
బెంగళూరు: ప్రతి మనిషికీ కాళ్లు చేతులకు కలిపి 20 వేళ్లుంటాయి. కానీ శివమొగ్గ తాలూకాలో ఉన్న వ్యక్తికి రెండు కాళ్లు, రెండు చేతులకు కలిపి మొత్తం 24 వేళ్లు ఉంటాయి. బసవనగంగూరులో నివసించే మంజునాథ్‌కు ఈ ప్రత్యేకత సొంతం. ఒక్కో చేతికి ఆరేసి వేళ్లు, ఒక్కో కాలికి ఆరు చొప్పున వేళ్లతో ఇతడు చూపరులను ఆశ్చర్యపరుస్తాడు. ఒక మనిషికి 24 వేళ్లు ఉండడం చాలా అరుదు అని స్థానిక ప్రజలు ఆంటున్నారు. కూలీ పనులు చేసుకునే మంజునాథ్ ఇంట్లో అతని తల్లి, సోదరికి 21 వేళ్లు, తమ్మునికి 22 వేళ్లు ఉన్నాయి.
చదవండి: టీచర్ వికృతానందం.. మహిళలకు అసభ్యకరంగా ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపి..
Comments
Please login to add a commentAdd a comment