go back
-
బొండా ఉమా గో బ్యాక్
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పిలవకపోయినా టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా రావడంతో ఉద్రిక్తంగా మారింది. ‘బొండా ఉమా గో బ్యాక్’ అంటూ ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. చివరకు కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్లో గల ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వనం మేరకు విజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా అక్కడికి వెళ్లారు. వేదికపై వెళ్లి కూర్చోవడంతో ఆర్యవైశ్య కులానికి సంబంధం లేని బొండా ఉమా కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటూ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కొండపల్లి బుజ్జి ప్రశ్నించారు. పిలవకపోయినా అభినందించడానికి వచ్చారని, పిలవకపోయినా వస్తామంటూ బొండా ఉమా అనుచరుడు, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేశ్ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ‘బొండా ఉమా గో బ్యాక్’ అంటూ కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరు ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. దీంతో బొండా ఉమా వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ వివాదం విషయం తెలుసుకున్న మాచవరం పోలీసులు ఆ హాల్‌కు వెళ్లి.. రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తామంటేనే అనుమతులు ఇచ్చామని నిర్వాహకులతో చెబుతుండగా.. డూండి రాకేశ్ వచ్చి ఇది తమ అంతర్గత సమావేశమని, పోలీసులు ఎందుకు వచ్చారంటూ వాదనకు దిగారు. కార్యక్రమం నిర్వహణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నామని పోలీసులు నిర్వాహకులతో చెప్పి హాలులో ఉన్న సభ్యులందరినీ బయటకు పంపించేశారు. డూండి రాకేశ్‌ను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా.. డూండి రాకేశ్ అత్యుత్సాహమే వివాదానికి కారణమని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు చెప్పారు. బొండా ఉమాకు తాము ఆహ్వానం పంపలేదని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య ప్రముఖులకు మాత్రమే ఆహ్వనాలు పంపామని చెప్పారు. బొండా ఉమా కావాలనే తమ కార్యాక్రమానికి వచ్చి వివాదం రాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సైకో చంద్రబాబు గో బ్యాక్.. పీలేరులో ఫ్లెక్సీల ఏర్పాటు
సాక్షి, అన్నమయ్య: చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మత కలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీల దర్శనమిచ్చాయి. ‘ గోబ్యాక్ చంద్రబాబు.. పుంగనూరులో మత కలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు గో బ్యాక్.. సైకో చంద్రబాబు గో బ్యాక్’ అని కొందరు బాబు రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలతో నిరసించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడులు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ గాయపడిన వారి ఫోటోలను ఫ్లెక్సీల్లో ఉంచారు. కాగా, పీలేరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి సోమవారం చంద్రబాబు వెళ్లారు. ములాఖత్‌కు బాబుతోపాటు ఆరుగురు అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ఫ్లెక్సీలు కనిపించాయి. బాబు పీలేరు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు హాట్‌టాపిక్‌గా మారాయి. -
చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో ఫ్లెక్సీలు
-
పవన్ తీరుపై విశాఖ వాసుల ఆందోళన.. గో బ్యాక్ అంటూ నినాదాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రాజధానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జనసేన సైనికులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ పోర్టు స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జన వానికి పవన్ కళ్యాణ్ రాకుండా అడ్డుకుంటామని, పవన్ గో బ్యాక్, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ఆయన చిత్రపటానికి చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, స్థానికులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీంతో పోలీసుల చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టును ఖండించారు నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు. జన సైనికుల పేరిట జరిగిన దౌర్జన్యంపై మహిళలూ ఆందోళనలో పాల్గొన్నారు. ఇదీ చూడండి: మంత్రులు, నేతలను చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారు: విశాఖ సీపీ -
చంద్రబాబుకు భారీ షాక్.. గో బ్యాక్ అంటూ నిరసన
విశాఖపట్టణం: పరిపాలన రాజధానిగా ఎంపికైన విశాఖపట్టణానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైజాగ్‌వాసులు షాకిచ్చారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినదించారు. విశాఖపట్టణానికి రాగా అతడిని గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కూడలిలో శుక్రవారం రాత్రి నిలబడి చంద్రబాబు పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత పర్యటన చేపట్టాలని ఈ సందర్భంగా నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు విశాఖపట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాకను స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. పరిపాలన రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారని నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ప్రజలు నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పజలకు క్షమాపణ చెప్పిన తరువాత పర్యటన చేయాలని డిమాండ్ చేశారు. -
గిల్గిత్–బాల్టిస్తాన్ నుంచి వెళ్లిపోండి
న్యూఢిల్లీ: గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రాంతానికి ప్రొవెన్షియల్ హోదా కల్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని భారత్ తప్పుపట్టింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్–బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తేల్చిచెప్పారు. ప్రొవెన్షియల్ హోదా పేరిట ఆ ప్రాంత ప్రజలను మభ్యపెట్టేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోందన్నారు. హోదా మార్చడం కాదు.. ఆక్రమిత ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. గిల్గిత్–బాల్టిస్తాన్‌కు ప్రొవెన్షియల్ హోదా ఇస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించినట్లు మీడియా వెల్లడించింది. -
ప్రధాని మోదీకి చేదు అనుభవం..
కోల్కత్తా : బెంగాల్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జేఎన్‌యూ హింసకు నిరసనగా... విద్యార్థి సంఘాల నాయకులు ‘గోబ్యాక్ మోదీ’ అంటూ ప్లేకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శించారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో నిరసనకారులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రెండు రోజుల పర్యటిన నిమిత్తం శనివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి కోల్‌కత్తాకు బయటదేరిన విషయం తెలిసిందే. కోల్కత్తా విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి పలువురు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు శనివారం కోల్‌కతాలోని రాజ్‌భవన్ వేదికగా భేటీ అయ్యారు. అయితే ఏ అంశాలపై భేటీ జరగనుందో తెలియాల్సి ఉంది. అలాగే ఈ నెల 12న కోల్‌కతాలో జరగనున్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వసంతోత్సవ కార్యక్రమంలో వీరిరువురు మరలా ఒకే వేదికపై కలిసే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. -
గో బ్యాక్ అంటే గుజరాత్‌కు పొమ్మని...
సాక్షి, విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనను ’గో బ్యాక్’ అన్నందుకు టీడీపీకి ప్రధాని ధన్యవాదాలు చెప్పగా... మరోవైపు చంద్రబాబు గో బ్యాక్ అంటే ఢిల్లీ కాదని, గుజరాత్ వెళ్లమని అంటూ కొత్త భాష్యం చెప్పారు. గుంటూరులో జరిగిన బీజేపీ చైతన్య సభలో ప్రధాని మోదీ...చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో మోదీ వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. విజయవాడలో ఆదివారం జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి చంద్రబాబు నల్ల చొక్కా ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఇళ్లపట్టాల పంపిణీ కోసం గవర్నర్ ఆమోదం కోసం పంపితే మూడు నెలలు పెండింగ్‌లో పెట్టారు.7500 కోట్ల రూపాయిల విలువైన ఆస్తిని పేదలకు పట్టాల రూపంలో పంపిణీ చేస్తున్నాం. నన్ను తిట్టడానికే ఫ్లయిట్ వేసుకుని వచ్చారు. ఏపీకి ఆయన ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నారు. తిట్టడం సులభం..పనులు చేయడం కష్టం. మోదీని ఎవరు క్షమించరు. తల్లిని చంపి బిడ్డను కాపాడారు. తల్లిని కాపడతానని మోదీ చెప్పారు. తల్లిని దగా చేసిన వ్యక్తి మోదీ. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మట్టి, నీరు తెచ్చి మన మొహం మీద కొట్టారు. మోదీకి, నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 14 సీట్లు ఇస్తే కేవలం 4సీట్లు గెలిచారు. పొత్తుతో నష్టపోయింది మేమే. సీఐజీ అడిగితే లెక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. లెక్కలు అడగాల్సింది మీరు కాదు. రాజధానికి డబ్బులు ఇవ్వరు. పోలవరం డీపీఆర్ ఆమోదం తెలపరు. వెనుకబడిన జిల్లాలకు నిధుల ఊసు కూడా ఎత్తరని’ అన్నారు. లోకేష్ తండ్రిగా గర్వపడుతున్నా.. తండ్రీ, కొడుకుల అవినీతి పాలన అంతం అయ్యేరోజు దగ్గరలోనే ఉందన్న ప్రధాని వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. లోకేష్ తండ్రిగా నేను గర్వపడుతున్నా. మోదీకి కుటుంబం లేదు. అనుబంధాలు తెలియవు. విడాకులు ఇవ్వకుండానే యశోద బెన్ను దూరం పెట్టారు. నేను మాట్లాడితే మోదీ తల ఎక్కడ పెట్టుకుంటారు. నా కుటుంబాన్ని చూసి నేను గర్విస్తున్నా. నాది యూ టర్న్ కాదు. నాది రైట్ టర్న్. మోదీ నమ్మించి మోసం చేశారు. అందుకే ఎదురు తిరిగా. గుజరాత్ కన్నా ఏపీ అభివృద్ధి చెందుతోందని మోదదీ అసూయ అమరావతి నా సొంత నిర్మాణం కాదు. హుందాతనాన్ని మరిచి మోదీ మాట్లాడుతున్నారు. ఆయన అసూయ పడేలే అమరావతి నిర్మాణం చేసి చూపిస్తా. అందుకే ఎదురు తిరిగా.. మేం బానిసలం కాదు. అప్పులు చేసి రాజధాని కడుతుంటే పన్నులు వసూలు చేస్తున్నారు. మోదీకి కేవలం ప్రచారం ఆర్భాటం. గురువుకు నామాలు పెట్టిన సంస్కృతి మీది. ఓటమిలో సీనియర్ అని నన్ను విమర్శలు చేస్తున్నారు. నేను ఎవరికీ భయపడను. ఒకరి దగ్గర మోకరిల్లాల్సిన అవసరం నాకు లేదు. ఏపీలో ఉన్న పెట్రోలియం ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించి, మన సంపదను దోచుకునేందుకు చూస్తున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య. దేశాన్ని, రాజకీయాలను మోదీ కలుషితం చేస్తున్నారు. ఆయన తనకు కావాల్సిన వ్యక్తులకు దేశాన్ని దోచిపెడుతున్నారు. మహా కూటమి తలుచుకుంటే మోదీ ఇంటికి పోవడం ఖాయం. మోదీకి ఇంతకన్నా అవమానం ఏముంటుంది.. ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చెయ్యకుండా రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ సభకు ప్రజలు హాజరు కాలేదు. ప్రధాని సభకు రెండు మూడు వేలకు మించి రాలేదు. ప్రధాని మోదీకి ఇంతకన్నా అవమానం ఏముంటుంది. ఆంధ్రుల్లో ఆత్మాభిమానం మెండు, తెలుగు వారు సర్వెంట్లు కాదు. నా పిలుపును అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.తెలుగు ప్రజల వ్యతిరేకత వేడికి గతంలో మోదీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ వచ్చిన ఆయనకి ప్రజల నిరసన జ్వాలలు తగిలాయి. సభా వేదిక బయట ఒక్క పురుగు లేకపోతే అడ్డుకున్నామన్నది హాస్యాస్పద’ మని వ్యాఖ్యానించారు. -
ట్విట్టర్లో వైరల్ అవుతున్న గోబ్యాక్ మోదీ హ్యాష్‌ట్యాగ్
-
నేడు తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన
-
కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట
సాక్షి, లింగంపేట్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నల్లమడుగు సురేందర్ చేపట్టిన రాజీవ్ సందేశ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకున్నారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. లింగంపేట్ మండలంలో నల్లమడుగు సురేందర్ పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఇందులో పాల్గొన్నారు. నిన్న రాత్రి పాదయాత్ర తాడ్వాయి మండలం ఏర్రా పహాడ్‌కు చేరుకున్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డగించారు. కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థతులు తలెత్తాయి. గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
‘మంజునాథ కమిషన్ గో బ్యాక్’
-
‘తెలుగు మీడియం రద్దు’
జీఓను ఉపసంహరించాలి విద్యావికాస వేదిక రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ కాకినాడ సిటీ : మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో తెలుగుమీడియం రద్దు చేసి ఇంగ్లిష్ మీడియంను కొనసాగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని విద్యావికాస వేదిక డిమాండ్ చేసింది. బుధవారం ‘మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టుట– విద్యారంగంపై ప్రభావం’ అనే అంశంపై జనవిజ్ఞానవేదిక జిల్లా కార్యాలయంలో విద్యావికాస వేదిక జిల్లా కన్వీనర్ కె.సత్తిరాజు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా క్రియా ఫౌండేష¯ŒS నిర్వాహకులు ఎస్ఎస్ఆర్ జగన్నాథరావు పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో తల్లిదండ్రుల ఆసక్తి మేరకు సమాంతరంగా తెలుగు, ఇంగ్లిష్ మాద్యమాలు ప్రవేశపెట్టి, తగిన సిబ్బందిని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యావికాస వేదిక జిల్లా కన్వీనర్ కె.