
శైలజానాథ్‌కు సమైక్యసెగ
టీడీపీ ఎమ్మెల్యేలు కేశవ్, అశోక్‌లనూ నిలదీసిన ఉద్యమకారులు
సాక్షి నెట్‌వర్క్: అనంతపురంలో మంత్రి సాకే శైలజానాథ్‌కు సమైక్యసెగ తగిలింది. పీఆర్‌ఉద్యోగ సంఘాల జేఏసీ, మునిసిపల్ ఉద్యోగుల జేఏసీ నేతలు ‘గోబ్యాక్ శైలజానాథ్’ అంటూ నినాదాలు చేశారు. బహిరంగసభలో ప్రసంగిస్తున్న సమయంలోనూ ‘శైలజానాథ్ డౌన్ డౌన్.. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఇదే జిల్లా కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు చేపట్టిన రిలేదీక్షలకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంఘీభావం తెలపడానికి వెళ్లగా.. ‘గో బ్యాక్’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ వద్ద రిలే దీక్షలు చేపడుతున్న ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక గజపతిరాజు వెళ్లగా, ఉపాధ్యాయులు అడ్డుకున్నారు.