- ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- హైదరాబాద్‌లో 13 కేంద్రాల ఏర్పాటు
- విధివిధానాలు విడుదల చేసిన శివప్రసాద్
హైదరాబాద్ : పోలీసు కానిస్టేబుల్స్ ఎంపికలో కీలకఘట్టమైన తుది రాత పరీక్ష ఆదివారం జరుగనుంది. దీనికోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రిక్రూట్‌మెంట్ సెల్ చీఫ్ సూపరెంటెండెంట్, అదనపు పోలీసు కమిషనర్ (సీఏఆర్) ఎం.శివప్రసాద్ శుక్రవారం తెలిపారు.
హైదరాబాద్‌లోని 13 కేంద్రాల్లో ఈ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుందని ఆయన పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ హాల్ టిక్కెట్లతో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 7935 మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు, శారీరకదారుఢ్య పరీక్షల్లో విజయవంతమై తుది పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్ష నేపథ్యంలో విధి విధానాలతో పాటు అభ్యర్థులు పాటించాల్సిన అంశాలను ఆయన విడుదల చేశారు.
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు...
► అభ్యర్థులు తమ వెంట తీసుకువచ్చిన హాల్‌టిక్కెట్‌ను పరీక్ష కేంద్రం ప్రవేశంతో పాటు పరీక్ష హాలులోనూ చూపించాల్సి ఉంటుంది.
► పరీక్ష ప్రారంభంకావడానికి గంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు హాలు ఉండాల్సిందే. ఎవరికీ బయటకు అనుమతించరు.
► పరీక్షకు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి.
► ఒరిజినల్ హాల్ టిక్కెట్‌తో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగులైతే ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌ల్లో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకురావాలి. జిరాక్సు ప్రతులు, స్కాన్డ్ కాపీలను అనుమతించరు.
► డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకున్న హాల్‌టిక్కెట్లపై అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త తీసుకోవాలి. అలా లేని హాల్‌టిక్కెట్లతో వచ్చిన వారిని పరీక్షకు అనుమతించరు.
► ఫోన్లు, కాలిక్యులేటర్లతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్నీ పరీక్ష హాలులోకి అనుమతించరు.
► ప్రిలిమినరీ పరీక్షలు, శారీరకదారుఢ్య పరీక్షల సందర్భంలో సేకరించిన అభ్యర్థుల వేలిముద్రల్ని బయోమెట్రిక్ పద్దతిలో తుది పరీక్ష నేపథ్యంలోనూ సరిచూస్తారు.
► ఓఎంఆర్ షీట్‌లో మార్కింగ్స్ మొదలుపెట్టే ముందు ప్రశ్నపత్రం బుక్‌లెట్ కోడ్‌ను సరిచూసుకోవాల్సి ఉంటుంది.
► ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఇంగ్లీష్, తెలుగు/ఇంగ్లీష్, ఉర్దూ భాషలో ఉంటాయి.
► ఓఎంఆర్ షీట్లపై ఎలాంటి అసందర్భ రాతలు ఉన్నా తిరస్కరిస్తారు. మాల్ ప్రాక్టీస్ సహా ఎలాంటి చర్యలకు పాల్పడ్డా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
► పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లతో పాటు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ను సైతం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయని వారి జవాబు పత్రాలను తిరస్కరించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
► ఓఎంఆర్ షీట్‌తో పాటు జోడించి ఉన్న డూబ్లికేట్ ప్రతిని పరీక్ష ముగిసిన తర్వాత మాత్రమే ఇన్విజిలేటర్ సమక్షంలో వేరు చేసి అభ్యర్థులు తీసుకువెళ్ళాలి.
► పరీక్ష కేంద్రం మార్గం, చిరుమానాలు గుర్తించడం కోసం పరీక్షకు ఒక రోజు ముందే అభ్యర్థులు వాటికి వెళ్ళి రావాలని అధికారులు సూచిస్తున్నారు.
పరీక్ష కేంద్రాల వివరాలివి...
సెంటర్ కోడ్ సెంటర్ పేరు హాల్‌టిక్కెట్ నెంబర్లు
6901 ఓయూ యూనివర్శిటీ కాలేజ్ 6901001 నుంచి 6901500 వరకు
6902 ఓయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ 6902001 నుంచి 6902500 వరకు
6903 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎ) సైన్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ 6903001 నుంచి 6903400 వరకు
6904 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ బ్లాక్ (ఎ), ఓయూ మెయిన్ బిల్డింగ్ 6904001 నుంచి 6904650 వరకు
6905 ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ గగన్‌మహల్, దోమలగూడ (సెంటర్ ఎ) 6905001 నుంచి 6905600 వరకు
6906 ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ గగన్‌మహల్, దోమలగూడ (సెంటర్ బి) 6906001 నుంచి 6906600 వరకు
6907 నిజాం కాలేజ్, ఎల్బీ స్టేడియం ఎదురుగా, బ్లాక్-ఎ 6907001 నుంచి 6907750 వరకు
6908 నిజాం కాలేజ్, ఎల్బీ స్టేడియం ఎదురుగా, బ్లాక్-బి 6908001 నుంచి 6908750 వరకు
6909 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్, కోఠి 6909001 నుంచి 6909990 వరకు
6910 పీజీఆర్‌ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ 6910001 నుంచి 6910800 వరకు
6911 ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉమెన్స్, ఓయూ 6911001 నుంచి 6911500 వరకు
6912 ఆంధ్ర మహిళా సభ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, ఓయూ 6912001 నుంచి 6912400 వరకు
6913 ఏఎంఎస్ దుర్గాబాయ్‌దేశ్‌ముఖ్, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ, ఓయూ 6913001 నుంచి 6913495 వరకు