![Complaint Filed Against Owaisi Over Controversial Slogans](/styles/webp/s3/article_images/2024/06/26/asaduddin.jpg.webp?itok=TrtDtiVz)
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద నినాదాలపై ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.
పార్లమెంటులో ఇతర దేశానికి జై కొట్టినందుకు ఆయను డిస్‌క్వాలిఫై చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. మంగళవారం(జూన్25) లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేసి ఒవైసీ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే.
ఒవైసీ చేసిన నినాదాలను లోక్‌సభ రికార్డుల నుంచి ప్రొటెం స్పీకర్ ఇప్పటికే తొలగించారు. అయితే పాలస్తీనాలో ప్రజలు అణచివేతకు గురవుతున్నందునే తాను ఆ నినాదం చేశానని ఒవైసీ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment