సాక్షి, హైదరాబాద్: బోస్టన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 19 నుంచి జరగనుంది. బోస్టన్ మిషన్ స్కూల్ (తాడ్‌బన్) ఆధ్వర్యంలో ఈ టోర్నీ మ్యాచ్‌లు మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్) గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారు. అండర్-12, 14, 16 విభాగాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు జరుగుతాయి.
సోమవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి రవికుమార్ నర్రా ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని ఆరంభిస్తారు. 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఏడాది జంటనగరాల నుంచి సుమారు 100 క్రికెట్ జట్లు పోటీ పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎస్‌సీఎఫ్ రెడ్, సూపర్ క్యాట్ క్రికెట్ అకాడమీ, గోవింద్‌రాజు సీఏ, అర్షద్ అయూబ్ సీఏ, తులసీ హైస్కూల్, లెజెండ్ స్పోర్ట్స్ అసోసియేషన్, జూబీ సీఏ, సీసీఓబీ, ఎం.ఎల్. జయసింహ సీఏ, సులేమాన్ హైస్కూల్, మిషన్ హైస్కూల్, నోబుల్ హైస్కూల్, గౌతమ్ స్కూల్ తదితర జట్లు పాల్గొననున్నాయి. మరిన్ని వివరాలకు బోస్టన్ మిషన్ హైస్కూల్ కరస్పాండెంట్ షకీర్ అహ్మద్‌ను 9246362299 ఫోన్‌నంబర్లో సంప్రదించవచ్చు.
రేపటి నుంచి బోస్టన్ కప్ క్రికెట్
Published Sun, May 18 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement