
శ్రీనివాస్‌గౌడ్
ఎల్లారెడ్డిపేట: విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ నిరాకరించిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్‌కు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఈ నెల 18న దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడు. మొదటి రోజే శ్రీనివాస్‌గౌడ్‌ను స్వీయ నిర్బంధం కావాలని అధికారులు కోరారు.
అయినా అతను బయట తిరగడం ప్రారంభించాడు. ఈ నెల 21న అధికారులు ఆయన ఇంటి వద్దకు వెళ్లే సరికి ఫ్రిజ్ కొనుగోలు కోసమని సిరిసిల్లకి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై స్వీయ నిర్బంధ నిరాకరణ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment