గాంధీ విగ్రహం ధ్వంసం, ఐసిస్ నినాదాలు | Mahatma Gandhi's statue defaced in Dudu (Rajasthan), 'ISIS zindabad' scribbled on it. | Sakshi
Sakshi News home page

గాంధీ విగ్రహం ధ్వంసం, ఐసిస్ నినాదాలు

Published Mon, Jan 25 2016 3:14 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

గాంధీ విగ్రహం ధ్వంసం,  ఐసిస్ నినాదాలు - Sakshi

గాంధీ విగ్రహం ధ్వంసం, ఐసిస్ నినాదాలు

జైపూర్: రాజస్తాన్లో జాతిపిత మహాత్మాగాంధీకి అవమానం జరిగింది.  డుడు లోని ఆయన విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా  ధ్వంసం చేశారు. అహింసకు మారుపేరుగా మారిన గాంధీ విగ్రహంలోని ముఖం, తల భాగాలను  చెడగొట్టారు.  అనంతరం   విగ్రహానికి ముందు, వెనుక భాగాల్లో  'ఐసిస్ జిందాబాద్ '  అని నినాదాలు రాయడం కలకలం రేపింది.  జనవరి 26 గణతంత్ర దినోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో  ఈ చర్య  ఉద్రిక్తతను రాజేసింది.

కాగా  హింసకు వ్యతిరేకంగా అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాత్ముడి పట్ల దుండగుల చర్యపై పలువురు మండిపడుతున్నారు.  వెంటనే రంగంలోకి దిగిన  పోలీసులు విచారణ చేపట్టారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement