
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి24) సాయంత్రం సిరిసిల్లలో కొద్దిసేపట్లో కేటీఆర్ ప్రారంభిస్తారనగా కమ్యూనిటీ హాలుకు మున్సిపల్ అధికారులు తాళం వేశారు.కేటీఆర్‌తో కమ్యూనిటీ హాల్ ప్రారంభింపచేయడానికి పాలకవర్గం సిద్ధం చేసుకుంది.
అయితే ఈ ప్రారంభంపై ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ పనులు ఇంకా పూర్తి కాలేదని,ప్రోటోకాల్ పాటించి కమ్యూనిటీ హాల్‌కు విప్ ఆది శ్రీనివాస్ పేరు వేయలేదని ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు అడ్డుకట్ట వేశారు.
అయితే శుక్రవార సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించి పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పక్క నియోజకవర్గమైన వేములవాడకు కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
విప్ పదవిలో ఉన్న తమ నేత పేరును పక్క నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై రాయకపోవడం ఆది శ్రీనివాస్ వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment