Clinics
-
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్‌కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్‌లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్‌లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టర్‌కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్‌కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్‌కు టీమ్‌గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్‌లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్‌గా ఈ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్‌కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్‌కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్‌ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్‌ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్‌కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్‌ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
ఆస్పత్రులపై సైబర్ నీడ..వెలుగులోకి షాకింగ్ విషయాలు!
సైబర్ నేరగాళ్లు ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇంతవరకు ఆన్లైన్ మోసాలకు లేదా కొత్త తరహాలో వ్యక్తుల డేటాను తస్కరించి బ్లాక్‌మెయిల్‌తో డబ్బులు గుంజడం వంటి సైబర్ నేరాలు చూశాం. అక్కడితో ఆగకుండా దేవాలయాల్లాంటి ఆస్పత్రులపై కూడా సైబర్ నీడ పడింది. వాటిని కూడా టార్గెట్ చేసి రోగుల వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో లాస్‌వేగస్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..లాస్‌వేగస్‌లోని ప్లాస్టిక్‌సర్జరీ క్లినిక్ హాంకిన్స్ అండ్ సోహ్న్ హెల్త్‌కేర్ హ్యాకర్ల బారిన పడింది. ఆ క్లినిక్‌కి వచ్చిన రోగులు వ్యక్తిగత డేటా, ఆపరేషన్‌కి ముందు తర్వాత తీసిన వ్యక్తిగత న్యూడ్ ఫోటోలతో సహా హ్యాక్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వివాదంలో చిక్కుకుపోయింది. హెల్త్‌కేర్ సెక్టార్‌కి సంబంధించి రోగులు డేటా భద్రత విషయమై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ ఘటనలో ముఖ్యంగా బాధిత మహిళ రోగుల డేటానే ఎక్కువగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రోగులు శస్త్ర చికిత్స, వ్యక్తిగత సమాచారం తోపాటు బ్యాంకు అకౌంట్ల నంబర్లను హ్యాకింగ్ గురయ్యాయి. సదరు ఆస్పత్రి తమ ఆరోగ్య భద్రతను కాపాడటంలో విఫలమైందంటూ బాధితుల నుంచి ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేగాదు సదరు ఆస్పత్ర ప్రజల హెల్త్ కేర్ పేషెంట్ల డేటా ప్రొటెక్షన్‌కి చట్టాలకు కట్టుబడి లేదంటూ విమర్శలు వచ్చాయి. భాదితమహిళలు తమకు జరిగిన నష్టానికి సదరు ఆస్పత్రి తగిన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులు రోగుల నమ్మకాలు, భావోద్వేగాలతో ఆడుకుందంటూ మండిపడుతున్నారు. ఆస్పత్రుల డేటాను పర్యవేక్షించడంలో సైబర్ సెక్యూరిటీ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కారణంగా రోగుల హెల్త్ డేటా భద్రత విషయమై క్లినిక్‌లపై చెరగని మచ్చ ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ యుగంలో భద్రత అన్నదే కరువైందంటూ సదరు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు కేవలం కంపెనీలు, మనుషుల వ్యక్తి గత డేటానే గాదు ఆస్పత్రుల డేటాపై కూడా సైబర్ దాడి చేయడం బాధకరం. సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలకి సంబంధించిన డేటాకి సైబర్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ మేరకు లాస్‌వేగాస్ పోలీసులు ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టారు. ఏదిఏమైనా తస్మాత్ జాగ్రత్త! డేటా అపహరణకు గురికాకుండా ఎవరికివారుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోక తప్పదని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
బై బై టీబీ.. కోవిడ్ తరహాలో క్షయ వ్యాధి నియంత్రణ
సాక్షి, అమరావతి: ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి క్షయ(టీబీ)ను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన ట్రేసింగ్–టెస్టింగ్–ట్రీట్మెంట్ విధానాన్ని టీబీ నియంత్రణలోనూ పాటించనుంది. కరోనా పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇకపై మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేసి, వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిలోనే ఇప్పటివరకు రెండు వారాలైనా తగ్గని దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడుతున్న వారికి ట్రూ నాట్ ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నూతన విధానంలో గ్రామ స్థాయిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో టీబీ లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించనున్నారు. టీబీ రోగుల కుటుంబ సభ్యులు, సుగర్ బాధితులు, ధూమపానం చేసే వారు, ఎయిడ్స్ రోగులు ఇతర హైరిస్క్ వర్గాల వారికి విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్క్రీనింగ్ చేస్తారు. వీరిలో ఎవరికైనా టీబీ లక్షణాలుంటే అక్కడే కఫం నమూనా సేకరిస్తారు. వాటిని ఓ ఏజెన్సీ ద్వారా ట్రూ నాట్ ల్యాబ్‌కు పంపుతారు. దీనివ్లల వీలైనంత ఎక్కువ మందిని పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి బయటపడుతుంది. ప్రజలు కూడా వ్యయప్రయాసలకోర్చి లేబొరేటరీ వరకు వెళ్లే అవసరం ఉండదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గుతుంది. త్వరలో పైలెట్‌గా ప్రకాశం జిల్లాలో నూతన విధానాన్ని త్వరలో ప్రకాశం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించడానికి ఊబర్, ఓలా, ర్యాపిడో తరహా ఏజెన్సీ ఎంపికకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లను పిలవనుంది. ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులో గమనించిన లోటుపాట్లను సరిచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. 93 శాతం సక్సెస్ రేటు దేశంలోనే సమర్థవంతంగా క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటోంది. 2020 నుంచి రాష్ట్రంలో సక్సెస్ రేటు 90 శాతం నమోదవుతోంది. 2021లో ఉత్తమ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు అందించింది. గత ఏడాది క్షయ రోగులకు చేసిన వైద్య చికిత్సలో 93 శాతం సక్సెస్ రేటు నమోదైంది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 8,52,414 మందికి టీబీ పరీక్షలు నిర్వహించగా 92,129 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 90,862 మందికి వైద్య సేవలు అందించారు. 84,501 మంది చికిత్స పూర్తి చేసుకుని వ్యాధి నుంచి బయటపడ్డారు. త్వరలో బీసీజీ వ్యాక్సినేషన్ కూడా పెద్దల్లో క్షయ వ్యాధిని నిరోధించడానికి ఉపయోగపడే బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) టీకాను రాష్ట్రంలో పంపిణీకి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు సమ్మతిని ఇచ్చాం. త్వరలో 50 శాతం జిల్లాల్లో టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే టీబీతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు, ఇతర హైరిస్క్ వర్గాల వారికి టీకా ఇస్తారు. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
ఒబెసిటీ క్లినిక్‌ల నిర్వాకం.. కరెంట్ షాక్స్‌తో వాంతులు, కడుపునొప్పి
నగరానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో... కార్ఖానాలోని సదరు క్లినిక్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నగరంలో జేబులు ఖాళీ చేయడంతోపాటు రోగాల పాలు చేస్తున్న వెయిట్ లాస్ క్లినిక్స్ నయామోసాలకు ఇది తాజా ఉదాహరణ మాత్రమే. సాక్షి, హైదరాబాద్: నగరం ఇప్పుడు ఒబె‘సిటీ’ క్యాపిటల్‌గా మారింది. అధిక బరువుతో బాధపడేవారితో పాటు ఆ బాధను సొమ్ము చేసుకోవాలనుకునే చికిత్సా కేంద్రాలూ పుట్టగొడుగుల్లా పెరిగాయి. కానీ వీటిలో పలు వెయిట్ లాస్ సెంటర్లకు సరైన చికిత్సా విధానం లేదు. సరైన వైద్య నిపుణులు లేరు. దీంతో తోచిన వైద్యం చేస్తున్నారు. రూ.వేలకు వేలు ముందే కట్టించేసుకుంటూ నెలల తరబడి ట్రీట్మెంట్స్ సాగదీస్తున్నారు. వెరసి ఎటువంటి ఫలితం లేకపోగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పోనీ పోతే పోయింది డబ్బే కదా అనుకోవడానికి లేదు.. చాలామంది డబ్బుతో పాటు అనారోగ్యాల పాలవుతున్నారు. అదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. 15 కిలోల బరువు తగ్గడానికి 30 ఏళ్ల క్లయింట్ మహేశ్వరి కార్ఖానాలోని కలర్స్ క్లినిక్‌ని ఆశ్రయించింది. దీంతో ఆమెకు గత ఏప్రిల్ 15 నుంచి చికిత్స ప్రక్రియ మొదలైంది, ఆ తర్వాత ఆమెకు క్లినిక్ సిబ్బంది కరెంట్ షాక్స్ ఇచ్చారు. అలాగే కొన్ని మందులు కూడా ఇచ్చారు. వీటి కారణంగా ఆమెకు తీవ్రంగా వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. దీని గురించి క్లినిక్ సిబ్బందికి చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలోనే శనివారం ఆమె స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు క్లినిక్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే? శరీరం కాలిపోయింది... అధిక బరువు తగ్గించే చికిత్స కోసం నగరవాసి గాయత్రి రాణా గచ్చిబౌలిలోని రిచ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్‌కు రూ.3 లక్షలు చెల్లించారు. మూడు నెలల చికిత్స వల్ల కనీసం 1% ప్రయోజనం పొందలేదు. పైగా 30డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ‘మెషినరీ‘ ఉపయోగించడటం వలన చికిత్స సమయంలో తనకు కాలిన గాయాలు సహా ఒంటిపై ఇతరత్రా అనేక గాయాల య్యాయని ఈ విషయాన్ని క్లినిక్‌లోని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని, సరైన వైద్యం అందించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు పై విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల ఫోరం నష్టాన్ని నిర్ధారించి, ఆమె చెల్లించిన రూ.3 లక్షలను 6% వడ్డీతో వాపసు చేయాలని ఇతర ఖర్చుల నిమిత్తం రూ.5,000 చెల్లించాలని క్లినిక్‌ని ఆదేశించింది. వెన్నునొప్పి, చర్మ సమస్యలు.. నగరానికే చెందిన కె.హాసిని యాదవ్ చికిత్స కోసం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ను సంప్రదించారు. తుంటి భాగంలో కొన్ని అంగుళాల కొవ్వు తగ్గించే చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల్లో కనీసం 10–15 కిలోల బరువు తగ్గుతుందని ఆమెను క్లినిక్ నిర్వాహకులు నమ్మించారు. దాంతో ఆమె చికిత్స రుసుముగా రూ.లక్ష చెల్లించారు. నాలుగు నెలలు గడిచినా అంగుళం, బరువు తగ్గలేదని పైగా తనకు కొత్తగా వెన్నునొప్పితో పాటు చర్మ సమస్యలు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు. తన తొమ్మిది నెలల చికిత్స సమయంలో, ఫిజియోథెరపిస్ట్‌ని కనీసం ఆరు సార్లు మార్చారని, నేర్చుకోవడానికి ప్రయోగాలు చేయడానికి తనను ఒక మోడల్‌గా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కూడా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా నష్టపరిహారం ఇవ్వాలని క్లినిక్‌ను ఆదేశించింది. చదవండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జాగ్రత్తలు తీసుకోవాలి ►బరువు తగ్గించుకునే చికిత్సలు అందించే కేంద్రాల్లో ఉన్న నిపుణుల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఏ ఆరోగ్య సమస్యలు రావని నిర్ధారించుకున్నాక, అది కూడా వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే చికిత్స గురించి ఆలోచించాలి. ►వీలైనంత వరకూ మందులు, కఠినమైన వ్యాయామాలు, మసాజ్‌ల ద్వారా కాకుండా నిదానంగా ప్రారంభించి తగినంత సమయం తీసుకుని బరువు తగ్గే విధానాన్ని ఎంచుకోవాలి. ►ప్రకటనలు, ఆర్భాటాలు చూసి కాకుండా గత చరిత్ర, వ్యక్తిగత అనుభవాలు తెలుసుకుని క్లినిక్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. సంప్రదించిన రెండో నిమిషం నుంచే డబ్బులు కట్టమని ఒత్తిడి చేసే క్లినిక్స్‌ను దూరంగా పెట్టడమే మంచిది. -
ఆరోగ్య పంజాబ్ సృష్టికి తీవ్ర కృషి: సీఎం మాన్
అమృత్సర్: పంజాబ్‌ను ఆరోగ్యకరంగా, శక్తివంతంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ప్రతి రంగంలోనూ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆయన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి 400 ఆమ్ ఆద్మీ క్లినిక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ మాన్ సర్కార్ నెరవేరుస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేందుకు కొద్దిగా ఓపిక పట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 500 ఆమ్ ఆద్మీ క్లినిక్కులను ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని చెప్పారు. -
రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య (మొబైల్ అంబులేటరీ క్లినిక్స్) సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా రూ.111.62 కోట్లతో రూపొందిన మరో 165 వాహనాలు నేటి నుంచి రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఏపీని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేస్తున్నాయి. 81 రకాల మందులు.. 54 రకాల పరికరాలు ఈ అంబులెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ 155251ను అనుసంధానించారు. ఈ నంబర్ల ద్వారా అంబులెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్‌లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్‌లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను జీవీకే–ఈఎంఆర్‌ఐకు అప్పగించారు. కాల్ సెంటర్‌కు రోజుకు సగటున 1,500 చొప్పున 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్‌కాల్స్ రాగా, ఒక్కో వాహనం రోజుకు సగటున 120 కిలోమీటర్లకు పైగా వెళ్లి వైద్య సేవలు అందిస్తోంది. 2,250 ఆర్బీకేల పరిధిలో 4 వేల గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలందించాయి. 6,345 వేలకు పైగా మేజర్, 10,859 మైనర్ శస్త్ర చికిత్సలు చేశారు. అత్యవసర వైద్యసేవల ద్వారా లక్షకు పైగా మూగ, సన్న జీవాల ప్రాణాలను కాపాడగలిగారు. తద్వారా 1.75 లక్షల మంది లబ్ధి పొందారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా..
జీరో కోవిడ్ పాలసీని ఎత్తేశాక ఘోరంగా కేసులు పెరిగిపోవడంతో పాటు అదేరీతిలో ఘెరంగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒకపక్క వైద్యులు నిరంతరం సేవలు అందిచంలేకపోతుంటే, మరోవైపు ఔషధాల కొరతతో గందరగోళంగా ఉంది. ఇంకోవైపు రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ..ఆస్పత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి క్లినిక్ రోగులతో నిండి పోయి..ఆఖరికి వైద్యం ఆరుబయటే అందిచాల్సినంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో తూర్పు చైనాలో అత్యంత పేద ప్రావిన్సులలో ఒకటైన అన్హుయ్ పట్టణం కరోనాతో విలవిలలాడుతోంది. గత కొద్ది నెలల నుంచి పెరుగుతున్న కేసుల కారణంగా అధిక సంఖ్యలో వృద్ధులు ఆస్పత్రుల పాలయ్యారు. దీనికి తీడు ఔషధాల కొరతతోపాటు, కరోనాను నిర్థారించే కిట్లు సైతం వేగంగా అయిపోయాయి. అందువల్ల అక్కడ ప్రస్తుతం కరోనా టెస్ట్‌లు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు అధికారులు. దీంతో అక్కడ ఎంతమందికి కరోనా పాజిటివ్ అన్నది కూడా తెలియనంత ఘోరంగా ఉంది. ప్రభుత్వం లాక్డౌన్ చేసినప్పుడే పరిస్థితులు బాగున్నాయని అక్కడి ప్రజలు చెబుతుండటం గమనార్హం. ఆ ప్రావిన్స్‌కి సమీపంలోని పట్టణంలో ఉన్న హెల్త్ సెంటర్ అధికారి మాట్లాడుతూ..మందుల కోరత ఘోరంగా ఉందని, అందువల్లే ప్రిస్క్రిప్షన్లను కూడా నిలిపేశామని చెప్పారు. అలాగే ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోవడంతో మెట్ల వద్ద, ఆస్పత్రి వెలుపల వైద్యం అందిచాల్సి వస్తుందని అన్నారు. పైగా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న వృద్ధులను నగరంలోని పెద్ద ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో రోగులంతా నిరాశ నిస్ప్రుహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదనగా చెప్పారు. అందువల్ల తాము వారిని ఉత్సాహపరిచేలా..."ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దు, బ్రతికేందుకు ప్రయత్నిద్దాం, మిమ్మల్ని మీరు రక్షించుకోండి" అనే నినాదంతో కూడిన బ్యానర్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంతవరకు అక్కడి గ్రామాల్లో కరోనా బారిన పడిన వృద్ధులు అసులు కోలుకోలేదని, కనీవినీ ఎరుగని రీతిలో అధిక సంఖ్యలో వృద్ధులే చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐతే చైనా ప్రభుత్వం కూడా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య బహిర్గతం చేయకుండా గట్టి ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్కడ ఉన్నవారెవరూ కూడా అధికారికంగా ఈ విషయాలు వెల్లడించడం కూడా నిషిద్ధమే. దీంతో అక్కడి ప్రజలు వాటి గురించి చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. (చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..) -
బస్తీ, పల్లె దవాఖానాల్లో 956 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: బస్తీ, పల్లె దవాఖానాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల నియామకాలకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 956 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అర్హత మార్గదర్శకాలను విడుదల చేసింది. బస్తీ దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది. పల్లె దవాఖానాల్లో (సబ్ సెంటర్లు) ఎంబీబీఎస్, బీఏఎంఎస్‌తోపాటు స్టాఫ్ నర్సులు అర్హులని పేర్కొంది. బీఎస్సీ నర్సింగ్ 2020 తర్వాత పూర్తి చేసిన వారు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎం సహా ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్సు (సీపీసీహెచ్) పూర్తి చేసిన వారు అర్హులు. వైద్యులకు రూ.40 వేలు, స్టాఫ్ నర్స్‌కు రూ.29,900 గౌరవ వేతనం అందిస్తారు. చదవండి: మునుగోడుకు క్యూ! -
అందరికీ ఆరోగ్యం
సాక్షి రాయచోటి: పల్లె ముంగిట ఆధునిక వైద్యం అడుగు పెడుతోంది. ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా...అక్కడికక్కడే ఎప్పటికప్పుడు వైద్య సేవలు పొందేలా విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యాధి ఏదైనా వైద్యం పల్లె ముంగిట లభించేలా ప్రణాళిక రూపొందించింది. పట్టణ తరహాలో పల్లెల్లోనే పరీక్షలు మొదలు ప్రతి వ్యాధికి వైద్య సేవలు అందించడానికి ముందుకు కదులుతోంది. గ్రామీణులు వైద్య చికిత్సలకు ఊరు దాటి వెళ్లకుండా.. ఉన్న ఊరిలోనే చికిత్స అందిచేందుకు వేగవంతంగా చర్యలు చేపడుతోంది. గ్రామాల్లోని వైద్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్య, ఆరోగ్య రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితుల నుంచి అక్కడికక్కడే వైద్యం అందుకునేలా ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. 8 శరవేగంగా పనులు అన్నమయ్య జిల్లాలో రూ.52.85 కోట్ల అంచనాతో 302 వైఎస్సార్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ చర్యలు చేపడుతున్నారు. భవనాలు పూర్తయిన వెంటనే పూర్తిస్థాయిలో వైద్య చికిత్స పరికరాలు ఏర్పాటు చేస్తారు. అందుకు సంబంధించి భవన నిర్మాణంలో భాగంగా 46 పునాది కింద స్థాయి, 39పునాది స్థాయి, రూప్ లెవెల్ 28, రూప్లైడ్ 45, సెకండ్ శ్లాబ్లైడ్ 14, ఫినిషింగ్ దశలో 51, బిల్డింగ్లు పూర్తయినవి 41 ఉన్నాయి. ఇప్పటివరకు బిల్లులు, ఇతరత్రా ఖర్చుల కింద రూ. 20 కోట్లు వెచ్చించారు. మిగిలిన పనులు కూడా పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 8 టీకాలు ఇక్కడే గర్భిణీలు, చిన్నారుల సంరక్షణ, నవజాత శిశువులకు, ఏడాదిలోపు వయస్సున్న శిశువులకు ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల వ్యాక్సిన్లు ఉంటాయి. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరిస్తారు. తరుచూ వచ్చే చిన్న, చిన్న సమస్యలు, ఈఎన్టీ సమస్యలపై అవగాహన కల్పిస్తారు. వయస్సు పైబడినప్పుడు వచ్చే సమస్యల నివారణతోపాటు అత్యవసర మెడికల్ సర్వీసెస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. మానసిక వ్యాధులను ముందే గుర్తించి నియంత్రించే చర్యలను చేపడతారు. 8 14 రకాల ప్రాథమిక పరీక్షలు హిమోగ్లోబిన్, గర్భవతులకు యూరిన్ పరీక్ష, ఇతర యూరిన్ టెస్టులు, బీపీ, షుగర్, మలేరియా, హెచ్ఐవీ, డెంగీ, కంటి పరీక్షలు, అయోడిన్ సాల్ట్ పరీక్షలు, హెపటైటీస్ బి, పైలేరియా, ర్యాపిడ్ టెస్ట్, కఫం పరీక్షలు ఈ క్లినిక్‌లలో చేస్తారు. 8 అత్యుత్తమ వైద్యానికి భరోసా ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి 2500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్న, చిన్న జబ్బులకు కూడా 10 కి.మీ దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ క్లినిక్‌లో 12రకాల వైద్య సేవలు అందించడంతోపాటు 14రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందుకు సంబంధించి 75 నుంచి 90 రకాల మందులతోపాటు 67రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ను అందుబాటులో ఉంచుతారు. వైద్య రంగంలో పెనుమార్పులు ప్రజల వైద్యానికి ప్రభు త్వం భరోసా కల్పిస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయ డం మొదలుకొని చిన్నపాటి వ్యాధులనుంచి ఇతర అనారోగ్య సమస్య వరకు పరీక్షలు అక్కడే నిర్వహించనున్నారు. అవసరమైన అన్ని రకాల మందులు కూడా క్లినిక్‌లో లభిస్తాయి. దీంతో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. అన్నమయ్య జిల్లాలో రూ.52.85 కోట్ల అంచనాతో 302 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి పర్యవేక్షణ చేస్తున్నాం. – గిరీషా పీఎస్, జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా -
ఈ నెల 18 నుంచి 21 వరకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో తనిఖీలు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా అందుతున్న సేవల్లో నాణ్యతను పరిశీలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు విలేజ్ క్లినిక్‌లలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించి సేవలపై ఆరా తీయనున్నారు. చదవండి: AP: సచివాలయాలు సూపర్.. కేంద్ర మంత్రి ప్రశంసలు ప్రత్యేక యాప్ రూపకల్పన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో తనిఖీల కోసం ఏపీహెచ్ఎస్ఎస్పీ–ఎస్సీ–హెచ్డబ్ల్యూసీ పేరిట ప్రత్యేక యాప్‌ను వైద్య ఆరోగ్య శాఖ రూపొందించింది. ప్రత్యేక బృందాలు పరిశీలించాల్సిన అంశాలతో ఓ ప్రశ్నావళి రూపొందించారు. తనిఖీల్లో వెల్లడైన అంశాల ఆధారంగా లోటుపాట్లను సరిదిద్దేలా చర్యలు చేపట్టనున్నారు. సొంతూరిలోనే మెరుగైన వైద్యం గ్రామ స్థాయిలోనే ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున 10,032 క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆరు వేలకు పైగా క్లినిక్‌లు అందుబాటులోకి రాగా వీటి ద్వారా గర్భిణులు, చిన్నారులు.. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, అంటు వ్యాధుల నివారణ లాంటి 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు గ్రామాల్లోనే అందుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.1,692 కోట్లతో 1,498 భవనాలకు మరమ్మతులు, 8,534 కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. మరమ్మతులు ఇప్పటికే పూర్తయ్యాయి. బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన ఎంఎల్‌హెచ్‌పీ వీటిల్లో సేవలందిస్తున్నారు. ఇప్పటికే 8,347 మంది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం పూర్తయింది. సగటున రోజూ క్లినిక్‌లలో 23 ఓపీలు, ఎనిమిది పరీక్షలు నమోదు అవుతున్నాయి. టెలిమెడిసిన్ ద్వారా క్లినిక్‌లలో స్పెషలిస్ట్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. నిత్యం సగటున 4,500 మంది టెలిమెడిసిన్ వైద్య సేవలు పొందుతున్నారు. తనిఖీల్లో వీటిపై దృష్టి ♦అర్హులైన వైద్యుల ద్వారా క్లినిక్‌లలో రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందుతున్నాయా? ♦జీవన శైలి జబ్బుల స్క్రీనింగ్‌పై ఏఎన్ఎం, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)లకు శిక్షణ పూర్తయిందా? ♦అవసరమైన ఔషధాల జాబితాలోని 70% మందులు అందుబాటులో ఉన్నాయా? ♦ప్రజలకు 12 రకాల వైద్య సేవలు సమగ్రంగా అందుతున్నాయా? -
4,755 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీ.. కౌన్సెలింగ్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) నియామకాలకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లలో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే గతేడాది నవంబర్‌లో 3,393 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తాజాగా వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో సేవలు అందించడానికి 4,755 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి గత నెలలో వైద్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జోన్ల వారీగా విశాఖపట్నం 974, రాజమండ్రి 1,446, గుంటూరు 967, కడప 1,368 పోస్టులు భర్తీ చేస్తున్నారు. విశాఖపట్నం జోన్లో ఈ నెల 18 వరకు, రాజమండ్రి, కడప జోన్లలో 19 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. గుంటూరులో మంగళవారం (నేడు)తో కౌన్సెలింగ్ ముగియనుంది. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రజలు చిన్న చిన్న జబ్బులకు వైద్యం కోసం కి.మీ. కొద్దీ ప్రయాణించి పీహెచ్సీ, సీహెచ్‌సీలకు వెళ్లే పనిలేకుండా రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటిలో సేవలు అందించడానికి బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమిస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా 12 రకాల వైద్య సేవలను అందిస్తోంది. అదేవిధంగా టెలిమెడిసిన్ సేవలను కూడా గ్రామీణ ప్రజలకు చేరువ చేసింది. -
పల్లెల్లో ఆరోగ్య భాగ్యం.. ప్రజల చెంతకే సర్కారీ వైద్యం
►నాడు: ప్రభుత్వాస్పత్రి అంటే చిన్నచూపు.. ప్రజలకు ఏదైనా జబ్బు వస్తే పెద్దాసుపత్రికి వెళ్లాల్సిందే. పెద్ద రోగమొస్తే పేదలు ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే.. ఆపరేషన్ చేయించుకోవాలంటే అప్పు కోసం పరుగు తీయాల్సిన పరిస్థితి. ప్రభుత్వాస్పత్రికి వెళదామంటే గ్రామం నుంచి కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. తీరా వెళ్లినా అక్కడ వైద్య సేవలు అందేవి కావు. ►నేడు: పేదలకు ఆరోగ్య భాగ్యాన్ని అందించేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేస్తోంది. పల్లెల్లో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, పట్టణాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటుచేసి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. ఆయా క్లినిక్స్‌లో 12 రకాల వైద్యసేవలు అందుతున్నాయి. ఆపరేషన్ అవసరమైతే ఆరోగ్యశ్రీ భరోసాగా నిలుస్తోంది. ఆపరేషన్ అనంతరం కూడా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. ఏలూరు టౌన్(ఏలూరు జిల్లా: రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడంతో పాటు అధునాతన పరికరాలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వైద్య నిపుణులు, సిబ్బందిని నియమిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టపర్చడంతో పాటు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న వారికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చేయూత అందిస్తున్నారు. చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు నాలుగు గదులతో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లకు అనుబంధంగా ప్రతి గ్రామంలో డాక్టర్ వైఎ స్సార్ విలేజ్ క్లినిక్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. సమీప పీహెచ్సీ వైద్యుడి పర్యవేక్షణలో బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సింగ్ సిబ్బంది, ఒక ఏఎన్ఎం, సచివాలయం పరిధిలో ఆరోగ్య కార్యకర్త క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు. ఇక్కడ అన్నిరకాల మందులు అందించేందుకు చర్యలు చేపట్టారు. విలేజ్ క్లినిక్‌లో వెయిటింగ్ రూమ్, ఓపీ రూమ్, కట్లు కట్టే గది, పరీక్షలకు మరో గదిని ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 60 పీహెచ్‌సీలు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు 938 విలేజ్ క్లినిక్‌లు మంజూరయ్యాయి. వీటిలో ఏలూరు జిల్లాలో 375 ఉండగా కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని 159తో కలిసి మొత్తం 534కు చేరాయి. ఉమ్మడి జిల్లాలో 152 విలేజ్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూరల్ పీహెచ్‌సీలు 94 ఉండగా ఏలూరు జిల్లాలో 43, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని పీహెచ్‌సీలు 17తో కలిపి ఆ సంఖ్య 60కు చేరింది. ఉమ్మడి జిల్లాలో అర్బన్ పీహెచ్‌సీలు 34 ఉండగా, ఏలూరు జిల్లాకు 12, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లోని 2 పీహెచ్‌సీలతో కలిపి 14 ఉన్నాయి. మెరుగైన సేవలు గ్రామాల్లో పేదలకు నాణ్యమైన మెరుగైన సేవ లు అందించేందుకు ప్ర భుత్వం విలేజ్ క్లినిక్స్ ఏర్పాటుచేస్తోంది. కేంద్రాలకు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 104 సంచార వైద్యశాలలతో గ్రామాల్లో వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు అందిస్తున్నాం. పీహెచ్‌సీలను బలోపేతం చేస్తున్నాం. విలేజ్, అర్బన్ క్లినిక్స్ తో వైద్య సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువకానున్నాయి. – డాక్టర్ బి.రవి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
