న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్‌లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు.
అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్ స్టార్‌లైనర్ పనిచేస్తోంది.
ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైన్ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చెందిన హార్మోనీ మాడ్యుల్ సబ్‌సిస్టమ్స్ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు.
ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్ విల్ మోర్‌ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది.
2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment