ఎస్‌సీఎఫ్ జట్ల జోరు | scfr teams wins | Sakshi
Sakshi News home page

ఎస్‌సీఎఫ్ జట్ల జోరు

Published Tue, May 20 2014 2:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఎస్‌సీఎఫ్ జట్ల జోరు - Sakshi

ఎస్‌సీఎఫ్ జట్ల జోరు

బోస్టన్ కప్ క్రికెట్
 సాక్షి, హైదరాబాద్: బోస్టన్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్) జట్లు శుభారంభం చేశాయి. అండర్-12 కేటగిరీలో ఎస్‌సీఎఫ్ బ్లూస్, ఎల్లో, గ్రీన్ జట్లు విజయాలు నమోదు చేశాయి. అంతకుముందు మాసబ్‌ట్యాంక్‌లోని ఎస్‌సీఎఫ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి నర్రా రవికుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి టోర్నీని ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో ఎస్‌సీఎఫ్ ఎల్లో 5 వికెట్ల తేడాతో డాన్ బ్రాడ్‌మన్ సీసీపై నెగ్గింది.

 ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్రాడ్‌మన్ సీసీ జట్టు 6 ఓవర్లలో 3 వికెట్లకు 44 పరుగులు చేసింది. తన్వీర్ 12, గణిత్ 11 పరుగులు చేశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఎస్‌సీఎఫ్ ఎల్లో జట్టు 5.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసి గెలిచింది. ఆర్య 16 పరుగులు చేశాడు. ఇతనికే మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మిగతా మ్యాచ్‌ల్లో ఎస్‌సీఎఫ్ బ్లూస్ 11 పరుగుల తేడాతో వారియర్స్‌పై, ఎస్‌సీఎఫ్ గ్రీన్ 8 వికెట్ల తేడాతో సీకే నాయుడు ఎలెవన్‌పై, సూపర్ క్యాట్స్ జట్టు 24 పరుగుల తేడాతో గోవింద్‌రాజ్ సీఏపై గెలిచాయి.

సంక్షిప్త స్కోర్లు
సూపర్ క్యాట్స్: 64/2 (షకీబ్ 25, సల్మాన్ 18), గోవింద్‌రాజ్ సీఏ: 38/3 (బర్న అబ్బాస్ 17).  ఎస్‌సీఎఫ్ బ్లూస్: 75/0 (రోహిత్ 37 నాటౌట్), ఎస్‌సీఎఫ్ వారియర్స్: 65/2 (అబ్దుల్ 12).  సీకే నాయుడు ఎలెవన్: 57/1 (అఫ్తాబ్ 30) ఎస్‌సీఎఫ్ గ్రీన్: 59/0 (అనిరుధ్ 22 నాటౌట్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement