Sports Coaching Foundation
-
ఎస్‌సీఎఫ్‌కు కేంద్ర అవార్డు
ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారం న్యూఢిల్లీ : క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు ‘స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్’ విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో ఎస్సీఎఫ్ శిక్షణ ఇస్తూ అర్హులైన వారికి స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు కోసం ఎంపిక చేసిన ఐదుగురి పేర్లను క్రీడాశాఖ ఆమోదించింది. రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్, పారాలింపిక్స్ కోచ్ నావల్ సింగ్‌ల పేర్లను ప్రస్తుత ప్రదర్శన (2011-2014) ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేయగా జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో నిహర్ అమీన్ (స్విమ్మింగ్), ఎస్ఆర్ సింగ్ (బాక్సింగ్), హర్బన్స్ సింగ్ (అథ్లెటిక్స్)లకు దక్కనుంది. వీరికి తలా రూ.5 లక్షల నగదు, ప్రతిమను అందిస్తారు. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సత్యవర్త్ కడియన్, బజరంగ్, అమిత దహియాలను రెజ్లర్లుగా తీర్చిదిద్దడంలో కోచ్ అనూప్ కుమార్ పాత్ర ఉంది. ధ్యాన్‌చంద్ అవార్డు కోసం రోమియో జేమ్స్ (హాకీ), ఎస్పీ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్) పేర్లను ఖరారు చేశారు. -
ఎస్సీఎఫ్ జట్ల జోరు
బోస్టన్ కప్ క్రికెట్ సాక్షి, హైదరాబాద్: బోస్టన్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) జట్లు శుభారంభం చేశాయి. అండర్-12 కేటగిరీలో ఎస్సీఎఫ్ బ్లూస్, ఎల్లో, గ్రీన్ జట్లు విజయాలు నమోదు చేశాయి. అంతకుముందు మాసబ్‌ట్యాంక్‌లోని ఎస్సీఎఫ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి నర్రా రవికుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి టోర్నీని ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో ఎస్సీఎఫ్ ఎల్లో 5 వికెట్ల తేడాతో డాన్ బ్రాడ్‌మన్ సీసీపై నెగ్గింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్రాడ్‌మన్ సీసీ జట్టు 6 ఓవర్లలో 3 వికెట్లకు 44 పరుగులు చేసింది. తన్వీర్ 12, గణిత్ 11 పరుగులు చేశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఎస్సీఎఫ్ ఎల్లో జట్టు 5.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసి గెలిచింది. ఆర్య 16 పరుగులు చేశాడు. ఇతనికే మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మిగతా మ్యాచ్‌ల్లో ఎస్సీఎఫ్ బ్లూస్ 11 పరుగుల తేడాతో వారియర్స్‌పై, ఎస్సీఎఫ్ గ్రీన్ 8 వికెట్ల తేడాతో సీకే నాయుడు ఎలెవన్‌పై, సూపర్ క్యాట్స్ జట్టు 24 పరుగుల తేడాతో గోవింద్రాజ్ సీఏపై గెలిచాయి. సంక్షిప్త స్కోర్లు సూపర్ క్యాట్స్: 64/2 (షకీబ్ 25, సల్మాన్ 18), గోవింద్రాజ్ సీఏ: 38/3 (బర్న అబ్బాస్ 17). ఎస్సీఎఫ్ బ్లూస్: 75/0 (రోహిత్ 37 నాటౌట్), ఎస్సీఎఫ్ వారియర్స్: 65/2 (అబ్దుల్ 12). సీకే నాయుడు ఎలెవన్: 57/1 (అఫ్తాబ్ 30) ఎస్సీఎఫ్ గ్రీన్: 59/0 (అనిరుధ్ 22 నాటౌట్). -
రేపటి నుంచి బోస్టన్ కప్ క్రికెట్
సాక్షి, హైదరాబాద్: బోస్టన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 19 నుంచి జరగనుంది. బోస్టన్ మిషన్ స్కూల్ (తాడ్బన్) ఆధ్వర్యంలో ఈ టోర్నీ మ్యాచ్‌లు మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారు. అండర్-12, 14, 16 విభాగాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు జరుగుతాయి. సోమవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి రవికుమార్ నర్రా ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని ఆరంభిస్తారు. 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఏడాది జంటనగరాల నుంచి సుమారు 100 క్రికెట్ జట్లు పోటీ పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎస్సీఎఫ్ రెడ్, సూపర్ క్యాట్ క్రికెట్ అకాడమీ, గోవింద్‌రాజు సీఏ, అర్షద్ అయూబ్ సీఏ, తులసీ హైస్కూల్, లెజెండ్ స్పోర్ట్స్ అసోసియేషన్, జూబీ సీఏ, సీసీఓబీ, ఎం.ఎల్. జయసింహ సీఏ, సులేమాన్ హైస్కూల్, మిషన్ హైస్కూల్, నోబుల్ హైస్కూల్, గౌతమ్ స్కూల్ తదితర జట్లు పాల్గొననున్నాయి. మరిన్ని వివరాలకు బోస్టన్ మిషన్ హైస్కూల్ కరస్పాండెంట్ షకీర్ అహ్మద్‌ను 9246362299 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చు. -
కార్పొరేట్ కప్ విజేత ఎన్ఎండీసీ
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఎన్ఎండీసీ జట్టు విజేతగా నిలిచింది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్)లో నిర్వహించిన ఈ డేనైట్ టోర్నమెంట్లో ఆదివారం ఎన్ఎండీసీ, 51 పరుగుల తేడాతో ఐఏఎస్ క్లబ్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎన్ఎండీసీ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. తర్వాత 122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐఏఎస్ క్లబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేయగలిగింది.