
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల (సెస్) ఫలితాల్లో బీఆర్‌ఎస్ హవా కొనసాగింది. 15 స్థానాలకు గాను 13 స్థానాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మరో రెండు స్థానాలు ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్‌ఎస్-బీజేపీలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఒక స్థానానికి సంబంధించి ఫలితంపై బీజేపీ ఆందోళనకు దిగింది. కౌంటింగ్ కేంద్రం బయట తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఇరు వర్గాలు మాటల యుద్ధానికి దిగడమే కాకుండా చెప్పులు చూపించుకునే పరిస్థితి తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేఉందుకు వీరిని పోలీసులు చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment