పనిచేయొద్దు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రైవేటు కార్యక్రమాల్లో, విందుల్లో పాల్గొనవద్దు. ప్రభుత్వ ధనాన్ని సభలు, సమావేశాలకు వి నియోగించకూడదు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, వాహనాలను వినియోగించవద్దు. -
ఎన్నికల సంఘం కొత్త నిబంధనలు..
సాక్షి, కరీనంనగర్/రామగుండం: రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలను ప్రకటించింది. కొత్త చట్టం మేరకు కౌన్సిలర్‌గా పోటీ చేసే వ్యక్తికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా పోటీ చేయవచ్చని పేర్కొంది. అభ్యర్థులు నామినేషన్‌కు ముందు రోజు బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల వ్యయాన్ని దాని ద్వారానే నిర్వహించాలని తెలిపింది. మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే రూ.1,250, ఇతర కులాలవారు అయితే రూ.2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు.. వార్డు, డివిజన్లో సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి సంబంధిత పురపాలక, నగరపాలక సంస్థల్లో ఓటరుగా నమోదై ఉండాలి. ప్రతిపాదించే వ్యక్తి మాత్రం ఆ వార్డులో ఓటరై ఉండాలి. 21 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులు. మునిసిపాలిటీలో కాంట్రాక్టర్‌గా ఉండకూడదు. మునిసిపాలిటీ ఆస్తులు లీజుకు తీసుకోకూడదు. బాకీ ఉండొద్దు. మునిసిపాలిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టకూడదు. దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించుకున్న వారు పనికిరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు. గతంలో పోటీ చేసిన ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించి ఉండరాదు. అనర్హత గడువు ముగియకున్నా పోటీకి అనర్హుడు. నాలుగు కంటే ఎక్కువ సార్లు నామినేషన్ వేయకూడదు. ప్రతీ నామినేషన్ పత్రంపై సంబంధిత వార్డు నుంచి ఒక ఓటరు ప్రతిపాదకుడిగా సంతకం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ విధిగా జత చేయాలి. నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి రూ.20 స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ నామినేషన్ సమయంలో సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసినా ఇకదానికి డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున మధ్యాహ్నం 3 గంటల లోపు రిటర్నింగ్ అధికారికి ‘బి’ ఫాం అందించాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయకూడదు. వేర్వేరు వార్డుల్లో నామినేషన్ దాఖలు చేసినా, వార్డులో మినహా ఇతర వార్డుల్లో నామినేషన్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. రెండు అంతకంటే ఎక్కువ వార్డుల్లో పోటీలో ఉంటే పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తారు. -
19, 20 తేదీల్లో ఎస్సై రాత పరీక్ష
► 12,305 మంది అభ్యర్థులు ► 25 కేంద్రాలు ఏర్పాటు ► కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌క్రైం : పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ (సివిల్/ఏఆర్/టీఎస్ఎస్పీ/ఎస్పీఎఫ్/ఎస్ఏఆర్సీపీఎల్/ఎస్ఎఫ్వో) అభ్యర్థుల రాత పరీక్ష ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసుకమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్లో 25 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చె ప్పారు. వాగేశ్వరీ డిగ్రీ కాలేజీ, అపూర్వ, వాణినికేతన్, ప్రభుత్వ మహిళ డిగ్రీ, పీజీ, శ్రీచైతన్య డిగ్రీ, ఎస్ఆర్ఎం, కిమ్స్, వివేకానంద, ఎస్సారార్, అల్ఫోర్స్ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలు, వాగేశ్వరీ, శ్రీచైతన్య, జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటారుుంచినట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. లాడ్జీలలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఏసీబీ అన్నపూర్ణ, ఏసీపీ రామారావు, మహిళ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ కిషన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు హరిప్రసాద్, సదానందం, కృష్ణగౌడ్, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు. అభ్యర్థులకు సూచనలు టీఎస్ఎల్ఆర్బీ తుది నిర్ణయం మేరకు హాల్‌టికెట్లను జారీ చేశామని, డూప్లికేట్ హాల్‌టికెట్లు జారీ చేయరు. హాల్‌టికెట్‌లో అభ్యర్థి ఫొటో, సంతకాలు స్పష్టంగా ఉండాలని, ఇందుకు హాల్‌టికెట్‌ను లేజర్ ప్రింటర్ ద్వారా తీసుకోవాలి.ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరుఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ట్యాబ్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, వాచ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్‌టేబుళ్లు, పర్స్‌లు, చార్‌ట్స, విడి కాగితం లేదా రికార్డు చేసే పరికరాలు తీసుకురావద్దు. బ్లాక్ లేదా బ్లూ పారుుంట్ పెన్ను, హాల్‌టికెట్, ఏదైన ఒక ఒరిజినల ధ్రువీకరణపత్రం(పాస్‌పోర్టు,పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స) వెంట ఉంచుకోవాలి. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలి.పరీక్ష హాల్లో బయోమెట్రిక్ వివరాలు తీసుకోవడం సిబ్బంది మరిచిపోతే అభ్యర్థి అడిగి నమోదు చేసుకోవాలి. ఓఎంఆర్షీట్పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్థనలు, గుర్తింపుచిహ్నాలు రాస్తే పరిగణలోకి తీసుకోరు. అభ్యర్థులు చేతులపై మెహందీ, సిరా రాసుకోవద్దు. -
కానిస్టేబుల్స్ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
- ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ - హైదరాబాద్‌లో 13 కేంద్రాల ఏర్పాటు - విధివిధానాలు విడుదల చేసిన శివప్రసాద్ హైదరాబాద్ : పోలీసు కానిస్టేబుల్స్ ఎంపికలో కీలకఘట్టమైన తుది రాత పరీక్ష ఆదివారం జరుగనుంది. దీనికోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రిక్రూట్మెంట్ సెల్ చీఫ్ సూపరెంటెండెంట్, అదనపు పోలీసు కమిషనర్ (సీఏఆర్) ఎం.శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని 13 కేంద్రాల్లో ఈ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుందని ఆయన పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ హాల్ టిక్కెట్లతో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 7935 మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు, శారీరకదారుఢ్య పరీక్షల్లో విజయవంతమై తుది పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్ష నేపథ్యంలో విధి విధానాలతో పాటు అభ్యర్థులు పాటించాల్సిన అంశాలను ఆయన విడుదల చేశారు. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు... ► అభ్యర్థులు తమ వెంట తీసుకువచ్చిన హాల్‌టిక్కెట్‌ను పరీక్ష కేంద్రం ప్రవేశంతో పాటు పరీక్ష హాలులోనూ చూపించాల్సి ఉంటుంది. ► పరీక్ష ప్రారంభంకావడానికి గంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు హాలు ఉండాల్సిందే. ఎవరికీ బయటకు అనుమతించరు. ► పరీక్షకు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. ► ఒరిజినల్ హాల్ టిక్కెట్‌తో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగులైతే ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌ల్లో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకురావాలి. జిరాక్సు ప్రతులు, స్కాన్డ్ కాపీలను అనుమతించరు. ► డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకున్న హాల్‌టిక్కెట్లపై అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త తీసుకోవాలి. అలా లేని హాల్టిక్కెట్లతో వచ్చిన వారిని పరీక్షకు అనుమతించరు. ► ఫోన్లు, కాలిక్యులేటర్లతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్నీ పరీక్ష హాలులోకి అనుమతించరు. ► ప్రిలిమినరీ పరీక్షలు, శారీరకదారుఢ్య పరీక్షల సందర్భంలో సేకరించిన అభ్యర్థుల వేలిముద్రల్ని బయోమెట్రిక్ పద్దతిలో తుది పరీక్ష నేపథ్యంలోనూ సరిచూస్తారు. ► ఓఎంఆర్ షీట్లో మార్కింగ్స్ మొదలుపెట్టే ముందు ప్రశ్నపత్రం బుక్లెట్ కోడ్‌ను సరిచూసుకోవాల్సి ఉంటుంది. ► ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఇంగ్లీష్, తెలుగు/ఇంగ్లీష్, ఉర్దూ భాషలో ఉంటాయి. ► ఓఎంఆర్ షీట్లపై ఎలాంటి అసందర్భ రాతలు ఉన్నా తిరస్కరిస్తారు. మాల్ ప్రాక్టీస్ సహా ఎలాంటి చర్యలకు పాల్పడ్డా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ► పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లతో పాటు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ను సైతం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయని వారి జవాబు పత్రాలను తిరస్కరించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ► ఓఎంఆర్ షీట్‌తో పాటు జోడించి ఉన్న డూబ్లికేట్ ప్రతిని పరీక్ష ముగిసిన తర్వాత మాత్రమే ఇన్విజిలేటర్ సమక్షంలో వేరు చేసి అభ్యర్థులు తీసుకువెళ్ళాలి. ► పరీక్ష కేంద్రం మార్గం, చిరుమానాలు గుర్తించడం కోసం పరీక్షకు ఒక రోజు ముందే అభ్యర్థులు వాటికి వెళ్ళి రావాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వివరాలివి... సెంటర్ కోడ్ సెంటర్ పేరు హాల్‌టిక్కెట్ నెంబర్లు 6901 ఓయూ యూనివర్శిటీ కాలేజ్ 6901001 నుంచి 6901500 వరకు 6902 ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ 6902001 నుంచి 6902500 వరకు 6903 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎ) సైన్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ 6903001 నుంచి 6903400 వరకు 6904 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ బ్లాక్ (ఎ), ఓయూ మెయిన్ బిల్డింగ్ 6904001 నుంచి 6904650 వరకు 6905 ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ గగన్‌మహల్, దోమలగూడ (సెంటర్ ఎ) 6905001 నుంచి 6905600 వరకు 6906 ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ గగన్‌మహల్, దోమలగూడ (సెంటర్ బి) 6906001 నుంచి 6906600 వరకు 6907 నిజాం కాలేజ్, ఎల్బీ స్టేడియం ఎదురుగా, బ్లాక్-ఎ 6907001 నుంచి 6907750 వరకు 6908 నిజాం కాలేజ్, ఎల్బీ స్టేడియం ఎదురుగా, బ్లాక్-బి 6908001 నుంచి 6908750 వరకు 6909 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్, కోఠి 6909001 నుంచి 6909990 వరకు 6910 పీజీఆర్ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ 6910001 నుంచి 6910800 వరకు 6911 ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉమెన్స్, ఓయూ 6911001 నుంచి 6911500 వరకు 6912 ఆంధ్ర మహిళా సభ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, ఓయూ 6912001 నుంచి 6912400 వరకు 6913 ఏఎంఎస్ దుర్గాబాయ్దేశ్ముఖ్, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ, ఓయూ 6913001 నుంచి 6913495 వరకు