Elon Musk Inspiration 4 Is Streaming On Netflix: అంతరిక్ష రంగంలో తనదైన మార్క్‌ను చూపించడంలో ఎలన్ మస్క్ ఎప్పుడు ముందుంటాడు. ఒకానొక సమయంలో రాకెట్లకు వాడే బూస్టర్లను తిరిగి వాడేలా చేయవచ్చునని ఫాల్కన్ రాకెట్‌ను ఉపయోగించి విజయవంతంగా నిరూపించాడు. రాకెట్ బూస్టర్లను తిరిగి వాడడంతో రాకెట్ ప్రయోగాలకు అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించగలిగాడు ఎలన్‌మస్క్. అంతరిక్ష రంగంలో వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్షయాత్రలను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.
లేట్‌గా ఐనా అంతరిక్ష యాత్ర అంటే ఇది అన్నట్లుగా స్పేస్‌ఎక్స్ ఇన్సిపిరేషన్4 రాకెట్ ద్వారా నలుగురు ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షరంగంలోకి పంపిన విషయం తెలిసిందే. ఇన్సిపిరేషన్4 ప్రయోగంలోని వ్యక్తులను రెండు రోజులపాటు అంతరిక్షంలో ఉండేలా చేసి, ప్రయోగాన్ని స్పేస్‌ఎక్స్ ద్విగ్విజయంగా పూర్తి చేసింది. తాజాగా ఎలన్‌మస్క్ అంతరిక్ష రంగంలో మరో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాడు.
నెట్‌ఫ్లిక్స్ లో సందడి..
ఇన్సిపిరేషన్4 లాంచ్ ప్రయోగాన్ని నెట్‌ఫ్లిక్ ఓటీటీలో స్ట్రీమ్ చేశారు. ఇన్పిపిరేషన్4కు సంబంధించిన పూర్తి ప్రయోగాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యే ఏర్పాట్లను ఎలన్‌మస్క్ చేశాడు. ఇన్సిపిరేషన్4 సిబ్బంది ట్రైనింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఆరు ఎపిసోడ్లను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతోంది. ఈ విధంగా చేయడంతో అంతరిక్షయాత్రల పట్ల మరింత అవగాహన వస్తోందని ఎలన్ మస్క్ భావిస్తున్నాడు.
Amazing show about @Inspiration4x mission! https://t.co/0nQua4jGiz
— Elon Musk (@elonmusk) October 2, 2021
చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..!
Comments
Please login to add a commentAdd a comment