తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక దిగ్గజాలను కలుస్తూ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు, ఫౌండర్ అంజి మారంతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ సెల్ కో-ఆర్టినేటర్ మహేశ్ బిగాల సైతం కంపెనీ ప్రతినిధులను కలిశారు.
నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్దత వ్యక్తం చేశారని మహేశ్ బిగాల తెలిపారు.నిజామాబాద్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో క్రిటికల్ రివర్ కంపెనీ ఓ బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
అలాగే ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్, విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్నారై, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ TSTPC విష్ణు వర్ధన్ రెడ్డి, క్రిటికల్ కేర్ ఫౌండర్ అంజి మారం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment