సైబర్ నేరగాళ్లు ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇంతవరకు ఆన్‌లైన్ మోసాలకు లేదా కొత్త తరహాలో వ్యక్తుల డేటాను తస్కరించి బ్లాక్‌మెయిల్‌తో డబ్బులు గుంజడం వంటి సైబర్ నేరాలు చూశాం. అక్కడితో ఆగకుండా దేవాలయాల్లాంటి ఆస్పత్రులపై కూడా సైబర్ నీడ పడింది. వాటిని కూడా టార్గెట్ చేసి రోగుల వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో లాస్‌వేగస్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..లాస్‌వేగస్‌లోని ప్లాస్టిక్‌సర్జరీ క్లినిక్ హాంకిన్స్ అండ్ సోహ్న్ హెల్త్‌కేర్ హ్యాకర్ల బారిన పడింది. ఆ క్లినిక్‌కి వచ్చిన రోగులు వ్యక్తిగత డేటా, ఆపరేషన్‌కి ముందు తర్వాత తీసిన వ్యక్తిగత న్యూడ్ ఫోటోలతో సహా హ్యాక్ చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వివాదంలో చిక్కుకుపోయింది. హెల్త్‌కేర్ సెక్టార్‌కి సంబంధించి రోగులు డేటా భద్రత విషయమై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని తెలియజేస్తోంది.
ఈ ఘటనలో ముఖ్యంగా బాధిత మహిళ రోగుల డేటానే ఎక్కువగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రోగులు శస్త్ర చికిత్స, వ్యక్తిగత సమాచారం తోపాటు బ్యాంకు అకౌంట్ల నంబర్లను హ్యాకింగ్ గురయ్యాయి. సదరు ఆస్పత్రి తమ ఆరోగ్య భద్రతను కాపాడటంలో విఫలమైందంటూ బాధితుల నుంచి ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేగాదు సదరు ఆస్పత్ర ప్రజల హెల్త్ కేర్ పేషెంట్ల డేటా ప్రొటెక్షన్‌కి చట్టాలకు కట్టుబడి లేదంటూ విమర్శలు వచ్చాయి. భాదితమహిళలు తమకు జరిగిన నష్టానికి సదరు ఆస్పత్రి తగిన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఆస్పత్రులు రోగుల నమ్మకాలు, భావోద్వేగాలతో ఆడుకుందంటూ మండిపడుతున్నారు. ఆస్పత్రుల డేటాను పర్యవేక్షించడంలో సైబర్ సెక్యూరిటీ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కారణంగా రోగుల హెల్త్ డేటా భద్రత విషయమై క్లినిక్‌లపై చెరగని మచ్చ ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ యుగంలో భద్రత అన్నదే కరువైందంటూ సదరు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు కేవలం కంపెనీలు, మనుషుల వ్యక్తి గత డేటానే గాదు ఆస్పత్రుల డేటాపై కూడా సైబర్ దాడి చేయడం బాధకరం. సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలకి సంబంధించిన డేటాకి సైబర్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ మేరకు లాస్‌వేగాస్ పోలీసులు ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టారు. ఏదిఏమైనా తస్మాత్ జాగ్రత్త! డేటా అపహరణకు గురికాకుండా ఎవరికివారుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోక తప్పదని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి.
(చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!)
Comments
Please login to add a commentAdd a comment