
న్యూఢిల్లీ: కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్స్‌ను ప్రారంభించినట్లు అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టయిల్‌లో భాగమైన అపోలో క్లినిక్స్ వెల్లడించింది. జ్వరాలు, తత్సంబంధిత లక్షణాల గురించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. తొలి దశలో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో 21 క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. తర్వాతి వారంలో వీటిని 50కి పెంచనున్నట్లు వివరించారు. ప్రత్యేక ఫీవర్ క్లినిక్స్‌లో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment