మీరట్: ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ సర్దానా ప్రాంతంలో మళ్ళీ కలకలం సృష్టించింది. ఇప్పటికే జెఎన్ యు కేసుతో దేశం అట్టుడుకుతుండగా మీరట్ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఓ సంతాప సభ సమావేశం అనంతరం ఓ గ్రూప్ నకు చెందని కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జాట్ రిజర్వేషన్ల ఆందోళన సందర్భంలో ముజఫర్ నగర్ సోనిపట్ లో మృతి చెందిన దళిత యువకుడు కులదీప్ మృతికి సంతాపంగా సర్దానాలో సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆందోళనకారులు నినాదాలు చేయడంతో పాటు రోడ్లను నిర్బంధించినట్టు రూరల్ ఎస్పీ ప్రవీణ్ రంజన్ తెలిపారు. మత వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా వెళ్ళిన కార్యకర్తలు స్థానిక తహశీల్దార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.
ఆరుగురు కార్యకర్తలు మత మనోభావాలను దెబ్బతీసేవిధంగా నినాదాలు చేశారని, వారిని అరెస్ట్ చేయలేదని రూరల్ ఎస్పీ తెలిపారు. ప్రత్యేక భద్రత బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లో నినాదాల కలకలం
Published Thu, Feb 25 2016 4:34 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
Advertisement
Advertisement