సాక్షి, రాజన్నసిరిసిల్ల: అన్నా చెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అలాంటి రక్షా బంధన్ రోజున ఓ చెల్లెలు తన సోదరుడి ప్రాణాలు కాపాడండి అంటూ . మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వేములవాడ మండలం వావిలాలకు చెందిన కిడ్నీ పేషెంట్ పోచయ్య జ్వరంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది పోచయ్యను పటించుకోకపోవడంతో అతని సోదరి విలవిల్లాడారు.
(చదవండి: సిఫారసు ఉంటేనే.. కరోనా పరీక్షలు!)
రాఖీ పండుగ రోజు సిరిసిల్ల ఆసుపత్రికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చూసిన ఆమె తన అన్న ప్రాణాలు కాపాడండి అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. డాక్టర్లు బిజీగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న వైద్యం కోసం చెల్లెలు పోరాటానికి దిగిన ఘటనను స్థానికులు చూసి చలించిపోయారు. అయితే, మంత్రి కేటీఆర్ ఆసుపత్రి నుంచి తిరుగుప్రయాణం అవుతున్న సమయంలో బాధిత మహిళను పలకరించి, కిడ్నీ పేషంట్ పోచయ్యకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్‌ను ఆదేశించారు. కేటీఆర్ అన్నయ్య అభయంతో ఆ చెల్లెలు సంతోషం వ్యక్తం చేశారు. (రాఖీ విషాదం, అన్నాచెల్లెలు మృతి)
Comments
Please login to add a commentAdd a comment