SpaceX Launch Solarwinds Mission with Space Telescope 2025 Musk Tweet - Sakshi
Sakshi News home page

పొద్దున్నే ఆ వాసన భలే ఉంది: ఎలాన్‌ మస్క్‌ భారీ ప్లాన్లు!

Published Sat, Aug 6 2022 3:56 PM | Last Updated on Sat, Aug 6 2022 5:19 PM

SpaceX launch solar wind mission with space telescope 2025 Musk tweet - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: హై స్పీడ్‌ స్టార్‌లింక్ శాటిలైట్లను ప్రవేశపెట్టిన బిలియనీర్‌,స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్‌ మస్క్‌ తాజాగా రాకెట్ల లాంచింగ్‌, లాంచ్‌ ప్యాడ్‌పై ట్వీట్‌  చేశారు.  రాకెట్‌  లాంచ్‌ప్యాడ్‌కు తరలింపు అంటూ  ఒక  వీడియోను పోస్ట్‌ చేశారు. అలాగే  ఐ లవ్‌ దట్‌ స్మెల్‌ ఆఫ్‌ హైడ్రాలిక్ లిక్విడ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. స్టార్‌లింక్ ప్రాజెక్ట్‌లో భాగంలో ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతోందన్న అంచనాలకు ఇంది మరింత బలాన్నిచ్చింది.  (Kartikeya Jakhar: ఫోన్‌ బాధలు పడలేక: పన్నెండేళ్ల బుడతడి అరుదైన రికార్డు!)

2025, ఏప్రిల్‌లో స్పేస్‌ఎక్స్ స్పేస్ టెలిస్కోప్‌తో సోలార్ విండ్ మిషన్‌ను ప్రారంభించనుందని నాసా తాజాగా ప్రకటించింది. స్పేస్‌ఎక్స్‌, నాసా మిషన్లు కలిసి కక్ష్యలోకి  ఈ రోడ్‌ట్రిప్ తీసుకుంటాయని ఏజెన్సీ ప్రకటించింది. దీని ప్రకారం స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో ఐదు అంతరిక్ష నౌకలు ఉంటాయి, ఒకటి ఖగోళ భౌతిక శాస్త్రానికి ,మిగిలిన నాలుగు సోలార్ సైన్స్‌కు సేవలను అందించనున్నాయి.

(ఇదీ చదవండి: ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో)

కాగా అంతరిక్షంలోకి పంపే రాకెట్ల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌ లాంచ్‌ప్యాడ్‌ ట్వీట్‌ ప్రాధాన్యతను సంతరించు కుంది. గత నెలలో స్పేస్ వెంచర్ స్పేస్‌ఎక్స్ 46 స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా లో-ఎర్త్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ 2021లో ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఒకేసారి 52 స్టార్‌ లింక్‌ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. 2025 సంవత్సరం నాటికి స్టార్‌లింక్ శాటిలైట్ల ద్వారా స్పేస్‌ఎక్స్ కంపెనీ భారీ ఆదాయాన్ని పొందాలని చూస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement