Visakha Garjana: Residents Of Visakhapatnam Protested Against Pawan Kalyan - Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ తీరుపై విశాఖ వాసుల ఆందోళన.. పవన్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు

Published Sun, Oct 16 2022 9:58 AM | Last Updated on Sun, Oct 16 2022 12:15 PM

Residents Of Visakhapatnam Protested Against Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ రాజధానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జనసేన సైనికులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ పోర్టు స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జన వానికి పవన్ కళ్యాణ్ రాకుండా అడ్డుకుంటామని, పవన్‌ గో బ్యాక్‌, గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ  ఆయన చిత్రపటానికి చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. 

ఆందోళనల నేపథ్యంలో పలువురు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, స్థానికులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీంతో పోలీసుల చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టును ఖండించారు నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు. జన సైనికుల పేరిట జరిగిన దౌర్జన్యంపై మహిళలూ ఆందోళనలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మంత్రులు, నేతలను చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారు: విశాఖ సీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement