
సిరిసిల్ల జ్వరపీడితులకు ఒక్కసారిగా రక్తకణాలు తగ్గిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వంద మందికి రక్తపరీక్షలు చేస్తే.. 60 మందికి రక్తకణాలు పడిపోయాయని ఓ ప్రైవేటు డాక్టర్ ఒక్కరు చెప్పారు. జలుబు, తలనొప్పి, దగ్గు, దమ్ముతోపాటు, కాళ్లు, కీళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా తగ్గకపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి మొండి జ్వరాలు గతంలో ఎన్నడూ చూడలేని మరో ప్రభుత్వ వైద్యుడు చెప్పడం గమనార్హం.
దోమల విజృంభన..
దోమలు ఒక్కసారిగా విజృంభించాయి. ఇటీవల మున్సిపల్ అధికారులు పందులను పట్టణం నుంచి తరలించినా దోమల ఉధృతి తగ్గలేదు. కార్మిక వాడలతోపాటు అన్నిప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధాన వీధుల్లో రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా.. మోరీనీళ్లు రోడ్లపైనే పారుతున్నాయి. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణంలో దోమలు విస్తరిస్తున్నా మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు తీసుకోవడంలేవు. మోరీల్లో నిల్వ ఉండే నీటి ద్వారానే దోమలు విజృంభిస్తున్నాయి.
ఒకే ఇంట్లో ఇద్దరికి..
ఈ చిత్రాల్లోని ఇద్దరు చిన్నారులు దీక్షిత(7), గాయత్రి(7నెలలు). వీరి తల్లిదండ్రులు ప్రగతినగర్‌కు చెందిన రోషిణి–కమలాకర్. దీక్షతకు పదిరోజుల క్రితం జ్వరం రాగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. మందులు వాడగా మళ్లీ జ్వరం వచ్చింది. మూడు రోజుల క్రితం గాయత్రి కూడా జ్వరం బారినపడింది. పిల్లలిద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
వైరల్ ఫీవరే ఎక్కవ
పిల్లలకు వైరల్ ఫివర్ అధికంగా వస్తోంది. రోజుల తరబడి జ్వరాలు తగ్గడంలేదు. ప్లేట్‌లెట్స్ కూడా తగ్గుతున్నాయి. నేను రోజుకు వంద మంది పిల్లలను పరీక్షిస్తున్నా. ఇరవై మంది అడ్మిట్ అవుతున్నారు. జ్వరాలు తగ్గినా మళ్లీ వస్తున్నాయి. దమ్ము, దగ్గు సమస్యలు ఉన్నాయి.
– మురళీధర్‌రావు, పిల్లల వైద్యుడు
ఓపీ సంఖ్య పెరిగింది
జ్వరాలతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మా ఆస్పత్రికి రోజూ 700 – 800 మంది వస్తున్నారు. జ్వరం తీవ్రంగా ఉంటే అడ్మి ట్ చేసుకుంటున్నాం. మిగతా వారికి వైద్యం చేసి ఇళ్లకు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు.
– ఆర్.తిరుపతి,
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment