Jersey Finger Disease: Interesting Facts About Jersey Finger Disease, Symptoms And Treatment In Telugu - Sakshi
Sakshi News home page

'జెర్సీ' పేరు మీద ఓ జబ్బు ఉంది తెలుసా? చికిత్స వివరాలు ఇవిగో..

Published Sun, Jan 9 2022 4:31 AM | Last Updated on Sun, Jan 9 2022 11:37 AM

Intresting Facts Jersey Finger Disease Symptoms And Treatment - Sakshi

ఆటగాళ్లు ధరించే ప్రత్యేకమైన షర్ట్‌ను ‘జెర్సీ’ అంటారన్న సంగతి తెలిసిందే కదా. ఆ జెర్సీ పేరు మీద కూడా ఓ జబ్బు ఉంది. దాని పేరే ‘జెర్సీ ఫింగర్‌’! ఈ జబ్బు ఎందుకు వస్తుందో, దానికి చికిత్స ఏమిటన్న విషయాలు తెలిపే సంక్షిప్త కథనమిది. 

మైదానంలో ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ, ప్రత్యర్థిని  నిలువరిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో తమకు తెలియకుండానే వేళ్లన్నీ గుప్పిటలా బిగించి... ప్రత్యర్థి జెర్సీని అప్రయత్నంగానే లాగేస్తుతుంటారు. మరీ ముఖ్యంగా ఫుట్‌బాల్‌ ఆటలో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆటగాళ్లు వేగంగా ఆడే సమయంలో... వారి వేళ్ల కండరాలు చురుగ్గా కదిలేందుకు కొన్ని టెండన్స్‌ తోడ్పడుతుంటాయి. ఈ టెండన్స్‌ అనేవి ఎముకలనూ, కండరాలను కలుపుతూ ఉంటాయి. ఇలాంటి టెండన్స్‌లో ‘ఫ్లెక్సార్‌ టెండన్‌’ చాలా ప్రధానమైనది.

ఆటగాళ్ల కదలికల సమయంలో ఈ ఫ్లెక్సార్‌ టెండన్‌ చీరుకుపోవడమో లేదా దెబ్బతినడమో జరగవచ్చు. ఇదే జరిగితే... ఆటగాళ్ల మణికట్టులోగానీ, అరచేతిలోగానీ లేదా నేరుగా వేళ్లకే తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ కారణంగా వచ్చే నొప్పినే ‘జెర్సీ ఫింగర్‌’ అంటారు. జెర్సీ ఫింగర్‌తో బాధపడే ఆటగాళ్లు... తమ వేలిని ఏమాత్రం ఒంచలేకపోవడం, అది పూర్తిగా మొద్దుబారడం, గాయపడిన భాగం ఎర్రబారడం, ముట్టుకోనివ్వకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు.  

మేనేజ్‌మెంట్‌ / చికిత్స : 
గాయపడ్డ చేతికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం లేదా దాని కదలికలను పూర్తిగా నివారించేలా ఓ స్లింగ్‌ అమర్చడం ద్వారా కొద్దిరోజుల్లోనే సమస్య దానంతట అదే తగ్గుతుంది. బాధ చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉంటే... అప్పుడు ఫ్లెక్సార్‌ టెండన్‌ అతుక్కుని ఉండవలసిన కండరానికి, ఎముకకూ దాన్ని కలిపేలా ఓ చిన్నపాటి శస్త్రచికిత్స అరుదుగా అవసరం పడవచ్చు. టెండన్‌ చిరిగినప్పుడు మాత్రమే ఈ శస్త్రచికిత్స అవసరమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement