ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల గౌనులు, డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అయితే అస్సాంకి చెందిన ప్రఖ్యాత నటి ఐమీ బారుహ్ మాత్రం ఈ ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసింది. దేశీ సంప్రదాయ చీర కట్టులో తళ్లుక్కుమని భారతీయలు ఆత్మగౌరవమే ఈ చీరకట్టు అని చాటి చెప్పింది.
ఐమీ బారుహ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సాంప్రదాయ అస్సామీ దుస్తులు ధరించి రెడ్‌కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె అస్సామీ సంప్రదాయ చీట్టు స్టైల్ చూపురులను చూపుతిప్పుకోనివ్వలేదు. అక్కడున్నవారంతా సంప్రదాయ అస్సామీ సంస్కృతికి కనెక్ట్ అయ్యేలా ఐమీ బారుహ్ ఆహార్యం ఉంది. ఆ చీర అహోం రాజవంశ కాలం నాటి ముగాట్టు. దానిపై పురాతన గోజ్ బోటా డిజైన్ నాటి సంస్కృతిని అద్దం పట్టేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
అలాగే ఐమీ చేతికి ధరించిన గమ్‌ఖరు అనేది అస్సాం శ్రేయస్సు, రక్షణకు సాంప్రదాయ చిహ్నం. ఐమీ ఈ వేడుకలో అస్సాం చేనేత పరిశ్రమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ చీర పత్తి, గుణ నూలు మిశ్రమంతో తయారైన ఐదు వేర్వేరు రంగుల దారాలతో రూపొందించారు. ఈ మేరకు ఐమీ సోషల్ మీడియా పోస్ట్‌లో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐకానిక్ రెడ్ కార్పెట్‌పై మూడవసారి అడుగుపెడుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.
ఒక అస్సామిగా గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మా వారసత్వాన్ని సూచించే రెండు వందల ఏళ్లనాటి సంప్రదాయ డిజైన్‌తో కూడిన చేనేత చీర, మణికట్టుపై గమ్‌ఖారు ధరించి ర్యాంప్‌పై నడవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యావాదాలు అని రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
(చదవండి: అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?)
Comments
Please login to add a commentAdd a comment