సత్తిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకువచ్చే సంస్కరణలపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులతో సంప్రదించకుండా మున్సిపల్ శాఖామంత్రి ఏకపక్షంగా నిర్ణయించడం తగదన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఇంగ్లిష్ మీడియం తరగతులకు పోస్టులు మంజూరు చేయాలని, విద్యారంగంలో కార్పొరేట్ విధానాలు తొలగించాలని, విద్యకు బడ్జెట్లో తగినన్ని ఎక్కువ నిధులు కేటాయించాలని, మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియానికి సంబంధించి విడుదల చేసిన జీఓ 14ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షులు జి.ప్రభాకరవర్మ, బాలవేదిక కన్వీనర్ ఎ¯ŒS.బలరామకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హెచ్ సీయూలో వీసీ ఘెరావ్
♦ ముందస్తు సమాచారం లేకుండా దీక్షాస్థలికి వచ్చిన ఇన్చార్జి వీసీ ♦ ఆగ్రహించిన విద్యార్థులు.. గోబ్యాక్ అంటూ నినాదాలు సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన శ్రీవాస్తవ ముందస్తు సమాచారం లేకుండా దీక్షా స్థలికి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి జేఏసీ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటుండగా శ్రీవాస్తవ దీక్షాస్థలానికి వచ్చారు. ఇది తెలుసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులు దీక్షాస్థలానికి చేరుకున్నారు. వీసీ గోబ్యాక్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇన్చార్జి వీసీ తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేవరకూ ఎవరి తోనూ మాట్లాడబోమన్నారు. దీంతో శ్రీవాస్తవ వెనుదిరిగారు. విద్యార్థుల డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించగా... అందుకే ఇక్కడికి వచ్చానని, విద్యార్థులు అనుమతించలేదని ముక్తసరిగా సమాధానం చెప్పి వెళ్లిపోయారు. ఇన్చార్జి వీసీ తప్పుకోవాల్సిందే.. తమ డిమాండ్లను నెరవేర్చకుండా, విద్యార్థులను మరింత రెచ్చగొట్టి ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నంలో భాగంగానే శ్రీవాస్తవ దీక్షాస్థలానికి వచ్చారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఇద్దరి ఆత్మహత్యలకు కారకుడైన విపిన్ శ్రీవాస్తవ ఎవరూ లేని సమయం చూసుకుని దీక్షాస్థలానికి రావడంలో అర్థమేమిటని విద్యార్థి నాయకురాలు అర్పిత ప్రశ్నించారు. దొంగతనంగా వచ్చి వెళ్లారని మండిపడ్డారు. ఆయనకు దైర్యం ఉంటే తప్పులను ఒప్పుకుని పదవి నుంచి వైదొలగాలని విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీల బంద్ విజయవంతం రోహిత్ ఆత్మహత్య అంశంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి జేఏసీ నేతలు ఇచ్చిన యూనివర్సిటీల బంద్ పిలుపు విజయవంతమైంది. ఢిల్లీలోని జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, కేరళలోని కాలికట్ యూనివర్సిటీ, చెన్నై వర్సిటీ, ముంబై వర్సిటీ, రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, ఉర్దూ, మహాత్మాగాంధీ, హెచ్‌సీయూ, జేఎన్టీయూ విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారని.. అఖిల భారత స్థాయిలో బంద్ విజయవంతం అయిందని విద్యార్థి నాయకులు అర్పిత, వెంకటేశ్ చౌహాన్ తెలిపారు. అఖిల భారత విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు. హెచ్‌సీయూలో బుధవారం సమావేశమైన విద్యార్థి జేఏసీ నేతలు... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. దీంతోపాటు రోహిత్ తల్లితో కలసి వెళ్లి రాష్ట్రపతిని కలవాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం రిలే దీక్షలు.. సెలవుపై వెళ్లిన హెచ్‌సీయూ వీసీ అప్పారావును డిస్మిస్ చేయాలని, ఇన్చార్జి వీసీ శ్రీవాస్తవ తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు హెచ్‌సీయూ అధ్యాపక బృందం ప్రకటించిం ది. గతంలో సెంథిల్ కుమార్, నేడు రోహిత్ ఆత్మహత్య కు కారణమైన శ్రీవాస్తవ వీసీగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించింది. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా తాము దీక్షకు ఉపక్రమించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పదవికి రాజీనామా చేసిన ప్రొఫెసర్ కృష్ణ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏబీవీపీ సెమినార్లు రోహిత్ ఆత్మహత్య ఘటనపై గురువారం నుంచి దేశవ్యాప్తంగా సెమినార్లు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏబీవీపీ ప్రకటించిం ది. కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని... ఆ ఘటనకు సంబంధించి జరిగినదేమిటో, వాస్తవాలేమిటో వివరిస్తామని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినయ్ బిద్రే తెలిపారు. మరో ఏడుగురు ఆమరణ దీక్ష గురువారం నుంచి మరో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్ష చేయనున్నట్లు విద్యార్థి నాయకులు ప్రకటించారు. దీక్ష చేస్తున్న విద్యార్థుల్లో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మంగళవారం వారిని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. వారితోపాటు గత నాలుగు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న పీహెచ్డీ విద్యార్థి దేవీప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇక విద్యార్థులకు మద్దతుగా తమిళనాడుకి చెందిన ప్రముఖ రచయిత్రి ప్రొఫెసర్ మీనా కందస్వామి బుధవారం ఒక రోజు దీక్ష చేపట్టారు. హెచ్‌సీయూ కేంద్రంగా ఎగిసిపడిన ఉద్యమం వివక్షకు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త ఉద్యమానికి దోహదపడనుందని ఆమె తెలిపారు. వివక్షకు గురవుతున్నది కేవలం విద్యార్థులే కాదని, దళిత ప్రొఫెసర్లు సైతం వివక్ష ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. -
ఆంధ్రా జడ్జి గో బ్యాక్
మంచిర్యాల టౌన్ : ఆంధ్రా జడ్జి గో బ్యాక్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మంచిర్యాల కోర్టు మారుమోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కో ర్టులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్ర త్యేక తెలంగాణ హైకోర్టు కోసం మంగళవారం సు ప్రీం కోర్టులో విచారణకు రానుండటంతో మద్దతుగా మంచిర్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు ని రాహార దీక్షకు దిగారు. న్యాయవాదులు నిరాహార దీ క్షలో ఉండగా కోర్టులోని న్యాయమూర్తులు కేసు విచారణలు చేపడుతుండటంతో న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులోకి దూసుకెళ్లారు. అయి నా.. కేసుల విచారణ కొనసాగుతుండటంతో న్యాయవాదులు కోర్టు గదులకు తాళాలు వేశారు. న్యాయమూర్తులు ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్‌కు సమాచారం తెలియజేయడంతో పోలీసులు కోర్టుకు వచ్చా రు. అయితే.. కేసుల విచారణ సాగేది లేదని ఆందోళన చేపట్టగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. న్యాయమూర్తుల విధులకు ఆటంకం కలిగించకుండా పోలీసులు కక్షిదారులను, సాక్షులను న్యాయస్థానంలోకి పంపుతున్న క్ర మంలో ఎస్సై వెంకటేశ్వర్లుకు, న్యాయవాదులకు మ ధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఎస్సై వెంకటేశ్వర్లును న్యాయవాదులు కిందకు తోసేయగా చేతి వాటం కూడా చోటుచేసుకుంది. పోలీసులు మంచి ర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించడంతో కోర్టుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. న్యాయవాదులను బయటకు పంపించి కేసుల విచారణ కొనసాగేలా చేశారు. మరింత ఆగ్రహించిన న్యా యవాదులు ‘ఆంధ్రా జడ్జి గో బ్యాక్, న్యాయవాదుల నిరసనను అడ్డుకున్న ఆంధ్రా ఎస్సై గో బ్యాక్’ అం టూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. కేసులు విచారణ జరుగుతుండటంతో మరోసారి మద్దతుదారులగా వచ్చిన ఇతర ప్రాంతాల బార్ అ సోసియేషన్ న్యాయవాదులు ఒక్కసారిగా న్యాయస్థానంలోకి దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల కోర్టులో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అహంకార పూరిత, తెలంగాణ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరోమారు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు న్యాయవాదులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రిలే నిరాహార దీక్షలు కొనసాగించేలా తీర్మానించారు. కాగా న్యాయమూర్తులు విధులు ముగిసిన అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య బయటకు వెళ్లిపోయారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు సురేశ్, వేణుచందర్, ప్రవీణ్‌కుమార్‌తోపాటు మంచిర్యాల సబ్‌డివిజన్‌లోని ఎస్సైలు, బెల్లంపల్లి రిజర్వ్ పోలీస్‌లు, సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన న్యాయవాదులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. రిలే దీక్షలో కూర్చున్న న్యాయవాదులు... న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలో న్యాయవాదు లు కర్రె లచ్చన్న, పి.నారాయణ, ఆర్.లక్ష్మణ్, దేవి నవీన్శ్రీనివాస్, శరత్‌బాబు, బి.శ్రీరాములు, సరేందర్ఉపాధ్యాయ, జెల్ల రాజయ్య, పి.అశోక్, సునీల్, పూదరి రమేశ్, దేవి శ్రీధర్, ఎన్.లక్ష్మీరాజం, ఎ.శ్రీనివాస్ కూర్చున్నారు. వీరికి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఎంపీపీ బేర సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు. ముల్కల్ల మల్లారెడ్డి, పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు అందె మంగ తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. కాగా.. మంచిర్యాల కోర్టులో తలెత్తిన సంఘటనపై వివిధ జిల్లాల నుంచి న్యాయవాద సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారుు. నిజామాబా ద్, కరీంనగర్, జగిత్యాల, సుల్తానాబాద్, గోదావరి ఖని, మంథని, ఆదిలాబాద్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూర్ కోర్టులకు చెందిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. -
ఒబామా.. గో బ్యాక్!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను నిరసిస్తూ వామపక్షాల నేతృత్వంలో నిరసనలు హోరెత్తాయి. ఒబామా...గో బ్యాక్ అన్న నినాదం మిన్నంటింది. చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నించారు. మదురై, తిరుచ్చిల్లో నిరసనలు వాగ్యుద్ధానికి దారి తీశాయి. సాక్షి, చెన్నై : భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఒబామా, భార త ప్రధాని నరేంద్ర మోదీల మధ్య పలు అంశాలకు సంబంధించిన ఒప్పందాలు కుదరనున్నాయి. అయితే, ఈ ఒప్పందాలన్నీ భారత్ మీద ప్రభావం చూపించేవిగా, దేశ ప్రజల నడ్డి విరిచే రీతిలో సంతకాలు చేయనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. భారత్‌ను నిర్బంధించి మరీ ఈ ఒప్పందాలకు అమెరికా కసరత్తులు చేసినట్టుగా ప్రచారం సాగింది. దీంతో ఒబామా పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. భారత్‌లో చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడుల వ్యవహారంతో పాటుగా దేశ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే