rajanna sircilla
-
కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో వివాదం
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి24) సాయంత్రం సిరిసిల్లలో కొద్దిసేపట్లో కేటీఆర్ ప్రారంభిస్తారనగా కమ్యూనిటీ హాలుకు మున్సిపల్ అధికారులు తాళం వేశారు.కేటీఆర్‌తో కమ్యూనిటీ హాల్ ప్రారంభింపచేయడానికి పాలకవర్గం సిద్ధం చేసుకుంది.అయితే ఈ ప్రారంభంపై ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ పనులు ఇంకా పూర్తి కాలేదని,ప్రోటోకాల్ పాటించి కమ్యూనిటీ హాల్‌కు విప్ ఆది శ్రీనివాస్ పేరు వేయలేదని ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు అడ్డుకట్ట వేశారు. అయితే శుక్రవార సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించి పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పక్క నియోజకవర్గమైన వేములవాడకు కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.విప్ పదవిలో ఉన్న తమ నేత పేరును పక్క నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై రాయకపోవడం ఆది శ్రీనివాస్ వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లు చెబుతున్నారు. -
‘ఉపాధి’లో తోటలు
చందుర్తి(వేములవాడ): పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1200 ఎకరాల్లో తోటల పెంపకమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 17 రకాల పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పించింది. జిల్లాలోని ప్రతీ మండలానికి 50 ఎకరాల లక్ష్యాన్ని విధించారు.విస్తృత ప్రచారంపండ్లతోటల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యానవనశాఖ అధికారులతోపాటు ఉపాధిహామీ పథకం ఫీల్డ్అసిస్టెంట్లు, ఏపీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయశాఖ విస్తరణాధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కరపత్రాలు ముద్రించి ప్రచారం చేపట్టారు. పండ్లతోటలు సాగుచేసే రైతులకు ఐదెకరాల్లోపు వ్యవసాయభూమి ఉండి చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేయాలన్న నిబంధనలు ఉండడంతో అధికారులకు సాగులక్ష్యం కష్టంగానే మారింది. అంతేకాకుండా లబ్ధిదారులకు ఉపాధిహామీ జాబ్‌కార్డు తప్పనిసరిగా ఉండాలన్న ఆంక్షలతో ఈ పథకం అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పండ్లతోటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పించడంతో నిబంధనలు పక్కాగా అమలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. మొక్కల కొనుగోలు నుంచి గుంతలు తీయించడం, ప్లాంటేషన్, ఎరువుల నిర్వహణ, కూలీల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. తొలుత లబ్ధిదారులు ఖర్చు చేస్తే తర్వాత ప్రభుత్వమే రైతుఖాతాలో జమచేస్తుంది.డ్రిప్ ఏర్పాటుపై ఆశలుడ్రిప్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తే తోటల పెంపకానికి ముందుకొస్తామన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తోటల ఖర్చు భరిస్తామనడం, నీటివసతికి కావాల్సిన నిధులను కూడా కేటాయిస్తే రైతులకు ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం అనుమతించిన 14 రకాల తోటలను రైతులు పెంచుకునే అవకాశం ఉంది. జిల్లాలో 1200 ఎకరాలు లక్ష్యం17 రకాల పండ్లతోటల పెంపకానికి అవకాశంఈనెల 31 వరకు దరఖాస్తు గడువుడ్రిప్ పరికరాలు అందించాలిపండ్లతోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వమే డ్రిప్ పరికరాలపై సబ్సిడీ ఇవ్వాలి. డ్రిప్ ఏర్పాటుకు భారీగా ఖర్చు అవుతుంది. సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సబ్సిడీపై పరికరాలను అందించాలి.– బింగి జలంధర్, బండపల్లిదరఖాస్తు చేసుకోవాలిపండ్లతోటల పెంపకానికి ముందుకొచ్చే రైతులు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి, ఉపాధిహామీ జాబ్‌కార్డు ఉండాలి. ఏయే పండ్లతోటలు సాగు చేస్తారో దరఖాస్తులో నమోదుచేయాలి.– రాజయ్య, ఏపీవో, చందుర్తి -
సిరిసిల్ల బ్రాండ్ బ్యాండేజీ..!
సిరిసిల్ల: మార్కెట్లో ఏ బట్టకు డిమాండ్ ఉంటే, ఆ బట్టను కాలానికి అనుగుణంగా ఉత్పత్తి చేస్తేనే పోటీ ప్రపంచంలో మనుగడ ఉంటుంది. ఈ వ్యాపార సూత్రాన్ని ఆకలింపు చేసుకున్న సిరిసిల్లలోని కొందరు వ్రస్తోత్పత్తిదారులు కాటన్ బట్ట ఉత్పత్తికి స్వస్తి పలికారు. బ్యాండేజీ బట్ట ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఈ బట్టను శుద్ధి చేసి, ప్రాసెసింగ్ చేసిన తర్వాత నీట్‌గా స్టెరలైజ్లో ప్యాకింగ్ చేసి ఆస్పత్రుల్లో గాయాలకు కట్లు కట్టేందుకు వినియోగిస్తారు. వినాయకచవితి సందర్భంగా వివిధ రంగుల్లో ఈ బ్యాండేజీ బట్టను ప్రాసెస్ చేసి వినియోగిస్తారు. సిరిసిల్లలో కొత్తగా ఆలోచించే కాటన్ యజమానులు బ్యాండేజీ బట్ట ఆర్డర్లు తీసుకొని సాంచాలపై కొత్త రకం బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్ల వ్రస్తోత్పత్తి రంగంలో వచ్చిన ఈ మార్పుతో నేతన్నలకు మెరుగైన ఉపాధి లభిస్తున్నది. సర్కారు వైపు చూడకుండా.. సిరిసిల్ల పాలిస్టర్ యజమానులు, ఆసాములు ప్రభు త్వం ఇచ్చే వస్త్రోత్పత్తి ఆర్డర్లకు చూస్తుండగా, కాటన్ వస్త్రోత్పత్తిదారులు సొంత వ్యాపారం నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలిస్టర్ వ్రస్తోత్పత్తిదారులు బతుకమ్మ చీరలు, ఆర్వీఎం, రంజాన్, క్రిస్మస్ వంటి ఆర్డర్లతో కాలం వెళ్లదీశారు. కాటన్ వస్త్రపరిశ్రమకు ప్రభుత్వ పరంగా ఆర్డర్లు రాకపోయినా, సొంతంగా ఆర్డర్లు సంపాదించుకొని మార్కెటింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు 160 డయింగ్(అద్దకం) యూనిట్లతో సిరిసిల్ల కాటన్ పరిశ్రమ ఉపాధి కేంద్రంగా ఉండేది. కానీ ప్రస్తుతం 50 డయింగ్ యూనిట్లకు చేరింది. ఇలాంటి తరుణంలో కాటన్ వస్త్రవ్యాపారులు కొత్త కం బ్యాండేజీ బట్టను ఉత్పత్తి చేస్తున్నారు.సాంచా నడుపుతున్న ఇతని పేరు చిలుక మల్లేశం. సిరిసిల్లలో కాటన్ బట్టను ఉత్పత్తి చేసే మల్లేశం కొత్తగా బ్యాండేజీ బట్టను తక్కువ పిక్కుల (పోగులు)తో బట్ట జాలి(రంధ్రాలు) ఉండే విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో లంగాల బట్టను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.22 లభించేది. కానీ దీనికి డిమాండ్ లేదు. ప్రస్తుతం బ్యాండేజీ బట్టను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.19 లభిస్తున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. -
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి అడ్డంగా పట్టుబడ్డారు. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ 30,000 డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. నేడు రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమలాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి.అయితే సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ చేపడితే అనేక అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తహసిల్దా్ర్‌ను ఏసీపీ పట్టుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పైసలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 7 వేలు లంచం తీసుకుంటూ చాయితీరాజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్‌ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
18 ఏళ్ల తరువాత.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు
సాక్షి, సిరిసిల్ల: సుదీర్ఘ కాలం దుబాయ్ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో జైలు నుంచి విడుదలైన వీరికి ఆయనే సొంత ఖర్చులతో విమాన టికెట్లు అందజేశారు. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన సిరిసిల్లకు చెందిన దండుగుల లక్ష్మణ్ రెండు రోజుల క్రితం విడుదలైన రుద్రంగి మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. పెద్దూరు గ్రామానికి చేరుకున్న శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు కార్మికులు మంగళవారం సిరిసిల్లకు చేరుకున్నారు. వచ్చే నెలలో చందుర్తికి చెందిన మరో కార్మికుడు వెంకటేశ్ జైలు నుంచి విడుదలై తిరిగి రానున్నానడు. కమ్యూనికేషన్ సమస్య వల్ల దుబాయ్ జైల్లో మగ్గిపోయిన వీరిని విడిపించేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దీంతో దుబాయ్‌లో జైలు పక్షులుగా మారిన సిరిసిల్ల వాసులు ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం కనీళ్లు, ఆనంద భాష్పాలతో కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. ఇదీ చదవండి.. రాజకీయాలకు రైతులను బలి చేయొద్దు -
క్రికెట్ వరల్డ్‌కప్ జట్టులో పోత్గల్ కుర్రాడు.. కేటీఆర్ హర్షం! పోస్ట్ వైరల్
U19 World Cup 2024 India Squad: యువ క్రికెటర్లు అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్‌లకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభినందనలు తెలిపారు. వీరిద్దరు కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19- ఫిబ్రవరి 11 వరకు అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఇందులో పాల్గొనబోయే భారత యువ జట్టును మంగళవారం ప్రకటించింది. ఇదే టీమ్ సౌతాఫ్రికాతో ట్రై సిరీస్‌లోనూ పాల్గొననుంది. పోత్గల్ కుర్రాడంటూ కేటీఆర్ హర్షం ఇక మొత్తంగా పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్‌లకు చోటు దక్కింది. ఈ విషయంపై స్పందించిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ జట్టు, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్ ఆడే జట్టు ఎంపికైనందుకు అరవెల్లి అవినాశ్ రావుకు శుభాకాంక్షలు. ఈ యువ క్రికెటర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్ గ్రామంలో పుట్టిపెరిగాడు’’ అంటూ అవినాశ్ సక్సెస్ పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. Hearty congratulations to Aravelly Avanish Rao on getting selected for U-19 Cricket World Cup and Tri Series in South Africa. This promising cricketer hails from Pothgal village in Rajanna Sircilla Constituency. pic.twitter.com/yGMX7YYpnd — KTR (@KTRBRS) December 14, 2023 అభిషేక్‌కు కూడా కంగ్రాట్స్ కాగా ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికట్లో కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నుంచి శాసన సభ్యులుగా మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మరో ట్వీట్లో అభిషేక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘హైదరాబాద్ నుంచి అండర్-19 వరల్డ్‌కప్ జట్టుకు సెలక్ట్ అయిన మురుగన్ అభిషేక్‌కు కంగ్రాట్స్. అవినాశ్, అభిషేక్ ఇద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అవినాశ్ వికెట్ కీపర్‌గా.. అభిషేక్ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇక వీరిద్దరు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ క్రమంలో అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో ఆడుతున్నారన్న సంగతి తెలిసిందే. Would also like to Congratulate another bright lad from Hyderabad, Murugan Abhishek, who made it to the U-19 squad. Best wishes to both these youngsters 👍 pic.twitter.com/SGqaA2Tr23 — KTR (@KTRBRS) December 14, 2023 అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. -
KTR: సరదా రామన్న.. స్వయంగా బోటు నడుపుతూ షికారు (ఫొటోలు)
-
Sircilla: కేటీఆర్‌ను ఢీ కొట్టుడు కష్టమే!
సిరిసిల్ల నియోజక వర్గంలో ప్రధానముగా పద్మశాలి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు కులస్థులు ఎక్కువ. మిగతా బీసీ కులాలు కూడా నియోజకవర్గములో అభ్యర్థుల గెలుపు ఓటములు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా షెడ్యూల్ కాస్ట్ (17శాతం) వారు కూడా నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. పార్టీల వారిగా పోటీ చేసే అభ్యర్థులు! బీఆర్ఎస్ కేటీఆర్ బీజెపి కటకం మృత్యుంజయం లగిశెట్టి శ్రీనివాస్ ఆవునూరి రమాకాంత్ రావు రెడ్డెబోయిన. గోపి మోర. శ్రీనివాస్ కాంగ్రెస్: కేకే మహేందర్ రెడ్డి చీటి ఉమేష్ రావు సంగీతం శ్రీనివాస్ నాగుల సత్యనారాయణ గౌడ్. కేటీఆర్ మంత్రి అయిన తర్వాత సిరిసిల్లకు జరిగిన అభివృద్ధి పనులు సిరిసిల్ల చేనేత కార్మికుల కొరకు బతుకమ్మ చీరలు ఆర్ వి ఎం క్లాత్ సిరిసిల్లలోనే ఉత్పత్తి నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు, ఐటిఐ కాలేజ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఆపరాల్ పార్కు నిర్మాణం జరుగుతుంది వర్కర్ టు ఓనర్ స్కీం షేడ్స్ నిర్మాణంలో ఉన్నవి అగ్రికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ కలెక్టర్ చౌరస్తా నుండి వెంకటాపూర్ వరకు 11 కిలోమీటర్ల ఫోర్ లైన్ బైపాస్ డబుల్ రోడ్డు ప్రారంభం సిద్ధంగా ఉంది. సివిల్ హాస్పిటల్ లో డయాలసిస్‌సెంటర్ మరియు సిటీ స్కాన్ ఆక్సిజన్ ప్లాంట్, అదనంగా మరో వంద పడకల ఆసుపత్రి గంభరావుపేట మండలంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య ప్రారంభం రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సిరిసిల్ల నేత కార్మికుల కొరకు ఉచిత ప్రమాద బీమా మంత్రి కేటీఆర్ సొంత డబ్బులతో ప్రీమియం అధునాతన వ్యవసాయ మార్కెట్‌తో పాటు డిపిఓ భవనం నిర్మాణం పూర్తి. మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో ఉంది. ఇక్కడ ఆధునిక మరమగ్గాలపై వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, పరిశోధన సంస్థ నిర్మాణంలో ఉంది.మధ్యమానేరు బ్యాక్ వాటర్ . తో సిరిసిల్ల పట్టణానికి పర్యాటక శోభ.... సిరిసిల్ల నియోజకవర్గ సమస్యలు : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి యారన్ డిపో లేకపోవడం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి వస్త్రాన్ని ఎగుమతి చేసేందుకు సరైన మార్కెట్ వసతి లేకపోవడం. చిన్న కుటీర మరమగ్గాల పరిశ్రమకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా ఉచిత విధ్యుత్ సరఫరా లేదు. బతుకమ్మ చీరల వలన సంవత్సరములో కేవలం మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే పని, మిగతా నెలలు సరైన పనిలేకపోవడం. నియోజక వర్గములో 9వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగడం. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో ఉన్నత చదువుల కోసం డిగ్ర కళాశాలలు లేకపోవడం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో 30 పడకల ఆసుపత్రి లేకపోవడం వలన ఇబ్బందులు. బీడీ కార్మికుల కోసం కేంద్ర కార్మిక శాఖ నిర్మిస్తామన్న ఆసుపత్రి ఇప్పటివరకు లేకపోవడం. -
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సై వీడియో వైరల్
-
చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్.. పక్కాగా లబ్ధి.. బోగస్‌కు చెక్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాలను జియో ట్యాగింగ్ చేస్తూ.. కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, జౌళిశాఖ అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఆధునిక సాంకేతికత సహకారంతో ఆన్లైన్లో భద్రపరుస్తున్నారు. ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, లూమ్ ఫొటోలతో మగ్గం ఉన్న చోటి నుంచే అక్షాంశ, రేఖాంశాలతో సహా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. చేనేత మగ్గాలతోపాటు, కండెలు చుట్టే కార్మికుల వివరాలు, ఆ మగ్గాలపై పని చేసే ఇతర అనుబంధ రంగాల కార్మికుల సమాచారాన్ని సైతం క్రోడీకరించి పొందుపరుస్తున్నారు. పక్కాగా లబ్ధి..బోగస్‌కు చెక్ చేనేత మగ్గాలను ఆన్లైన్ చేయడం ద్వారా కార్మికులు, మగ్గాల సమాచారం పక్కాగా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత మిత్ర పథకం కింద 40 శాతం యార్న్ (నూలు) సబ్సిడీ అందిస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియతో ఈ సబ్సిడీ నేరుగా ఎలాంటి బిల్లులు లేకుండానే అసలైన లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది. నేతన్నలకు చేయూత పథకం (త్రిఫ్ట్)లో చేనేత కార్మికులు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ప్రతి నెలా రూ.1,200 పొదుపు చేస్తే.. అంతే మొత్తం అంటే మరో రూ.1,200 ప్రభుత్వం అందిస్తుంది. ఆ సొమ్ము చేనేత కార్మికుల ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పొదుపు చేసుకున్న సొమ్ము, దానిపై వడ్డీ కలిపి 36 నెలల తర్వాత కార్మికులు తీసుకోవచ్చు. త్రిఫ్ట్ సొమ్మును నెలనెలా నేరుగా కార్మికుల వేతనాల నుంచి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ముద్ర రుణాలను బ్యాంకుల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా లబి్ధదారుల దరికి చేర్చవచ్చు. మరోవైపు బోగస్ చేనేత సహకార సంఘాలు, బోగస్ సభ్యుల బెడద పూర్తిగా తొలగిపోతుంది. నిజంగా శ్రమించే కార్మికులు, కండిషన్లో ఉన్న మగ్గాల డేటా ఆన్లైన్లో ఉంటుంది. తగ్గిపోయిన చేనేత మగ్గాలు.. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మరమగ్గాలు ఉన్నాయి. గతంలో ఇవి కేవలం నాలుగు జిల్లాల్లోనే ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా 36,088 మరమగ్గాలు ఉండగా, చేనేత మగ్గాలు 17,573 మాత్రమే ఉన్నాయి. కాగా మరమగ్గాలకు ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 26,494 మరమగ్గాలు ఉన్నాయి. చేనేత మగ్గాలు మాత్రం165 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జౌళిశాఖ చేపట్టిన ఆన్లైన్ నమోదు పూర్తి అయితే.. సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసేందుకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఫోన్ సిగ్నల్, నెట్వర్క్ సరిగా లేక సమాచారాన్ని నమోదు చేయడం కష్టమవుతోంది. వివరాలు రాసుకున్నారు.. మాది సిరిసిల్ల గణేశ్‌నగర్. కిరాయి ఇంట్లో ఉంటాను. చిన్నప్పటి నుంచి గిదే పని చేస్తున్న. నా భార్య పెంటవ్వకు పక్షవాతం. ఆమెకు పెన్షన్ వస్తుంది. రోజుకు ఐదు మీటర్ల బట్ట నేస్తా. మీటరుకు రూ.28.50 ఇస్తారు. రోజంతా పని చేస్తే రూ.140 వరకు వస్తాయి. మొన్ననే నా వివరాలు రాసుకుని, ఫొటోలు తీసుకున్నారు. – రాపెల్లి హన్మాండ్లు(89), చేనేత కార్మికుడు, సిరిసిల్ల క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నాం క్షేత్రస్థాయిలో చేనేత మగ్గాల, కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. చేనేత మగ్గాలున్న ప్రతి పల్లెకు వెళ్లి సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేస్తున్నాం. ఇది పూర్తి అయితే సంక్షేమ పథకాలు నేరుగా అందించే వీలుంది. –ఎం.సాగర్, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల చదవండి: నాకే సంబంధం లేదు .. ఉంటే వెంటనే వచ్చే వాడిని కాదు: చీకోటి -
రసమయికి ఫ్లెక్సీ షాక్
-
పథకాలు అందకుంటే వెతికి పట్టుకుని అందిస్తాం: మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే.. వెతికి పట్టుకొని అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే 24 గంటల కరెంట్, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీరు, అర్హులకు ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ.. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. దేశంలోనే బీడీ కార్మికులను పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడ కూడా రైతులకు జీవిత బీమా చేయించలేదని, ఒక్క తెలంగాణలోనే 40 లక్షల మంది రైతులకు ఏటా రూ.1,450 కోట్లు ప్రీమియం చెల్లించి బీమా చేయిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో లక్ష రైతుకుటుంబాలకు రూ.5వేల కోట్ల బీమా సాయం అందిందని వివరించారు. 31 వేల మంది గిరిజన ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో 3,416 గిరిజన తండాలను, గూడేలను గ్రామపంచాయతీలుగా చేశామని సర్పంచులను నుంచి వార్డు సభ్యుల వరకు 31వేల మంది గిరిజనులు పాలనలో భాగస్వాములయ్యారని కేటీఆర్ వెల్లడించారు. గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. పల్లెల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టాలని సర్పంచులను మంత్రి కోరారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు సారూ.. స్పందించిన కేటీఆర్.. కలెక్టర్‌కు ఆదేశాలు జిల్లాలోని బాకూర్‌పల్లితండాలో ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ.. మంత్రి కేటీఆర్ మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవా? అని మహిళలను ప్రశ్నించారు. వస్తలేవంటూ.. మహిళలు చెప్పడంతో కేటీఆర్ స్పందించారు. ‘ఎందుకు రావడం లేదు.. పైపులైన్ వేశాం, ట్యాంకు కట్టాం.. కారణం ఏంటి..? సాయంత్రంలోగా మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి నాకు నివేదిక ఇవ్వాలని’కలెక్టర్‌ను ఆదేశించారు. స్థానిక సర్పంచ్ స్పందించి.. ‘ఇక్కడ బోర్లు ఉన్నాయి.. బోరు నీళ్లే వాడుకుంటున్నారు.. మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదని’అన్నారు. ‘ప్రభుత్వం వేసినా మీరు తాగకుంటే ఎలా.. బోరు నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇష్టమని’కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల్లో గిరిజన భవన్‌ను కట్టుకుందామన్నారు. చదవండి: ఉన్నమాట అంటే ఉలిక్కిపడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీశ్‌రావు -
మాజీ ఐఏఎస్, కవి జె.బాపురెడ్డి కన్నుమూత
సిరిసిల్ల కల్చరల్: రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జె.బాపురెడ్డి(86) బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బాపురెడ్డి భార్య పదేళ్ల క్రితం కాలం చేశారు.బాపురెడ్డి ఇల్లంతకుంట మండలం సిరికొండకు చెందిన జంకె కృష్ణారెడ్డి, రామలక్ష్మి దంపతులకు 1936, జూలై 21న జన్మించారు. సినారె స్ఫూర్తితో 8వ ఏట నుంచి రచనలు చేశారు. పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం వంటి సాహితీ విభాగాల్లో రాణించారు. 36 పుస్తకాలు రచించారు. చైతన్యరేఖలు, రాకెట్ రాయబారం వంటి గేయసంపుటాలు, ‘మనసులో మాట’వ్యాససంపుటి, ప్రణవ ప్రణయం, రంగురంగుల చీకట్లు వంటి పుస్తకాలను వెలువరించారు. తెలుగు, ఆంగ్లంతోపాటు పలు భారతీయ భాషల్లోకి సైతం ఆయన పుస్తకాలు అనువాదమయ్యాయి. ప్రపంచ కళాసంస్కృతుల అకాడమీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ‘మన చేతుల్లోనే ఉంది’గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవితా పురస్కారం అందుకున్నారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారంతో సత్కరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో స్నాతకోత్తర పట్టభద్రుడయ్యారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో చేరి మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం స్పెషల్ అసిస్టెంట్‌గా, భారత పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పరిశ్రమల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఏపీపీఎస్సీ సభ్యుడిగా విధులు నిర్వహించారు. పరిశ్రమల శాఖలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా పేరుగాంచారు. ప్రపంచ పర్యాటకుడిగా గుర్తింపు పొందిన ఆయన 37 దేశాల్లో పర్యటించారు. బాపురెడ్డి మరణంపై సాహితీవేత్తలు దిగ్భ్రాంతి చెందారు. సాహితీవేత్తలు బీఎస్ రాములు, డాక్టర్ పత్తిపాక మోహన్, జూకంటి జగన్నాథం తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
వెలువడుతున్న సెస్ ఫలితాలు.. రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం
-
సెస్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ హవా.. 13 స్థానాలు కైవసం
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల (సెస్) ఫలితాల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. 15 స్థానాలకు గాను 13 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మరో రెండు స్థానాలు ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్-బీజేపీలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఒక స్థానానికి సంబంధించి ఫలితంపై బీజేపీ ఆందోళనకు దిగింది. కౌంటింగ్ కేంద్రం బయట తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఇరు వర్గాలు మాటల యుద్ధానికి దిగడమే కాకుండా చెప్పులు చూపించుకునే పరిస్థితి తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేఉందుకు వీరిని పోలీసులు చెదరగొట్టారు. -
తీవ్ర విషాదం: గుండెపోటుతో మూడోతరగతి విద్యార్థి మృతి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: దీపావళి పండుగను సంబరంగా జరుపుకొని మరునాడు పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి గుండె అకస్మాత్తుగా ఆగింది. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలి కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లికి చెందిన బుర్ర కుషిత– సతీశ్ దంపతులకు కొడుకు కౌశిక్(9), కుమార్తె మేఘన ఉన్నారు. కౌశిక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్లో నిలుచుని ఉన్న కౌశిక్ హఠాత్తుగా కిందపడిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయుడి వాహనంలోనే కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. బాలుడు కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత(హార్ట్ వీక్) వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చదవండి: డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు -
ప్రతి ముగ్గురిలో ఒకరికి కొలెస్ట్రాల్..
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వంద మందిలో 33 మంది అనారోగ్యంతో ఉన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగా త్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధమవుతున్నాయి. ఆరోగ్య సర్వేలు ఇంటింటా సాగుతూ ముగింపు దశ (96%)కు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మార్చి 5న మంత్రి కె.తారక రామారావు, ములు గులో మంత్రి టి.హరీశ్‌రావు పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇంటింటా సర్వేలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 203 ఆరోగ్య కార్యకర్తల బృందాలు ఇంటింటా సర్వేలు చేస్తున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తు న్నారు. ఇప్పటికి 4,05,988 మందికి టెస్టులు పూర్తయ్యా యి. బ్లడ్‌గ్రూప్, రక్తహీనత, కిడ్నీ, షుగర్, కాల్షియం, కొలెస్ట్రాల్, కాలేయం, ఇతర పరీక్షలను సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ రూపంలో భద్రపరుస్తున్నారు. ఈ సమాచారంతో ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నంబరుతో అనుసంధానం చేసి పేరు, పుట్టిన తేదీ, యూనిక్ కోడ్, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ వంటి వివరాలు కార్డులో పొందుపరుస్తు న్నారు. యూనిక్ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే.. చాలు సదరు వ్యక్తి సమగ్ర సమాచారం కళ్ల ముందు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయడమే ఈ–హెల్త్ ప్రొఫైల్ లక్ష్యం. ఆధునిక పరిజ్ఞానంతో పరీక్షలు టీ–డయాగ్నోస్టిక్ సెంటర్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమూనాలను విశ్లేషిస్తున్నారు. రోజుకు సగటున ఆరు వేల రక్త నమూనాలను పరీక్షిస్తూ.. ఆ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఒకరోజు గరిష్టంగా 14,690 రక్తపరీక్షలు చేయగా.. ఇప్పుడు సగటున 400 నుంచి 600 శాంపిళ్లు పరీక్షిస్తు న్నారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల్లో ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్ సమస్య బయట పడగా, ఆ తర్వాత స్థానంలో కాల్షియం సమస్య ఉంది. థైరాయిడ్ సమ స్యతో 17,001 మంది, కాలేయ సమస్యతో 15,839 మంది, మూత్రపిం డాల సమస్యతో 14,267 మంది, మధుమేహంతో 10,186 మంది ఉన్నట్టు గుర్తించారు. -
అభివృద్ధే నా కులం..సంక్షేమమే నా మతం
సిరిసిల్ల: ‘రాజకీయాల్లోకి వచ్చేదాకా నాకు కులం, మతం గురించి పెద్దగా తెలియదు. నాకు కుల గజ్జి లేదు. నేను అందరివాడిని. అభివృద్ధి నా కులం. సంక్షేమమే నా మతం’అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ శుక్రవారం రెడ్డి సంఘం భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చామని, కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆలస్యమైందన్నారు. వీటి ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నెరవేరుస్తానన్నారు. అన్ని కులాల్లోనూ పేదలున్నారని, వారిని ఆదుకోవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. రెడ్డి వర్గంలోని సంపన్నులు పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అన్ని కులసంఘాలకు దశలవారీగా ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయిస్తామని, భవన నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు. 65 ఏళ్లలో ఏంచేశారు? ఒక రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రైతులు ఒక్క పైసా కట్టనవసరం లేకుండా రూ.5 లక్షల బీమా కల్పించారని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని, రైతుబంధు పథకంలో పెట్టుబడి సాయంగా అన్నదాతల ఖాతాల్లో డ బ్బులు జమ అవుతున్నాయని వివరిం చారు. ఇప్పటివరకు రూ.58వేల కోట్ల సా యాన్ని అందించినట్లు తెలిపారు. పేదలకు ఆసరా, కల్యాణలక్ష్మి పథకాలు అండగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. 65 ఏళ్లు రా ష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన పార్టీలు ఇన్నేళ్లు ఏం చేశాయని కేటీఆర్ ప్రశ్నించారు. ‘కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, మీ ఆశీర్వా దంతో సీఎం అయిన ఎనిమిదేళ్లలోనే దేశానికి ఆదర్శంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. కొందరు పిచ్చోళ్లు, అవులగాళ్లు వెటకారంగా మాట్లాడుతున్నారు. బీసీలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం కులవృత్తులకు అండగా ఉంటే మేం గొర్రెలు కాయాలా? బర్రెలు కాయాలా? అని అంటున్నారు. చదువుకున్నోళ్లకు కొలువులు రావాలి. శాశ్వత ఉపాధి లభించాలి. చదువు రాని వాళ్లు ఆయా కులవృత్తుల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’అని చెప్పారు. రాష్ట్రంలో రూ.5వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేస్తే గొల్ల, కుర్మల సంపద పెరిగిందని, రెండో విడతలోనూ రూ.4వేల కోట్లతో పంపిణీ చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు పెరిగిన అంశం ఐఏఎస్ ట్రైనీలకు పాఠ్యాంశమైందని కేటీఆర్ గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
విషాదం: గడ్డివాముకు నిప్పు.. పశువులను కాపాడబోయి.. వదిన, మరిది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పశువులను కాపాడబోయి వది న, మరిది కరెంట్ షాక్‌తో ప్రా ణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండ లం ఎర్రగడ్డతండాలో ఈ ఘట న జరిగింది. గురువారం రాత్రి తండాలో బానోతు నీల (37), బానోతు రవి(34) ఇంటికి సమీపంలో ఉన్న ట్రా న్స్ఫార్మర్ నుంచి మంటలు వెలువడి గడ్డివాముకు నిప్పంటుకుంది. దీంతో సమీపంలోని పాకలో ఉన్న పశువులను మంటల నుంచి కాపాడేందుకు నీల, రవి వెళ్లా రు. అదే సమయంలో మంటలకు విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు, బంధువులు శుక్రవారం ఉదయం మృతదేహాలతో వీర్నపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అక్కడికి చేరుకొని కలెక్టర్, సెస్ ఎండీతో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. -
అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి..
సిరిసిల్లక్రైం/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్‌రోడ్డులో సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు గ్రామానికి చెందిన వంగ వీరయ్య(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 19 గుంటల భూమి పంచాయితీ తమ కుటుంబ పెద్ద దిక్కును బలి తీసుకుందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. వివాదానికి కారణాలు వివాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులు వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు ఎల్లమ్మ ఆలయం ఎదురుగా తెట్టకుంట శివారులోని సర్వేనంబర్ 51/2లో 19 గుంటల స్థలాన్ని ఆరేళ్ల క్రితం వంగ వీరయ్య, వంగ హన్మండ్లు కొనుగోలు చేశారు. దీన్ని ఓర్వలేని వారి బంధువులు ఆ భూమి గౌడ కులస్తులకు చెందితే బాగుంటుందని ఇద్దరిపై పంచాయితీకి ఉసిగొల్పారు. ఈ విషయమై సిరిసిల్లటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ అనిల్‌కుమార్ ఇరువర్గాలను పిలిచి అడుగగా, పంచాయితీ నిర్వహించుకుని సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు పంచాయితీ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఆదివారం రాత్రి పంచాయితీ పెద్దలను పిలవడానికి వీరయ్య ఒకవైపు, హన్మండ్లు మరోవైపు వెళ్లారు. పెద్దలను కలిసిన వీరయ్య ఇంటికి వస్తున్నానని కుటుంబీకుల్లో ఒకరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు. తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు. ఉదయం సిరిసిల్ల రెండో బైపాస్‌లో వీరయ్య మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య చేశారని ఆరోపణలు భూమి విషయంలో తగాదాలను మనసులో పెట్టుకుని వీరయ్యను హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బైక్ నుంచి పడితే కేవలం తల మాత్రమే ఎలా పగులుతుందన్న అనుమానాలున్నాయి. అంతేకాకుండా మృతుడి మర్మాంగాలపై తీవ్రంగా కొట్టారని మృతదేహాన్ని చూసిన స్థానికుల్లో కొందరు ఆరోపించారు. పంచాయితీ రోజుకు ముందు కొన్ని గంటల వ్యవధిలో ఎవరో కావాలని హత్యచేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం వీరయ్యకు భార్య రేణుక, ముగ్గురు కూతుళ్లు శ్రావణి, ప్రవళిక, మానస, కుమారుడు ప్రణయ్ ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహం జరిగింది. మిగతావారు చదువుకుంటున్నారు. కల్లుగీత కార్మికుడిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో ఇంటి పెద్ద మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. న్యాయం చేయాలని వేడుకోలు తమ కుటుంబ పెద్దను చంపిన వ్యక్తులను పట్టుకుని న్యాయం చేయాలని వీరయ్య భార్య అతడి పిల్లలు టౌన్ సీఐ అనిల్‌కుమార్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కేసును అనుమానాస్పదంగా భావించి 174 సెక్షన్లో నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు హత్యగా 30 శాతం తెలిపినా మర్డర్ కేసుగా అల్టర్ చేస్తానని హామీ ఇచ్చారు. హత్య అని తేలితే ఎంత పెద్ద మనుషులున్నా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చదవండి: Balanagar: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు -
వద్దన్నా వినలేదు.. బలవంతపు వ్యాక్సిన్‌కు బలైన ప్రాణం
సాక్షి,కోనరావుపేట(వేములవాడ): వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న అధికారుల అత్యుత్సాహానికి నిండు ప్రాణం బలైంది. బలవంతంగా వేసిన టీకా వికటించి ఒకరు మృతిచెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ రేగుల సత్తయ్య(52) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 16న సత్తయ్యకు ఇంటికి ఏఎన్ఎం, ఎంపీవో, గ్రామకార్యదర్శి రాగా.. తాను అనారోగ్యంతో ఉన్నానని.. టీకా తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. అయినా వారు వినలేదు. బలవంతంగా కోవాగ్జిన్ మొదటి డోస్ ఇచ్చారు. టీకా ఇచ్చిన గంట తర్వాత సత్తయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కోనరావుపేట ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నొప్పుల మాత్రలు వేసుకోవడంతో పరిస్థితి విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఈ నెల 19న సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వ్యాక్సిన్‌తోనే మృతి.. అనారోగ్యంతో బాధపడుతున్న తమ తండ్రి సత్తయ్యకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంతోనే పరిస్థితి విషమంగా మారి మృతిచెందాడని కుమారుడు అజయ్, కూతురు రమ్య, భార్య మణెమ్మ ఆరోపించారు. కోనరావుపేట వైద్యులు ఇచ్చిన నొప్పి మాత్రలు ఎందుకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చి, నొప్పుల మాత్రలు వేయడంతో మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారు. ధర్మారం గ్రామానికి చెందిన సత్తయ్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కోవాగ్జిన్ టీకా బాగుందని ప్రజలు భావిస్తుండడంతో ఆ టీకానే అందరికీ ఇస్తున్నాం. నొప్పుల మాత్రలతో అరుదుగా ప్రమాదం సంభవించే అవకాశముంది. సత్తయ్య మృతికి వ్యాక్సిన్ కారణం కాదు. – సుమన్‌మోహన్‌రావు, డీఎంహెచ్‌వో చదవండి: అరగంటలో ఫంక్షన్ హాల్‌కు.. క్షణంలో ఘోరం.. -
జీఎస్టీ పెంపు సరికాదు వస్త్రపరిశ్రమ బతికి బట్టకట్టలేదు
సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం ఇటీవల వస్త్ర పరిశ్రమపై 7 శాతం జీఎస్టీ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఇప్పటికే 5 శాతం విధిస్తున్న పన్నుకు ఇప్పుడు 7 శాతం పెంచడం వల్ల 12 శాతానికి చేరుతుందని, దీంతో ఆ పరిశ్రమ కుదేలవుతుందని చెప్పా రు. ఈ మేరకు కేటీఆర్ కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆదివారం లేఖ రాశారు. జనవరి 1 నుంచి అమలుకానున్న 7 శాతం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో చేనేతరంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని చెప్పారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది టెక్స్టైల్ రంగమని, అలాంటి రంగానికి ప్రోత్సాహకాలు అందించాల్సింది పోయి జీఎస్టీ పెంచడం సబబు కాదన్నారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని, తొలిసారి 5 శాతం విధించినప్పుడు కూడా తీవ్రమైన వ్యతిరేకత వ చ్చిందని గుర్తుచేశారు. ఇప్పు డు మళ్లీ ఏడు శాతం జీఎస్టీ పెంచితే చేనేతరంగం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాం చిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఒకవేళ పెంపు నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుంటే.. ప్రస్తుతం చేనేత, పవర్లూమ్ వ్యాపారులకు ఉన్న జీఎస్టీ శ్లాబ్‌ను రూ.20 లక్షల నుంచి 50 లక్షల వరకు పెంచాలని కేటీఆర్ కోరారు. ఇప్పటికే ముడి సరుకుల ధరలు పెరిగాయ్.. వస్త్ర పరిశ్రమకు అవసరమైన కాటన్, పాలి స్టర్ నూలు ధరలు 30–40 శాతం పెరిగాయ ని, కరోనా సంక్షోభంతో విదేశాల నుంచి ది గుమతులు తగ్గి రసాయనాల ధరలు కూడా భారీగా పెరిగాయని కేటీఆర్ తెలిపారు. 2011 లెక్కల ప్రకారం 43.3 లక్షల కుటుం బాలు చేనేత రంగంలో ఉంటే తాజా లెక్కల ప్రకారం 30.44 లక్షల కుటుంబాలు మాత్ర మే ఉన్నాయన్నారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న కొద్ది సంవత్సరాల్లోనే దేశంలో చేనేత రంగం అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతను బలోపేతం చేయాలి 2015లో ప్రధాని మోదీ చేనేతకు చేయూతనిస్తామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని, గతేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి ‘వోకల్ ఫర్ హ్యాండ్ మేడ్’అన్న నినాదం ఇచ్చారని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. జాతీయ చేనేత ఉత్పత్తులను రెట్టింపు చేసి రూ.1.25 లక్షల కోట్లకు, దేశీయ చేనేత ఎగుమతులను నాలుగు రెట్లు పెంచి రూ.10 వేల కోట్లకు తీసుకుపోతామన్న హామీని దృష్టిలో పెట్టుకోవాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
బాబోయ్ చీకటి పడితే.. ఆ రోడ్డంటే భయం భయం
సాక్షి,సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని కలెక్టరేట్ బైపాస్‌రోడ్డుపై సాయంత్రం వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వీధిలైట్లు వెలుగక ఎటూ చూసిన కారుచీకట్లే ఉండడం అఘంతకులకు కలిసొస్తుంది. ఆ రహదారిపై సాయంత్రం వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉంటుండడంతో దుండగులకు అవకాశంగా మారింది. ఇటీవల తరచూ దా రిదోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఓ ద్విచక్రవాహనదారున్ని బెదిరించిన తీరు.. తాజాగా రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి బంగారం ఉంగరం ఎత్తకెళ్లడంతో స్థానికులు భయపడుతున్నారు. దారిపొడువున చీకటి సిరిసిల్ల బైపాస్ రోడ్డు మొత్తం అంధకారం అలుముకుంటుంది. సాయంత్రం వేళ ఆ రోడ్డుపై వాహనాల రద్దీ దాదాపు తగ్గిపోతుంది. కలెక్టరేట్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అదే దారిలో ఉన్నాయి. ఆయా కార్యాలయాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. విధులు ముగిసిన అనంతరం సాయంత్రం కాలినడకన వెళ్దామంటే వీధిదీపాలు లేక చీకటిగా ఉంటుంది. ఇదే ఆసరాగా చేసుకుని కొందరు పోకిరీలు వెకిలి చేష్టలు చేస్తుండగా, మరికొందరు దారికాచి దొంగతనాలు చేస్తున్నారు. వాహనాలపై వెంబడించి దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. పోలీసులమని బెదిరింపులు జిల్లాలో పోలీసుల పేరు చెప్పి బెదిరించే సంస్కృతి ఊపందుకుంటోంది. రగుడు ఎల్లమ్మరోడ్డు నుంచి బైపాస్‌రోడ్డులో పలు సంఘటనలు జరిగాయి. జిల్లా ఆవిర్భవించిన ఏడాదికి భార్యభర్తలు బైక్‌పై వె ళ్తుంటే పోలీసులమని చెప్పి వాహనాన్ని తనిఖీ చేసి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు నెలల క్రితం వ్యాపారులను కొందరు బెదిరించి పెద్ద ఎత్తున నగదు లాక్కున్నట్లు తెలిసింది. మళ్లీ ఇప్పుడు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగిని పోలీసులమని బెదిరించి బంగారు ఉంగరాన్ని లాక్కెళ్లారు. దీంతో సదరు ఉద్యోగి తనకు జ రిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించాడు. బైపాస్‌రోడ్డులో పోలీసుల గస్తీ పెంచాలని, వీధి దీపాలు బిగించాలని స్థానికులు కోరుతున్నారు. ఉంగరం లాక్కున్నారు భూమి పనిమీద సిరిసిల్లలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వెళ్లిన. బైపాస్‌రోడ్డులో ఇద్దరు అడ్డగించి, నా జేబులు చెక్ చేశారు. రూ.200 మాత్రమే ఉండడంతో చేతికి ఉన్న బంగారు ఉంగారాన్ని లాక్కున్నారు. – ఎం.సిద్ధేశ్వర్‌రావు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి, బొప్పాపూర్ చర్యలు తీసుకుంటాం పోలీసులమని చెప్పి తనిఖీలు చేసి.. చేతికున్న ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకున్నట్లు ఒక వృద్ధుడు పోలీస్‌స్టేషన్‌లో తెలిపిన మాట వాస్తవమే. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో నాకు ఆలస్యంగా తెలిసింది. తగు చర్యలు తీసుకుంటాం – అనిల్‌కుమార్, సీఐ, సిరిసిల్ల చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
గొర్రెలు బాగా అయినయ్: నవ్వులు పూయించిన సీఎం కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు పూసాయి. తను ప్రవేశపెట్టిన పథకాలు, తనయుడు, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో గొర్రెలు బాగా అయినయ్.. ఇవన్నీ కేసీఆర్ గొర్రెలు అంటున్నరు. ఇంకా నయం కేసీఆరే గొర్రె అంటలేరు.’ ‘ఎస్సారెస్పీ వరద కాల్వలో నీళ్లు బాగా ఉండటంతో మోటర్ పెడితే.. ఐదు గజాలు చిమ్ముతున్నయ్.. ఆ నీళ్లు కేసీఆర్ నీళ్లు అని రైతులు చెబుతున్నరు.’ ‘మీకు ఆకలి అయితుందా. నాకైతే కడుపుల గోకుతుంది. మా రాము.. మీకు అన్నమైన పెడుతుండా..? లేదా..?.. ఓ సారి వరంగల్ వెళ్తే.. పొద్దంతా పని చేయించుకుని నాలుగ్గొట్టంగ ఉట్టిగనే నన్ను ఎల్లగొట్టిండ్రు’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాగా రాజన్నసిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ మార్కెట్ యార్డును సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. -
కామాంధుల చేత చిక్కి.. కరోనా సోకి బిక్కుబిక్కు
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆమె కామాంధుల బాధితురాలన్న కనికరంలేదు.. ఆమెకు కరోనా సోకిందన్న దయ లేదు.. ఆమెను తండావాసులు నిర్దాక్షిణ్యంగా వెలివేశారు. చుట్టూ కారుచీకటి.. చుట్టుపక్కల కానరాని మనిషి జాడ.. ఎటువైపు నుంచి ఏ అడవి జంతువు వచ్చి దాడి చేస్తుందోనన్న భయం.. మరోవైపు వర్షం.. రక్షణ ఇవ్వలేని గుడారం.. ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో మూడురోజులపాటు కొట్టుమిట్టాడింది ఓ అభాగ్యురాలు. ఈ హృదయ విదారకమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాలో చోటుచేసుకుంది. వివరాలు... రాశిగుట్ట తండాకు చెందిన ఓ బాలిక గతనెల 18న లైంగికదాడికి గురైంది. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా, నిందితులను అదే నెల 20న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిరిసిల్లలోని సఖీ కేంద్రంలో బాలికకు వసతి కల్పించారు. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అదేరోజు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అప్పటికే తల్లికి కూడా కరోనా సోకింది. ఐసోలేషన్ కేంద్రంలో పట్టించుకునేవారు లేకపోవడంతో తల్లీకూతుళ్లు తండాకు చేరుకున్నారు. అప్పటికే సగం సచ్చి బతుకుతున్న ఆ కుటుంబంపట్ల సానుభూతి చూపకపోగా, తమకు కరోనా వస్తుందనే కారణంతో తండావాసులు వారిని వెలివేశారు. దీంతో ఊరుకు దూరంగా వారి సొంతపొలం వద్ద గుడారం ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ విషయం మీడియాలో ప్రచారం కావడంతో స్పందించిన జిల్లా అధికారులు వెంటనే తండాకు చేరుకుని తల్లీకూతుళ్లను మళ్లీ సిరిసిల్లలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. చదవండి: మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్