
తెగిపడిన వేలు
మల్కాజిగిరి: దారి ఇవ్వాలని అడిగినందుకు కారులో వెళుతున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనదారుడి వేలు కొరికిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ జాఫర్ పెయింటర్‌గా పనిచేసేవాడు.
ఈ నెల 24న అతను బైక్‌పై లాలాపేట్ వెళుతుండగా మౌలాలి కమాన్ వద్ద ఎదురుగా ఇండికా కారు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు కొద్దిగా పక్కకు తీస్తే తాను వెళ్లిపోతానని జాఫర్ కోరడంతో ఆగ్రహానికి లోనైన కారు డ్రైవర్ మహ్మద్ ఆలి అతడిని దూషించడమే కాకుండా అతడిపై దాడి చేసి కుడిచేతి ఉంగరం వేలు కొరికివేయడంతో వేలే తెగి పడింది. తెగిపడ్డ వేలుతో వెంటనే ఆస్పత్రికి వెళ్లిన జాఫర్ చికిత్స అనంతరం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు మహ్మద్ ఆలిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్ ఆలి మౌలాలి షాదుల్లానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment