మంచిర్యాల టౌన్ : ఆంధ్రా జడ్జి గో బ్యాక్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మంచిర్యాల కోర్టు మారుమోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కో ర్టులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్ర త్యేక తెలంగాణ హైకోర్టు కోసం మంగళవారం సు ప్రీం కోర్టులో విచారణకు రానుండటంతో మద్దతుగా మంచిర్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు ని రాహార దీక్షకు దిగారు. న్యాయవాదులు నిరాహార దీ క్షలో ఉండగా కోర్టులోని న్యాయమూర్తులు కేసు విచారణలు చేపడుతుండటంతో న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులోకి దూసుకెళ్లారు. అయి నా.. కేసుల విచారణ కొనసాగుతుండటంతో న్యాయవాదులు కోర్టు గదులకు తాళాలు వేశారు. న్యాయమూర్తులు ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్‌కు సమాచారం తెలియజేయడంతో పోలీసులు కోర్టుకు వచ్చా రు. అయితే.. కేసుల విచారణ సాగేది లేదని ఆందోళన చేపట్టగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
న్యాయమూర్తుల విధులకు ఆటంకం కలిగించకుండా పోలీసులు కక్షిదారులను, సాక్షులను న్యాయస్థానంలోకి పంపుతున్న క్ర మంలో ఎస్సై వెంకటేశ్వర్లుకు, న్యాయవాదులకు మ ధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఎస్సై వెంకటేశ్వర్లును న్యాయవాదులు కిందకు తోసేయగా చేతి వాటం కూడా చోటుచేసుకుంది. పోలీసులు మంచి ర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించడంతో కోర్టుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. న్యాయవాదులను బయటకు పంపించి కేసుల విచారణ కొనసాగేలా చేశారు. మరింత ఆగ్రహించిన న్యా యవాదులు ‘ఆంధ్రా జడ్జి గో బ్యాక్, న్యాయవాదుల నిరసనను అడ్డుకున్న ఆంధ్రా ఎస్సై గో బ్యాక్’ అం టూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
కేసులు విచారణ జరుగుతుండటంతో మరోసారి మద్దతుదారులగా వచ్చిన ఇతర ప్రాంతాల బార్ అ సోసియేషన్ న్యాయవాదులు ఒక్కసారిగా న్యాయస్థానంలోకి దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల కోర్టులో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అహంకార పూరిత, తెలంగాణ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరోమారు రిలే నిరాహార దీక్షలకు దిగారు.
ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు న్యాయవాదులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రిలే నిరాహార దీక్షలు కొనసాగించేలా తీర్మానించారు. కాగా న్యాయమూర్తులు విధులు ముగిసిన అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య బయటకు వెళ్లిపోయారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు సురేశ్, వేణుచందర్, ప్రవీణ్‌కుమార్‌తోపాటు మంచిర్యాల సబ్‌డివిజన్‌లోని ఎస్సైలు, బెల్లంపల్లి రిజర్వ్ పోలీస్‌లు, సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన న్యాయవాదులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
రిలే దీక్షలో కూర్చున్న న్యాయవాదులు...
న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలో న్యాయవాదు లు కర్రె లచ్చన్న, పి.నారాయణ, ఆర్.లక్ష్మణ్, దేవి నవీన్‌శ్రీనివాస్, శరత్‌బాబు, బి.శ్రీరాములు, సరేందర్‌ఉపాధ్యాయ, జెల్ల రాజయ్య, పి.అశోక్, సునీల్, పూదరి రమేశ్, దేవి శ్రీధర్, ఎన్.లక్ష్మీరాజం, ఎ.శ్రీనివాస్ కూర్చున్నారు. వీరికి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఎంపీపీ బేర సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు.
ముల్కల్ల మల్లారెడ్డి, పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు అందె మంగ తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. కాగా.. మంచిర్యాల కోర్టులో తలెత్తిన సంఘటనపై వివిధ జిల్లాల నుంచి న్యాయవాద సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారుు. నిజామాబా ద్, కరీంనగర్, జగిత్యాల, సుల్తానాబాద్, గోదావరి ఖని, మంథని, ఆదిలాబాద్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూర్ కోర్టులకు చెందిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
ఆంధ్రా జడ్జి గో బ్యాక్
Published Wed, Feb 25 2015 3:23 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
Advertisement
Advertisement