లండన్‌లో బీజేపీ మద్దతుదారుల పాదయాత్ర | Modis Slogans Echoed in London | Sakshi
Sakshi News home page

London: లండన్‌లో బీజేపీ మద్దతుదారుల పాదయాత్ర

Published Mon, Apr 29 2024 8:46 AM | Last Updated on Mon, Apr 29 2024 8:46 AM

ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులు, బీజేపీ మద్దతుదారులు లండన్‌లో రన్ ఫర్ మోదీ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని బీజేపీపై, ప్రధాని మోదీపై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.

2019 ఎన్నికల సమయంలోనూ  రన్‌ ఫర్‌ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ యూకే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ మంగళగిరి తెలిపారు. నాడు కూడా ప్రజలు బీజేపీపై తమ అభిమానాన్ని  ఇదే రీతిలో వ్యక్తం చేశారన్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై ఎన్నారైలకు అమితమైన ప్రేమ ఉన్నదన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపు తదితర మంచి పనులను బీజేపీ చేపట్టిందని సురేష్‌ పేర్కొన్నారు. లండన్‌లో నిర్వహించిన రన్‌ ఫర్‌ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మద్దతుదారులు  ఆ పార్టీ జెండాలను చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు.  ఈ కార్యక్రమంలో 400కు పైగా ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement