
ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ.. గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన
విశాఖపట్టణం: పరిపాలన రాజధానిగా ఎంపికైన విశాఖపట్టణానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైజాగ్‌వాసులు షాకిచ్చారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినదించారు. విశాఖపట్టణానికి రాగా అతడిని గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కూడలిలో శుక్రవారం రాత్రి నిలబడి చంద్రబాబు పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత పర్యటన చేపట్టాలని ఈ సందర్భంగా నిరసనకారులు విజ్ఞప్తి చేశారు.
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు విశాఖపట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాకను స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. పరిపాలన రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారని నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ప్రజలు నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పజలకు క్షమాపణ చెప్పిన తరువాత పర్యటన చేయాలని డిమాండ్ చేశారు.