taskforce raids
-
హైదరాబాద్లో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో భారీగా హవాలా నగదును నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా హవాలా నగదును సీజ్ చేశారు.ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఓ పార్టీకి చెందిన నగదును పోలీసులు ఇలానే పట్టుకున్నారు. కాగా ఇంత పెద్ద మొత్తంలో హవాలా సొమ్మును తరలించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
భారీగా ఐపీఎల్ బెట్టింగ్; ఏడుగురు అరెస్ట్
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాకు చెందిన ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 15 వేల రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో లో ఏడుగురు పట్టుబడగా.. వారిపై పోలీసులు కరీంనగర్ రూరల్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. బెట్టింగ్ తో రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపి అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు బెట్టింగ్లో డబ్బులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. -
వ్యభిచార గృహంపై దాడి; ఆరుగురి అరెస్ట్
సాక్షి, విశాఖపట్టణం : నగరంలోని మురళీనగర్ కంచరపాలెం వద్ద ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. దాడిలో పట్టుబడిన ముగ్గురు మహిళా నిర్వాహకులు, ఇద్దరు యువతులు, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5300 నగదు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
టాస్క్ ఫోర్స్ దాడులు.. స్మగ్లర్ అరెస్ట్
తిరుపతి: జూపార్క్ సమీపంలో టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక జూపార్క్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేపట్టి.. ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న ఓ స్మగ్లర్ ను అరెస్ట్ చేసి వారి ముఠావద్ద నుంచి రూ.20 లక్షల విలువైన ఎర్రచంద్రనం స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెజవాడలో 10మంది బుకీల అరెస్ట్
విజయవాడ : ఓ వైపు వరల్డ్ కప్ మ్యాచ్లు కొనసాగుతుంటూ మరోవైపు బెట్టింగ్ బాబుల జోరు ఊపందుకుంది. విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 10మంది బుకీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.42 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా నగరంలో క్రికెట్ బెట్టింగ్లు గుట్టుగా నడుస్తున్నాయి. భారత్, సౌతాఫ్రికా మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెట్టింగ్ జోరందుకుంది. తమ అభిమాన క్రికెటర్ బౌలర్, బ్యాట్ మెన్లపై వ్యక్తిగత పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు టీం జయాపజయాలపై పందాలు కాస్తున్నారు.