రీతిలో సాగనున్న ఒప్పందాల సంతకాలను వ్యతిరేకించే విధంగా ఒబా మా పర్యటనను అడ్డుకునేందుకు పరుగులు తీశారు. నిరసనల హోరు సీపీఎం, సీపీఐల నేతృత్వంలో రాష్ట్రంలో వారికి పట్టున్న అన్ని ప్రాంతాల్లో శనివారం నిరసనలు చేపట్టారు. చెన్నై లో అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నిం చారు. మదురైలో ప్రధాన తపాలా కార్యాలయాన్నిముట్టడించారు. తిరుచ్చిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ నిరసన చోటు చేసుకుంది. ఉదయాన్నే సీపీఎం శాసన సభా పక్ష నేత సౌందరరాజన్, సీపీఐ నాయకుడు వీర పాండియన్ల నేతృత్వంలో ఆ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు ర్యాలీగా జెమిని వంతెన సమీపంలోని అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి బయలు దేరారు. ముందుస్తుగా అనుమతి కోరినా, పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహంతో నిరసన కారులు ముందుకు సాగారు. వీరిని సమీపంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు నిరసనకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒబామాకు వ్యతిరేకంగా ప్లకార్డులు, వ్యంగ్య చిత్రాలను చేత బట్టి నిరసన తెలియజేశారు. ఒబామా గో బ్యాక్ అని నినదిస్తూ కాసేపు నిరసన అనంతరం అక్కడి నుంచి వెను దిరిగారు. నిరసనను ఉద్దేశించి సౌందరరాజన్ మాట్లాడుతూ, భారత్‌ను నిర్బంధించి మరి కొన్ని రకాల సంతకాలకు అమెరికా ఒడి గట్టిందని ఆరోపించారు. అమెరికాకు చెందిన కొన్ని మందుల్ని అధిక ధరలో భారత్‌లో విక్రయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజల మనో భావాలకు వ్యతిరేకంగా, భారత ప్రజల నడ్డి విరిచే విధంగా ఒబామా పర్యటన సాగనుందని, అందుకే వ్యతిరేకిస్తున్నామన్నారు. వాగ్యుద్ధం : మదురైలో సీపీఎం, సీపీఐ నాయకులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఒబామాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గో బ్యాక్ అని హెచ్చరిస్తూ ఆ కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్యుద్ధం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళన కారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయినా, నిరసనకు దిగారు. సీపీఎం అభ్యర్థి అన్నాదురై నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు ఒబామాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్యుద్ధం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. -
పూలింగ్ పోరాటం
-
వారణాసిలో మోడీ పోస్టర్లకు తారు
'నరేంద్ర మోడీ గో బ్యాక్ టు గుజరాత్'! వారణాసిలో ఇప్పుడు బిజెపియేతర పక్షాలన్నీ ఈ నినాదాన్ని జపిస్తున్నాయి. ఒక వైపు బిజెపి కార్యకర్తల్లో భారీ ఉత్సాహం పెల్లుబుకుతూంటే, మరో వైపు ఆయన విరోధులు కూడా పూర్తి జోరుమీదున్నారు. ఆదివారం వారణాసిలో పలు చోట్ల మోడీ పోస్టర్లపై సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు తారు పూశారు. మోడీ గో బ్యాక్ అంటూ గోడలపై రాతలు రాశారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత అరవింద్ కేజరీవాల్ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి అభ్యర్థినే బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బిజెపయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. మోడీ వారణాసి నుంచి పోటీ చేయడంతో తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్ లో బిజెపికి చాలా అనుకూల వాతావరణం ఏర్పడిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తారు పూయడం, గోబ్యాక్ అనడం తమకే లాభిస్తాయని బిజెపి భావిస్తోంది.