మూగజీవాలకు అంబులేటరీ క్లినిక్స్
సాక్షి, అమరావతి: కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా క్షణాల్లో రయ్ రయ్‌మంటూ వస్తున్న æ‘108 అంబులెన్స్’ తరహాలో ఇప్పుడు మూగజీవాలకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘అంబా.. అన్న సైరన్‌తో పరుగులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి ‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ (మొబైల్ అంబులేటరీ క్లినిక్స్) రథాలు. వైద్య సేవలతో పాటు అవసరమైతే సన్నజీవాలు, పెంపుడు జంతువులకు సర్జరీలు చేయడమే కాదు.. కోలుకునే వరకు వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి. మైదాన ప్రాంతాల్లో నియోజకవర్గానికి రెండు, గిరిజన ప్రాంతాల్లో ఒకటి, అర్బన్‌లో కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబవుతున్న ఈ వాహనాలు వచ్చేనెల నుంచి సేవలందించబోతున్నాయి. వైద్యం అందక ఏ మూగజీవి చనిపోకూడదని.. రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 కోట్ల గొర్రెలు, 55.22 లక్షల మేకలు, 92వేల పందులతో పాటు 10.79 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది. వాటి కోసం రెండు సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ ఆస్పత్రులు, 12 వెటర్నరీ పాలీ క్లినిక్స్ (వీపీసీ), 323 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు (ఏవీహెచ్), 1,576 వెటర్నరీ డిస్పెన్సరీలు (వీడీ), 1,219 రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు (ఆర్‌ఎల్‌యూ) సేవలందిస్తున్నాయి. అయితే.. మారుమూల ప్రాంతాల్లో ఉండే వందలాది మూగజీవాలకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సకాలంలో వైద్యసేవలు అందడంలేదు. ఈ నేపథ్యంలో.. వైద్యసేవలందక ఏ ఒక్క మూగజీవి చనిపోకూడదన్న సంకల్పంతో 108, 104 తరహాలోనే దేశంలోనే మరెక్కడా లేని విధంగా జిల్లాకొకటి చొప్పున ‘సంచార పశు వైద్యశాల’లను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాల కోసం టెండర్లను ఆహ్వానించింది. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి రెండు, పశు సంపద తక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఒకటి, నగర ప్రాంతాల్లో ఉండే మూగజీవాలు, పెంపుడు జంతువుల కోసం కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 340 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తొలి విడతగా వచ్చే నెలలో 175 అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఒక్కో అంబులెన్స్ తయారీకి రూ.37లక్షల చొప్పున మొత్తం రూ.125.80 కోట్లు ఖర్చుచేయనుంది. ఇక దీనిని గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలోనూ అమలుచేయాలన్న ఆలోచనతో లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికొకటి చొప్పున అంబులెన్స్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అంబులెన్స్ ప్రత్యేకతలు.. ► ఇందులో డ్రైవర్ కమ్ అటెండర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ కమ్ కాంపౌండర్, ఓ వైద్యుడు ఉంటారు. ► జీతభత్యాలు, నిర్వహణ కోసం ఒక్కో అంబులెన్స్‌కు ఏటా రూ.18.72లక్షల చొప్పున రూ.63.65 కోట్లు ఖర్చుచేయనుంది. ► ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేస్తున్న వీటిని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలను టెండర్ ద్వారా ఎంపిక చేసిన ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తోంది. ► ప్రతీ అంబులెన్స్‌లో ప్రత్యేకంగా ట్రావిస్‌తోపాటు 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన పూర్తిస్థాయి ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ► అలాగే, కనీసం వెయ్యి కిలోల బరువున్న మూగజీవాలను తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ జాక్‌లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటుచేశారు. ► సీజన్ల వారీగా వేసే వ్యాక్సినేషన్స్‌తో పాటు అన్ని రకాల రోగాలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతారు. చిన్నపాటి సర్జరీలూ అక్కడికక్కడే.. సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు చిన్నపాటి సర్జరీలు కూడా ఎక్కడికక్కడే చేస్తారు. ► పెద్ద జంతువులకు ప్రాథమిక వైద్యంతో పాటు చిన్నపాటి ఆపరేషన్లు చేస్తారు. ► పెద్ద సర్జరీలు అవసరమైతే మాత్రం సమీప ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఆ గ్రామానికి తీసుకెళ్లి రైతుకు అప్పగిస్తారు. ► వీటి కోసం 24 గంటలూ పనిచేసేలా టోల్ ఫ్రీ నెం.1962ను ఏర్పాటుచేస్తున్నారు. ► ఇక 108లోని కుయ్ కుయ్ తరహాలో వీటికోసం ‘అంబా..’ అన్న పశువుల అరుపుతో పాటు వాటి మెడలో కట్టే మెడపట్టెడ (గంటలు, మువ్వలు) శబ్ధంతో కూడిన వినూత్న సైరన్ రూపొందించారు. రోల్‌మోడల్‌గా నిలిచాం సీఎం వైఎస్ జగన్ ఆలోచనకనుగుణంగానే దేశంలోనే తొలిసారిగా వెటర్నరీ అంబులెన్స్‌లు తీసుకురావాలని నిర్ణయించాం. మన ప్రయత్నాన్ని మెచ్చుకున్న కేంద్రం జాతీయ స్థాయిలో అమలుకూ ముందుకొచ్చింది. మూగజీవాల పరిరక్షణే ధ్యేయంగా నియోజకవర్గానికి రెండు చొప్పున అంబులెన్స్ తీసుకొస్తున్నాం. వైద్యసేవలందక ఏ మూగజీవి చనిపోకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖ మంత్రి ఇక పశు ఆరోగ్య సేవా రథాలు ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో పశు వైద్య సేవలందిస్తున్నాం. పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 108, 104 తరహాలో ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు వచ్చేనెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, పశు సంవర్ధక శాఖ -
పల్లె క్లినిక్‌లు: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పల్లెలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఊళ్లలో ప్రభుత్వ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అందులో తెలంగాణ నుంచి పలువురు సీనియర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలనే దశల వారీగా క్లినిక్‌లుగా మారుస్తారు. గతంలో వాటిని వెల్నెస్ సెంటర్లుగా మార్చాలని, వాటిల్లో శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయంలో పలు మార్పులు చేశారు. ఎంబీబీఎస్ లేదా ఆయుర్వేద లేదా హోమియో లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. దీనిపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. చదవండి: (తాగునీరు ఫ్రీ.. మే లేదా జూన్ నుంచి అమలు) రెండు, మూడు ఊళ్లకొకటి... ప్రస్తుతం పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) వైద్యానికి కీలకంగా ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్, నర్సులు ఉండటంతో ప్రాథమిక వైద్యం అక్కడే అందుతుంది.అవి దాదాపు ఒక్కో మండలంలో ఒక్కోటి చొప్పున మాత్రమే ఉన్నాయి. అయితే ఒక మండలంలో 15–20 గ్రామాలుంటే వారంతా పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తుంది. అలా 20–30 కిలోమీటర్లు వెళ్తేగానీ కొన్ని గ్రామాలకు వైద్యం అందే పరిస్థితి లేదు. అయితే రాష్ట్రంలో పీహెచ్‌సీల కింద 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్ఎంలే ప్రస్తుతం బాస్‌లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులివ్వడం వంటివి మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా లేదా వెల్నెస్ సెంటర్లుగా మార్పు చేసి వాటిల్లో వైద్య సేవలు ప్రారంభిస్తారు. తద్వారా ప్రతీ రెండు మూడు గ్రామాలకు ఒక క్లినిక్ లేదా ఒక పెద్ద గ్రామంలో ఒక క్లినిక్ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారు. ఆయా క్లినిక్‌లలో రక్త పరీక్ష చేయడం, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడం, వాటికి తగు వైద్యం అందించడంపై ఫోకస్ పెడతారు. దీంతో ప్రైవేట్ ప్రాక్టీషనర్లపై ఆధారపడకుండా నాణ్యమైన వైద్యం రోగులకు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య విద్య పూర్తయిన వారికి అవకాశం... ప్రతీ ఏటా వేలాది మంది వైద్యులు మెడికల్ కాలేజీల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. వారిలో కొందరు మెడికల్ పీజీలకు వెళ్తుండగా, కొందరు అత్యంత తక్కువగా రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వేతనాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఏడాదికేడాదికి వీరి సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఆయుష్ వైద్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. వీరందరికీ అవకాశం కల్పించాలన్నా, ప్రజలకు మరింత చేరువకు వైద్య సేవలు తీసుకురావాలన్నా ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా మార్చడం సరైందని కేంద్రం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా ఎంబీబీఎస్ వైద్యులు, ఆయుష్ డాక్టర్లు ముందుకు రాకపోతే అటువంటి చోట్ల ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను ఆయా క్లినిక్‌లలో నియమిస్తారు. నర్సులకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ) అనే హోదా ఇస్తారు. ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హతగా నిర్ణయించారు. ఈ క్లినిక్‌లు పీహెచ్సీ పరిధిలో ఉంటాయి. ఇక్కడ నయం కాని జబ్బులను పీహెచ్‌సీకి పంపిస్తారు. డాక్టర్లను లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే అవకాశం ఉంది. పారితోషికాన్ని ఎన్హెచ్ఎం ద్వారా ఇస్తారు. మూడేళ్ల పాటు ఆయా క్లినిక్‌లలో పనిచేయాలన్న హామీపత్రం ఇవ్వాలన్న నియమం పెట్టే అవకాశం ఉంది. పైగా వీరు కొత్త క్లినిక్‌లున్న చోటే నివాసం ఉండాలన్న షరతూ విధిస్తారు. అప్పుడే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇంకా వీటిపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వస్తాయని చెబుతున్నారు. -
కరోనా నివారణలో ఏపీ ముందంజలో ఉంది
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ కోసం రు.10.20 కోట్లతో భవనాల నిర్మాణాలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో 12 వైద్యవిధాన పరిషత్ హాస్పిటల్స్ అభివృద్ధికి రూ.94.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణకు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వైద్య పరీక్షలు రేటును అన్ని ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రుల్లో రూ.1600 నుంచి రూ. 800లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైద్యం నిమిత్తం 1563 బెడ్స్, ఆక్సిజన్ పైప్‌లైన్స్ కోసం రూ. 3.10 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజి చొప్పున 16 మెడికల్ కాలేజీలు రూ. 7500 కోట్లతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని మంత్రి పేర్కొన్నారు. -
‘గ్రేటర్’లో సాయంత్రం క్లినిక్‌లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో సాయంత్రం క్లినిక్‌లను వెంటనే ప్రారంభించా లని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ క్లినిక్‌లలో బస్తీవాసులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ఇతర అధికారులు రమేష్‌రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. మంత్రి ఈటల మాట్లాడుతూ ఆసిఫాబాద్, భద్రాచలం పరిధిలో మలేరియా, జీహెచ్ఎంసీ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉంటాయని, దీనిపై శుక్రవారం అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. ► అన్ని మందులతో పాటు డెంగీ, ఇతర వ్యాధి నిర్ధారణ ర్యాపిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలి. ► ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కొనసాగించాలి. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటుచేయాలి. ► సిబ్బందిని, డాక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించాలి. ► ప్రతి డాక్టర్, సిబ్బంది ఆసుపత్రి దగ్గర్లోనే నివాసం ఉండాలి. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అదనపు వేతనమివ్వాలి. ► రోగులు రాని చోట నుంచి అవసరం ఉన్నచోటకు డాక్టర్లను మార్చాలి. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ► మున్సిపల్, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేయాలి. ఈ శాఖలతో త్వరలో సమావేశాలుంటాయి. ► అన్ని బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కరోనాతో పాటు అన్ని జబ్బుల కు పడకలు కేటాయించాలి. అన్ని వైద్యసేవలు నిర్వహించాలి. ► ఫీవర్ ఆసుపత్రిని పూర్తిగా సీజనల్ జ్వరాల చికిత్సల కోసం సిద్ధంచేయాలి. ► ప్రతి గర్భిణికి ప్రసవ తేదీ ప్రకారం వైద్యసేవలందాలి. డెలివరీ డేట్ కంటే ముందే ఆసుపత్రికి తరలించాలి. ► 13 రకాల స్పెషాలిటీ డాక్టర్లను జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. ► బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత లేకుండా చూడాలి. ► జీతాలు పెండింగ్ ఉంచొద్దు. ప్రతి నెల మొదటి వారంలో అందేలా చూడాలి. -
సుస్తీ లేని బస్తీలు
బస్తీ వాసులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఉద్దేశించిన ‘బస్తీ దవాఖానాలు’ నగరంలో మరో 45 చోట్ల ప్రారంభమయ్యాయి. శుక్రవారం మంత్రులు కేటీఆర్, ఈటల, తలసాని, సబిత, మహమూద్ అలీ, మల్లారెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. బస్తీవాసులకు ఇకపై చక్కటి వైద్యం అందించాలని, వీరు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్లే పరిస్థితి రాకుండా స్థానికంగానే మంచి వైద్యం అందించాలని డాక్టర్లు, సిబ్బందికి మంత్రి కేటీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కారణంగానే నగరంలో పెద్ద సంఖ్యలో బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో శుక్రవారం ఒక్కరోజే 45 బస్తీ దవాఖానాలు కొత్తగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే 123 బస్తీ దవాఖానాలు పనిచేస్తుండగా, వీటి సేవలు బాగున్నాయని భావించిన ముఖ్యమంత్రి వెంటనే మరో 45 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో వీటిని ప్రారంభించారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో పేద ప్రజలకు దవాఖానాలు ఉండాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో 300కు పైగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో అధికారులున్నారు. వీటికి అవసరమైన భవనం, మౌలిక సదుపాయాలు జీహెచ్ఎంసీ సమకూరుస్తుండగా, వైద్యానికి సంబంధించి డాక్టర్లు, తదితర సిబ్బందిని వైద్యారోగ్యశాఖ నియమిస్తోంది. దాదాపు 5 నుంచి 10 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానా ఉండాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ఫీజులను భరించలేని పేదలకు ఉపకరించాలనే లక్ష్యంతో బస్తీదవాఖానాలు ఏర్పాటు చేశారు. సాధారణ జ్వరం తదితర వాటికి చికిత్సలతోపాటు అవసరమైన వారికి వ్యాధి నిర్ధారణ కోసం దాదాపు 57 రకాల పరీక్షలు నిర్వహించేందుకు రక్త నమూనాలు సేకరించి, తెలంగాణ స్టేట్ డయాగ్నస్టిక్స్‌లో పరీక్షలు చేయిస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. బస్తీ దవాఖానాల్లో గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు అవసరమైన మందులు తదితర సేవలందిస్తారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, బీపీ, షుగర్, వంటి పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా ఎవరికైనా పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే అక్కడకు సిఫార్సు చేస్తారు. దాదాపు 150 రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి దవాఖానాలోనూ డాక్టరు, నర్సు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇవి తెరిచి ఉంటాయని, పైసా ఖర్చు లేకుండా పేదలకు వైద్యసేవలు అందుతాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మల్లాపూర్ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవలు పెంచుతామన్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్‌నగర్, యాదగిరిన గర్లలో బస్తీ దవాఖానాలను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ⇒ బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని వెంకటేశ్వరనగర్ బస్తీలో, ఎన్బీనగర్ బస్తీలో మంత్రి ఈటల రాజేందర్ బస్తీ దవాఖానాలను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు. ⇒ కాప్రా సాయిరాంనగర్‌లో బస్తీ దవాఖానాను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణరాజ్, పావనీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ⇒ ఎస్వీనగర్లోని బస్తీ దవాఖానాను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగితారాణా, కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, గొల్లూరి అంజయ్య పాల్గొన్నారు. ⇒ కవాడిగూడ డివిజన్ రోజ్‌కాలనీ, భోలక్‌పూర్ డివిజన్ దామోదర సంజీవయ్యనగర్‌లలో బస్తీ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ⇒ కుషాయిగూడ మహిళా భవన్‌లోని బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డితో కలిసి గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. జెడ్సీ ఉపేందర్‌రెడ్డి, కాప్రా సర్కిల్ డీసీ శైలజ, కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, పన్నాల దేవేందర్‌రెడ్డి, కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్, బొంతు శ్రీదేవి పాల్గొన్నారు. ⇒ కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని చింతల్ డివిజన్ భగత్íసింగ్‌నగర్, రంగారెడ్డినగర్ డివిజన్ నందానగర్, కుత్బుల్లాపూర్ డివిజన్ ద్వారకానగర్‌లలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్, ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి బస్తీ దవాఖానాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జోనల్ కమిషనర్ మమత తదితరులు పాల్గొన్నారు. ⇒ కామాటిపురాలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధ, కార్పొరేటర్ ముఖేష్‌సింగ్ కలిసి బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ⇒ సంతోష్‌నగర్ డివిజన్ కళంధర్నగర్ కమ్యూనిటీ హాల్లో బస్తీ దవాఖానాను రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతో కలిసి ప్రారంభించారు. ⇒ సైదాబాద్ డివిజన్ జాకీర్ హుస్సేన్ కాలనీ కమ్యూనిటీ హాల్లో బస్తీ దవాఖానాను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాల, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి పాల్గొన్నారు. ⇒ అల్వాల్ సర్కిల్ పరిధిలోని తుర్కపల్లిలోని మోడల్ మార్కెట్ కాంప్లెక్స్, అల్వాల్ డివిజన్లోని అరుంధతి సంఘం కుమ్మరి బస్తీ, వెంకటాపురం డివిజన్లోని కొత్తబస్తీలలోని బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే మైనంపల్లి ప్రారంభించారు. ⇒ మోండా మార్కెట్ డివిజన్ చేపల బావిలో బస్తీ దవాఖానాను స్థానిక కార్పొరేటర్ ఆకుల రూపతో కలిసి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమీషనర్ ముకుందరెడ్డి పాల్గొన్నారు. ⇒ కేపీహెచ్‌బీ డివిజన్లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, జెడ్సీ మమతతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీలోని 4వ ఫేజ్‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ⇒ వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వరనగర్‌లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్సీ మమతతో కలిసి బస్తీ దవాఖానాను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ⇒ కొండాపూర్ డివిజన్ ప్రేమ్‌నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో బస్తీ దవాఖానాను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ప్రారంభించారు. -
అపోలో ఫీవర్ క్లినిక్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్స్‌ను ప్రారంభించినట్లు అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టయిల్లో భాగమైన అపోలో క్లినిక్స్ వెల్లడించింది. జ్వరాలు, తత్సంబంధిత లక్షణాల గురించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. తొలి దశలో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో 21 క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. తర్వాతి వారంలో వీటిని 50కి పెంచనున్నట్లు వివరించారు. ప్రత్యేక ఫీవర్ క్లినిక్స్‌లో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని తెలిపారు. -
ఏ ‘మాత్రం' లక్ష్యం లేదు
విజయనగరం ఫోర్ట్: ఆదాయార్జనే ధ్యేయం. ఆరోగ్య పరిరక్షణ పూజ్యం. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటికి అనుబంధంగా ల్యాబ్‌రేటరీలు కూడా సందుకొకటి వెలుస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ప్రతి వైద్యునికి ఒకటి రెండు క్లినిక్‌లున్నాయి. వీటన్నిటికీ వైద్యశాఖ అనుమతి ఉన్న దాఖలాల్లేవు. కనీసం సగం ఆస్పత్రులకు కూడా లేకపోవడం గమనార్హం. అధికారుల ఉదాసీనత వైద్య ఆరోగ్య శాఖాధికారులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోని ఆస్పత్రులు గురించి పట్టించుకోవడం లేదు. ఏటా దృష్టి సారిస్తున్నామని చెప్పడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు కూడా తమను ఎవరేమీ చేయలేరనే ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల యజమానులతో సమావేశమై రిజిస్ట్రేషన్ చేయించుకోమని గట్టిగాద సందర్భాలు కానరావడం లేదు. ఇలాంటి ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే రోగులు కూడా నష్టపోతారు. ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వంటి సౌకర్యాలు వర్తించవు. ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వైద్య ఆరోగ్యశాఖకు కూడా ఆదాయం వస్తుంది. కానీ ఆ దిశగా ఆ శాఖాధికారులు కసరత్తు చేయడం లేదు. క్లినిక్ అయితే రిజిస్ట్రేషన్ నిమిత్తం రూ.2500 వైద్య ఆరోగ్యశాఖకు చెల్లించాలి. నర్సింగ్‌హోమ్‌లు రూ.3750, 20 నుంచి 50 పడకల ఆస్పత్రి రూ.7500, 50 దాటితే రూ.10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అయిదేళ్ల వరకు చాలు. అయిదేళ్లు దాటితే రెన్యువల్ చేయించుకోవాలి. కొత్త స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్‌కు రూ.35,000 రుసుము చెల్లించాలి. ల్యాబ్రేటరీలకు రూ.2500 చెల్లించాలి. సీటీ స్కాన్, ఎంఆర్ స్కాన్లకు అయితే రూ.17,500 చెల్లించాలి. జిల్లాలోని ఆస్పత్రులు, ల్యాబ్‌రేటరీలు, నర్సింగ్‌హోమ్‌లన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వైద్య ఆరోగ్యశాఖకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అనుమతి లేకున్నా వైద్యం జిల్లాలో 400 వరకు ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లున్నాయి. వీటిలో 203 ఆస్పత్రులు, ల్యాబ్‌లు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ వద్ద నమోదు చేయించుకున్నాయి. వైద్య శాఖ అనుమతి లేకుండానే ప్రైవేటు ఆస్పత్రులను నిర్వహిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నాయి. ఆస్పత్రులకు వచ్చే రోగులకు అధిక మెత్తంలో బిల్లులు వేసి అడ్డంగా దోచేస్తున్నారు. సాధారణ జ్వరాలకు కూడా వేలాల్లో బిల్లులు వేసేసి దోచేస్తున్నారు. జిల్లాలో 200 వరకు ల్యాబ్‌రేటరీలు, క్లినిక్‌లు రిజిస్ట్రేషన్ లేకుండానే ఆస్పత్రులను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేయించుకోమంటున్నాం జిల్లాలో 203 క్లినిక్‌లు, ల్యాబ్‌రేటరీలు, నర్సింగ్‌హోమ్‌లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోని ఆస్పత్రులకు కూడా చేయించుకోమని చెబుతున్నాం. – సి.పద్మజ, డీఎంహెచ్ఓ -
హైదరాబాద్‌లో కపివ క్లినిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ బైద్యనాథ్ గ్రూప్ కంపెనీ ‘కపివ’ త్వరలో హైదరాబాద్‌లో క్లినిక్స్‌ను ప్రారంభించనుంది. ప్రస్తుతం ముంబైలో నాలుగు కేంద్రాలను కపివ నిర్వహిస్తోంది. అలాగే బైద్యనాథ్ కో–బ్రాండెడ్‌లో కోల్‌కతాలో నాలుగు క్లినిక్స్ నడుస్తున్నాయి. 2018 డిసెంబరుకల్లా 20 సెంటర్లు అందుబాటులోకి వస్తాయని కపివ ఫౌండర్ శ్రే బధాని సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. వీటిలో మూడు కేంద్రాలు మార్చికల్లా హైదరాబాద్‌లో మొదలవుతాయన్నారు. నిపుణులైన వైద్యులతో పాటు ఫార్మసీ ఉంటుందని వివరించారు. ప్రముఖ వైద్యులతో చేతులు కలిపి కపివ కో–బ్రాండెడ్‌లో క్లినిక్స్‌ను ప్రమోట్ చేస్తామన్నారు ‘ప్రస్తుతం కపివ బ్రాండ్‌లో 180 ఔషధాలు ఉన్నాయి. ఆన్లైన్లో దేశవ్యాప్తంగా వీటిని విక్రయిస్తున్నాం. ఆఫ్‌లైన్‌లో ప్రస్తుతం ముంబై, కోల్‌కతాకు పరిమితమయ్యాం. ఆన్లైన్ అమ్మకాల్లో 45 శాతం హైదరాబాద్ నుంచి సమకూరుతోంది. అందుకే భాగ్యనగరితోపాటు బెంగళూరులోని ఆయుర్వేద మందుల షాపుల్లో మా ఉత్పత్తులు పరిచయం చేయనున్నాం. విభిన్న ఫార్ములేషన్స్‌తో ఔషధాలను తయారు చేస్తున్నాం. ఒక్కో ఉత్పాదన తయారీకి పరిశోధనకు 18 నెలల దాకా సమయం పడుతోంది. 50 మంది నిపుణులైన వైద్యులు ఆర్అండ్డీలో నిమగ్నమయ్యారు’ అని తెలిపారు. -
మధుమేహంపై ఏటా రూ.1.5 లక్షల కోట్లు
• అపోలో షుగర్ సీఈఓ గగన్ భల్లా • మూడేళ్లలో 250 అపోలో షుగర్ క్లినిక్స్ ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇపుడు ఆరున్నర కోట్ల మందికి మధుమేహం ఉంది. వీరు ఏటా చికిత్స కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది కేంద్రం వైద్య రంగానికి కేటాయించే బడ్జెట్ కంటే 4.7 రెట్లు ఎక్కువ. ఇదీ... అపోలో షుగర్ క్లినిక్స్ సీఈఓ గగన్ భల్లా మాట. వేళకు తినకపోవటం, రాత్రి విధులు, ఒత్తిడి వంటివి దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. మధుమేహ పరీక్షలకు ప్రభుత్వం తలపెట్టనున్న కార్యక్రమంలో పీపీపీ విధానంలో తామూ భాగస్వామ్యమవుతామని మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారాయన. దేశంలోని మొత్తం డయాబెటిక్ పేషెంట్లలో 28 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారని, ఇందులో 18 శాతం యువతే ఉన్నారని భల్లా చెప్పారు. పేర్కొన్నారు. 3 ఏళ్లలో 300 క్లినిక్స్ లక్ష్యం.. ప్రస్తుతం దేశంలో 50 అపోలో షుగర్ క్లినిక్స్ ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 11, ఏపీలో 2 క్లినిక్స్ మిగిలినవి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో వరంగల్‌లో తొలి అపోలో క్లినిక్‌ను ప్రారంభిస్తున్నట్లు గగన్ తెలియజేశారు. వచ్చే మూడేళ్లలో తెలంగాణ, ఏపీల్లో అపోలో షుగర్ క్లినిక్స్ సంఖ్యను 50కి.. మొత్తంగా 300 క్లినిక్స్‌కు చేర్చాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. వీటిలో సొంత క్లినిక్స్‌తో పాటూ పార్టనర్ క్లినిక్స్ కూడా ఉంటాయన్నారు. -
డాక్టర్స్ లేన్...
సినిమాలకు క్రాస్‌రోడ్స్.. అమ్మాయిల షాపింగ్‌కు కోటి... ఇలా హైదరాబాద్‌లో కొన్ని అడ్డాలున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కేపీహెచ్‌బీలోని రోడ్‌నెంబర్ 4 చేరింది. ఆ గల్లీలో వందలాది క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోంలు, టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్లు... ఇలా మనిషికి అవసరమయ్యే ప్రతి స్పెషాలిటీ క్లినిక్ కనబడుతుంటుంది. 2006కు ముందు ఏ మాత్రం చడిచప్పుడు లేని ఆ కాలనీ... ఇప్పుడు ఎటు చూసినా క్లినిక్‌ల మయమైంది. కొన్ని క్లినిక్‌లు ఆస్పత్రులుగా మారాయి. మెడికల్ షాప్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. 1991లో... మొదటిసారి విఘ్నేశ్ క్లినిక్, ఎస్వీఎస్ క్లినిక్ ఏర్పాటయ్యాయా గల్లీలో. అప్పుడు సాయంత్రం ఆరు దాటిందంటే ఎటు చూసినా చీకటే. కేవలం ఈ రెండు క్లినిక్‌లు కరెంట్ వెలుగులతో కనిపించేవి. ఏ రోగమొచ్చినా, ప్రసవాలైనా, రోడ్డు ప్రమాదంలో గాయాలైనా ఈ క్లినిక్‌లకు క్యూ కట్టేవారు. బొల్లారం, బాచుపల్లి, చందానగర్, మూసాపేట, లింగంపల్లి, పటాన్ చెరువు, ఆశోక్ నగర్, జీడిమెట్ల, సూరారం కాలనీవాసులకు ఈ క్లినిక్‌లే దిక్కు. ఆ రెండు తరువాతి రోజుల్లో విఘ్నేశ్ నర్సింగ్ హోమ్‌గా, ఎస్వీఎస్ చిల్డ్రన్ హాస్పిటల్‌గా మారిపోయాయి. కార్పొరేట్ హంగులతో రెడిమేడ్ ఆస్పత్రి రావడంతో కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ 4 దశ తిరిగింది. ఈ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లే పార్ట్‌టైమ్‌గా ఈవెనింగ్ క్లినిక్‌లు ప్రారంభించారు. రోగులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆ లైన్ కాలక్రమేణా డాక్టర్ లేన్‌గా మారింది. ఇప్పుడు కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ నాలుగు అనేకంటే డాక్టర్స్ గల్లీ అంటేనే సులభంగా గుర్తు పడతారు. ఎందుకీ డిమాండ్... ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లినా కన్సల్టెంట్ ఫీజు... రూ. 500లకు తక్కువ లేదు. కార్పొరేట్ ఆస్పత్రి కన్నా కన్సల్టెంట్ ఫీజు తక్కువ ఉండటం, రీజనబుల్ ధరలకే రూమ్‌లు దొరకడంతో వీటికి రోగుల తాకిడి పెరిగింది. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా వెలవడంతో అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమీప ప్రాంతాలైన కూకట్పల్లి, మియాపూర్‌లో నివాసాలు ఏర్పరుచుకోవడం, ఇతర జిల్లాలనుంచి వచ్చిన మధ్య తరగతి కుటుంబాలు కార్పొరేట్ ఖర్చులు పెట్టలేక అందుబాటులో ఉన్న ఈ క్లినిక్లవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రేటులోనే ట్రీట్మెంట్ పూర్తవడం, డాక్టర్ల గురించి ఎక్కువ సేపు వేచివుండాల్సిన అవసరం లేకపోవడం... వంటికారణాలన్నీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి. టెస్టుల కోసం... ఎంతో దూరంనుంచి హాస్పిటల్‌కు వెళ్తే.. డాక్టర్ టెస్టులు రాస్తాడు. వాటికోసం మళ్లీ ఇంకెక్కడికో పరుగెత్తాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా... అన్ని పరీక్షలకు అవసరమైన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఈ లేన్‌లో ఉన్నాయి. కార్డియాల జిస్ట్, డెర్మటాల జిస్ట్, గ్యాస్ట్రాంటల జిస్ట్, గైనకాల జిస్ట్, హెమటాల జిస్ట్, నెఫ్రాల జిస్ట్, న్యూరోసర్జన్, అర్థోపెడిస్ట్, సర్జన్, యూరాల జిస్ట్, డెంటిస్ట్, ఐ స్పెషలిస్ట్... ఇలా ఒకటి కాదు... స్పెషలిస్ట్ క్లినిక్‌లు.. ప్రతి ఒక్కటీ కొలువుదీరాయిక్కడ. - వీఎస్