Jr Ntr Fans Counter To Meera Chopra For Indirect Post On NTR Viral - Sakshi
Sakshi News home page

Jr Ntr Fans Fires On Meera Chopra: ఎన్టీఆర్‌పై పరోక్షంగా మీరా చోప్రా పోస్ట్‌.. ఫ్యాన్స్ చురకలు

Published Sat, Apr 9 2022 8:13 PM | Last Updated on Sun, Apr 10 2022 8:23 AM

Jr Ntr Fans Counter To Meera Chopra For Indirect Post On NTR - Sakshi

వాన, బంగారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ మీరా చోప్రా. అయితే అంతకన్నా ఎక్కువగా యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా పెట్టిన ఆమె ట్వీట్లతో మరింత పాపులర్‌ అయింది. రెండేళ్ల క్రితం తారక్‌ను ఉద్దేశిస్తూ పెట్టిన మీరీ చోప్రా ట్వీట్లు తెగ వైరల్‌ అయ్యాయి.

Jr Ntr Fans Counter To Meera Chopra For Indirect Post On NTR: వాన, బంగారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ మీరా చోప్రా. అయితే అంతకన్నా ఎక్కువగా యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా పెట్టిన ట్వీట్లతో ఆమె మరింత పాపులర్‌ అయింది. రెండేళ్ల క్రితం తారక్‌ను ఉద్దేశిస్తూ పెట్టిన మీరా చోప్రా ట్వీట్లు తెగ వైరల్‌ అయ్యాయి. ఆ ట్వీట్లు చూసిన ఎన్టీఆర్‌ అభిమానులు మీరాపై ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్‌ మీడియాలో ఆమెను దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. ఈ విషయంపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులను ఆశ్రయించింది మీరా చోప్రా. అయితే తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఒక పోస్ట్‌ మళ్లీ తారక్‌ ఫ్యాన్స్‌ మండిపోయేలా చేసింది. 

చదవండి: ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా

'సౌత్ ఇండియన్ యాక్టర్స్‌ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి టాలెంట్‌, వినయం, ప్యాషన్‌ను చూసి ఒకరు కచ్చితంగా నేర్చుకోవాలి.' అంటూ ప్రభాస్‌, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ పేర్లకు హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది. ఈ పోస్టులో కావాలనే ఎన్టీఆర్‌ను మెన్షన్‌ చేయలేదని తారక్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీపికా పదుకొణె, అలియా భట్‌ వంటి స్టార్‌ హీరోయిన్లే జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించేందుకు ఇష్టపడుతున్నారని, అవుట్‌ డేటెడ్, జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కూడా పనికిరాని వారి మాటలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తారక్ ఫ్యాన్స్‌ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక సమయంలో ఎన్టీఆర్‌కు జోడీగా మీరా చోప్రాకు నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఈ అక్కసుతోనే తారక్‌ను మీరా చోప్రా టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతుందని సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement