పట్నా: ఇటీవల హత్యకు గురైన ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్న వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అశ్విని చౌబె. అలాంటి వాళ్లు కన్పించిన వెంటనే కాల్చి పడేయాలని వ్యాఖ్యానించారు. బిహార్‌లో కూడా యోగి మోడల్ ప్రభుత్వం అవసరం ఉందన్నారు.
పట్నాలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు అతీక్ అహ్మద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశ్విని చౌబె వాళ్లపై ఫైర్ అయ్యారు.
బిహార్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, తక్షణమే వాళ్లను కాల్చిపడేయాలన్నారు. మోదీ, యోగికి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేసిన తీరు బాధాకరమన్నారు. క్రిమినల్స్, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న యోగి మార్క్ పాలన బిహార్‌లోనూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
బిహార్‌లో ప్రస్తుతం కుటంబ, కుల రాజకీయాలు చేసే వారే అధికారంలో ఉన్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
కాగా.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అశ్రఫ్‌ను ముగ్గురు యువకులు పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు వెంటనే పోలీసులకు లొంగిపోయారు. ఫేమస్ అయ్యేందుకే తాము ఈ హత్యలు చేసినట్లు విచారణలో అంగీకరించారు.
చదవండి: 35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు!
Comments
Please login to add a commentAdd a comment