జిల్లా కలెక్టర్‌గా ప్రజా సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తి తన బాధ్యతను విస్మరించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ కుమార్ శర్మ అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్ సింగ్ అలియాస్ సోనుసింగ్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి గుర్తు తెలియని యువకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కాగా, సోనుసింగ్ మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదో తెలుసుకుందామని అతని బంధువు, ట్రైనీ పీసీఎస్ ఆఫీసర్ సునీల్ సింగ్ బుధవారం ప్రశాంత్‌కుమార్‌ను కలిసేందుకు వచ్చారు.