district megistrate
-
ప్రభుత్వం జొమాటో సర్వీసేం నడపడం లేదు!
వైరల్: వరద బాధితులను ఉద్దేశించి ఓ జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఉంది ప్రజాసేవ చేయడానికేనని అంతేగానీ జొమాటో సర్వీస్ నడపడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో.. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో తక్షణ సహాయక చర్యలు అందించాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. అంబేద్కర్ నగర్ జిల్లాలో గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఘగ్హర నది ఉప్పొంగి.. పలు గ్రామాలు వరద నీట మునిగాయి. ఈ క్రమంలో ముంపు గ్రామాల ప్రజలను ఒక చోట చేర్చి మాట్లాడారు జిల్లా కలెక్టర్ శామ్యూల్ పాల్. ప్రభుత్వం మీ అందరి కోసం వరద సహాయ శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ఉండాలని కోరింది కూడా. ఇక్కడ మీ అందరికీ క్లోరిన్ మాత్రలు అందిస్తారు. ఏమైనా సమస్యలు తలెత్తితే డాక్టర్లు వచ్చి చూస్తారు. అందుకే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాం కూడా. కానీ, మీరంతా ఇంట్లో ఉంటే ఎలాగా? తిండిని ఇంటికే పంపాలని అనుకుంటున్నారా? ప్రభుత్వం ఏమైనా మీకోసం జొమాటో సర్వీస్ నడిపిస్తుందని అనుకుంటున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే వరద బాధితులను ఉద్దేశించి కలెక్టర్ అలా మాట్లాడాల్సింది కాదంటూ ఇంటర్నెట్లో మండిపడుతున్నారు కొందరు నెటిజన్స్. మరికొందరు మాత్రం ఆ అధికారి అన్నదాంట్లో తప్పేం లేదని, గ్రామస్తులు ఇళ్లలో ఉండడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. सैमुअल एन पॉल @AmbedkarnagarDM,अब ये तो DM hai @zomato थोड़े ही चलाते है।@CMOfficeUP @myogiadityanath @aajtak @UPTakOfficial @AbpGanga @ABPNews @ZeeNews @ndtv @JagranNews @AmarUjalaNews @ArvindSinghUp @PremPrakashUp @Amarpalmbjp @bjpharshvardhan @ankitchandelbjp pic.twitter.com/3SvaxIGido — vaibhav singh (@vaibhavsinghh94) October 13, 2022 -
ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఆటోరిక్షా(ఈ-రిక్షా) సైడ్ ఇవ్వబోయింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని ప్రయాణికులందరు బురద నీటిలో పడిపోయారు. ఇంత జరిగినా కన్వాయ్‌లో వెళ్తున్న అధికారులు, సిబ్బంది మాత్రం ఏమీ పట్టనట్టు అలాగే వెళ్లిపోయారు. కనీసం వాహనం దిగి ఎవరికైనా ఏమన్నా అయిందా అని కూడా చూడలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు ఒకరు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణలో నేర్పింది ఇదేనా? సామాన్యులను పట్టించుకోరా అని మండిపడ్డారు. సామాన్యులు నడిరోడ్డుపై కిందపడినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్తే వాళ్లను అసలు పట్టించుకుంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. Ignore the common people....Is this what civil servants being taught at their training academy after qualifying India's toughest exam ? #IAS #IPS #Sitapur #CivilServices @ChiefSecyUP pic.twitter.com/MHZYP22cxM — Anand Tripathi (@dranandtripathi) October 11, 2022 ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ 15నాటికి గుంతల రోడ్లు ఉండొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. మెరుగైన రోడ్లు ప్రజల హక్కు అని ఉన్నతస్థాయి సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. చదవండి: అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు -
దవడ పగలకొట్టిన కలెక్టర్: ఆపై ట్విస్ట్..
రాయ్‌పూర్: లాక్డౌన్ రూల్స్ పేరుతో ఓ వ్యక్తితో దురుసుగా ప్రవర్తించిన ఛత్తీస్‌ఘడ్ కలెక్టర్ వ్యవహారం ట్విట్టర్‌ను కుదిపేస్తోంది. మందులు కొనడానికి వెళ్లిన ఆ వ్యక్తిపై కలెక్టర్ చెయ్యి చేసుకోవడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సూరజ్‌పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మందులు కొనడానికి వెళ్తున్న ఆ వ్యక్తిని లాక్డౌన్ విధుల్లో ఉన్న కలెక్టర్ రణ్‌బీర్ శర్మ, పోలీస్ అధికారులు అడ్డగించారు. ఆ వ్యక్తి మందులకు సంబంధించిన చీటీలు చూపిస్తున్న టైంలో కలెక్టర్ మొబైల్ ఇవ్వమని కోరాడు. సెల్‌ఫోన్‌ను నేలకోసి కొట్టి ఆ వ్యక్తి చెంపచెల్లుమనిపించాడు. అంతేకాదు అక్కడున్న పోలీసులకు అతన్ని చితకబాదమని ఆదేశాలివ్వడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు చెరోవైపు అతనిపై లాఠీ దెబ్బలు ఝుళిపించారు. ఆపై ఆ వ్యక్తిని బూతులు తిడుతూ కలెక్టర్.. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వైరల్.. చర్యలకు డిమాండ్ వాట్సాప్,ఫేస్బుక్లో ఈ వీడియో నిన్నంతా సర్క్యూలేట్ అయ్యింది. పైగా ఆ వీడియోలో ఉంది మైనర్ అని ప్రచారం కావడంతో కలెక్టర్‌పై వేటు వేయాలని కొందరు డిమాండ్ చేశారు. రణ్‌బీర్ శర్మ తీరు గుండాలా ఉందంటూ తప్పుబడుతున్నారు. ట్విట్టర్లో #SuspendRanbirSharmaIAS హ్యాష్‌ట్యాగ్‌తో కొందరు పోస్టులు పెడుతున్నారు. గతంలో త్రిపుర పశ్చిమ జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్) శైలేష్ కుమార్ యాదవ్.. ఓ పెళ్లిని మధ్యలో ఆపేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో చర్యలు తీసుకున్న విషయాన్ని కొందరు ప్రస్తావించారు కూడా. ట్విస్ట్.. కేసు అయితే ఈ ఘటనలో ఆవ్యక్తిపైనే కేసు నమోదు కావడం విశేషం. ఆ వ్యక్తి మైనర్ కాదని, ఆపమన్నా వినకుండా వేగంగా వెళ్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు కలెక్టర్ రణ్‌బీర్ శర్మ కూడా ఘటనపై స్పందించాడు. క్షమాపణలు చెబుతూ.. కావాలని చేయలేదని వెల్లడించాడు. తన కుటుంబం కూడా కొవిడ్ బారినపడినా తాను డ్యూటీ చేస్తున్నానని, తప్పుడు పేపర్లతో ఆ వ్యక్తి బయట తిరుగుతున్నాడని, ఇలాంటి టైంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజల్ని కలెక్టర్ రిక్వెస్ట్ చేశాడు. కానీ, బాధితుడు మాత్రం మెడికల్ షాప్‌కి వెళ్తున్నా.. అని చెప్తున్నా వినకుండా ‘ఎక్కడికి రా?’ అంటూ కలెక్టర్ తనతో దురుసుగా వ్యవహరించాడని వాపోయాడు. వేటుకి సీఎం ఆదేశం సూరజ్‌పూర్ కలెక్టర్ దురుసు ప్రవర్తనపై దుమారం చెలరేగిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ స్పందించారు. కలెక్టర్ రణ్‌బీర్ శర్మపై వేటు వేస్తున్నట్లు ఆదివారం సీఎం కార్యాలయం ప్రకటించింది. లాక్డౌన్ నిబంధలను ఉల్లంఘించాడని ఆ వ్యక్తిపై కలెక్టర్ చెయ్యి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. -
సీఎం ఆర్డర్ ఆమెను పిలవండి
కరోనాను కంట్రోల్లో పెట్టేందుకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దగ్గర ఉన్న ‘టీమ్ 11’ అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది! యూపీ బ్యూరోక్రసి మొత్తం కరోనాతో మంచం పట్టేసింది. ఆ టీమ్‌లోని సభ్యులైన అడిషనల్ చీఫ్ సెక్రెటరీకి శనివారం కోవిడ్ ఎటాక్ అయింది. డీజీపీకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. లక్నో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డి.ఎం.) హుటాహుటిన క్వారెంటైన్‌కు వెళ్లిపోయారు. యోగికి ఏం పాలుపోలేదు. లక్నోలో రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. కాసేపు తలపట్టుకుని, డాక్టర్ రోషన్ జాకబ్ ఎక్కడ? అని అడిగారు యోగి. ఆమె డాక్టర్ కారు. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. తక్షణం ఆమెను పిలిపించారు. లక్నో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమించారు! కరోనా ఇక తన గొయ్యి తాను తవ్వుకున్నట్లే! ఎందుకంటే.. స్కెచ్ వేసి, స్పాట్ పెట్టి ఎంతటి సమస్యనైనా ఫినిష్ చేసేస్తారని రోషన్ జాకబ్‌కు పేరు! ఇవాళ్టి నుంచీ రోషన్ జాకబ్ లక్నో జిల్లా మేజిస్ట్రేట్. అయితే శనివారమే ఆమె ఆ పనిలోకి దిగిపోయారు. కరోనాను కట్టడి చేసే పని. ఆ సీట్లో ఉన్న అభిషేక్ ప్రకాశ్‌కి కరోనా రావడంతో, అత్యవసరంగా ఆమెను నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఆమెకే ఎందుకు? అక్కడికే వస్తున్నాం. ఇప్పటికే ఆమె రెండు పదవుల్ని నిర్వహిస్తున్నారు. ఇది మూడోది! ప్రస్తుతం యూపీ జియాలజీ అండ్ మైనింగ్కి ఆమె స్పెషల్ సెక్రెటరీ, డైరెక్టర్. ఇప్పుడిక లక్నో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కూడా. ఏప్రిల్ 15న లక్నో సిటీలో నమోదైన కరోనా కేసులు 35,865. రాష్ట్రంలో మిగతాచోట్లకంటే ఎక్కువ. ‘టీమ్ 11’ ఆపలేకపోయింది. ఆపలేకపోగా తనే కరోనా బారిన పడింది. 16వ తేదీ కూడా కేసులేం తగ్గలేదు. 17న రోషన్ జాకప్‌కి పిలుపు. ‘టేక్ ద చార్జ్ ఇమ్మీడియట్లీ’. గోండా జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు రోషన్ జాకబ్ ఎలాంటి చార్జ్‌నైనా రోషన్ సవాలుగా తీసుకుంటారు. ఆమె దగ్గరో ఒక ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారం సమస్యను చుట్టుముట్టి, మట్టుపెడతారు. పరిస్థితి చక్కబడుతుంది. యూపీలోని గోండా జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆమె ఏం చేశారో చూడండి. జిల్లా అభివృద్ధిలో మహిళల ఉపాధి పథకాలను భాగం చేశారు. ‘ఉమెన్ ఎంప వర్మెంట్’ కోసం ప్రత్యేకంగా ఆమె ఏమీ పని చేయలేదు. మహిళల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడేలా చేశారు. స్త్రీ సాధికారత ప్రభావం స్త్రీల వరకే ఉంటుందా! పిల్లలు శుభ్రంగా చదువుకుంటారు. పెద్దలు బాధ్యత నేర్చుకుంటారు. ఇల్లు, ఊరు, సమాజం మెరుగవుతాయి. గోండా అలాగే క్లీన్ అయింది. కాన్పూర్ డి.ఎం.గా కూడా చేశారు రోషన్. అక్కడైతే ‘మై సిటీ’అని భారీ ప్రాజెక్టునే ప్రారంభించారు. ఆరేళ్లనాటి సంగతి ఇది. సోషల్ మీడియాను మంచికి ఉపయోగించడం, పరిశుభ్రత, చెత్త పారేయడం, విద్యు™Œ వినియోగం, నీటి సరఫరా, మురుగు నీరు సాఫీగా ప్రవహించేలా చేయడం.. ఈ ఆరు అంశాల్లో నగర ప్రజల్ని భాగస్వాముల్ని చేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే ఆ ఆధికారుల దృష్టికి సమస్య వెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ సమస్య పరిష్కారం అయిందీ లేనిదీ తెలిపే వ్యవస్థను కూడా. రోషన్ వచ్చాక సిటీ మొత్తం మారిపోయింది. ప్రజల్ని కలుపుకుని పోతే ‘పదండి చేద్దాం’ అని ముందుకు కదులుతారు. ప్రజల్ని ఆదేశిస్తే ‘అది మీ పని కదా’ అని వెనక్కి అడుగేస్తారు. రోషన్ సక్సెస్ మంత్రం అదే. ∙∙ రోషన్ జాకబ్ 2004 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి. యూపీకి తొలి మహిళా మైనింగ్ డైరెక్టర్. గత ఏడాది లాక్డౌన్లో కూడా ఆమె మైనింగ్ వర్క్‌ని నడిపించారు! దేశంలో ఇంకే రాష్ట్రంలోని మైనింగ్ డైరెక్టర్ కూడా ఇంత చొరవ చూపించలేదు. ఆమెను చూశాకే మిగతా రాష్ట్రాలు మైనింగ్ పనులను పునఃప్రారంభించాయి. ‘‘కార్మికుల ఉపాధికి విరామం వస్తే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది’’ అంటారు రోషన్. మరి కరోనా వస్తే! రాకుండా అన్నీ జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆనాడు ఆమె పని తీరు ఫలితాలను కళ్లారా చూసింది కనుకనే యోగి ప్రభుత్వం ఇప్పుడామెకు లక్నో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ బాధ్యతలు కూడా అప్పగించింది. 43 ఏళ్ల రోషన్ జాకబ్ కేరళ అమ్మాయి. -
సలక్షణంగా ఎలక్షన్ డ్యూటీ
మొత్తం ఎనిమిది విడతల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మూడో విడతగా మంగళవారం మూడు జిల్లాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రశాంతంగా జరిగింది! ఎక్కువ శాతం జరిగింది. ఆ మూడు జిల్లాలు.. దక్షిణ 24 పరగణాలు, హౌరా, హూగ్లీ. ఆ మూడు జిల్లాలకు ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహించిన ముగ్గురూ యాదృచ్ఛికమే అయినా.. మహిళలు కావడమే ఆ ప్రశాంతతకు, ఎక్కువ శాతం ఓటింగ్‌కు కారణం అని వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతర, ముక్త, ప్రియ.. అనే ఆ ముగ్గురు అధికారులు ఆయా జిల్లాల మేజిస్ట్రేట్లు. మూడు జిల్లాలు. ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలు. సుమారు డెబ్బై తొమ్మిది లక్షల మంది ఓటర్లు. ఒకే రోజు పోలింగ్. జిల్లా యంత్రాంగం మొత్తం పకడ్బందీగా పని చేస్తుంది కనుక పోలింగ్ నిర్వహణ పెద్ద పనిగా అనిపించకపోవచ్చు. అయితే పశ్చిమబెంగాల్ లో ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. గెలిచి తీరాలని దేశాన్ని పాలిస్తున్న పార్టీ, ఆ పార్టీనీ ఓడించాలని పశ్చిమ బెంగాల్ ని పాలిస్తున్న పార్టీ పోటా పోటీగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికారుల్లో ఉంది. ‘వెళ్లి ఏం వేస్తాంలే..’ అనే ఉదాసీనత ఓటర్లలో ఉండినా ఉండొచ్చు. అయితే ఆ మూడు జిల్లాల డీఎం (డిస్ట్రిక్ట్ మేజిస్టేట్)లు అంతర ఆచార్య, ముక్తా ఆర్య, దీపప్ ప్రియ గట్టి ముందస్తు ఏర్పాట్లు చేసి, కట్టు దిట్టమైన ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండి సజావుగా ఎన్నికలు జరిపించారు. అంతర.. దక్షిణ 24 పరగణాలు జిల్లా మేజిస్ట్రేట్. ముక్త.. హౌరా జిల్లా మేజిస్ట్రేట్, దీపప్ ప్రియ.. హూగ్లీ జిల్లా మేజిస్ట్రేట్. మహిళా ఓటర్లంతా ఉత్సాహంగా ముందుకు వచ్చి, ఓటింగ్ అనే ఈ ప్రజాస్వామ్య ఉత్సవాన్ని తమ చేతుల మీదుగా జరిపించాలని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. మహిళలు ఓటేస్తేనే సరైన అభ్యర్థులు విజేతలు అవుతారని, మహిళా సంక్షేమానికి తగినంత కృషి జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం ప్రచారం చేయించింది. పరిస్థితిల్లో పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత కీలకమైన ఈ మూడు జిల్లాలకు ముగ్గురూ మహిళా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్లే ఉండటం అన్నది ఎన్నికల సంఘం సంకల్పానికి బలం చేకూర్చింది. ఈ ముగ్గురు మహిళా డీఎంలు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా అన్ని వసతులూ కల్పించారు. తమ పరిధిలోని 16 నియోజకవర్గాలలో అంతర, 18 జిల్లాలలో దీపప్, 7 జిల్లాలలో ముక్త నిరంతర పర్యవేక్షణ బృందాలతో పోలింగ్‌ను విజయవంతం చేశారు. జిల్లా పౌరుల మన్ననలు పొందారు. అంతర ఆచార్య ముగ్గురిలో సీనియర్. 2006లో యు.పి.ఎస్.సి. రాశారు. ఈ ఐ.ఎస్.ఎస్. అధికారి మొదటి పోస్టింగ్ సబ్ డివిజినల్ ఆఫీసర్‌గా శ్రీరాంపూర్‌లో. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ 24 పరగణాలు జిల్లాకు మేజిస్ట్రేట్‌గా రాకముందు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో వేర్వేరు హోదాలలో పని చేశారు. దుర్గాపూర్, అసన్సోల్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా; అసన్సోల్–దుర్గాపూర్ అభివృద్ధి మండలి సీఈవోగా; ఈస్ట్ మిడ్నాపూర్ డీఎంగా విధులు నిర్వహించారు. కొంతకాలం కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ ఈసీవో గా కూడా ఉన్నారు. ముక్తా ఆర్య ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 2008 ఐ.ఎ.ఎస్. బ్యాచ్ ఆఫీసర్. లోక్‌సభ ఎన్నికలకు ముందు బంకుర జిల్లా డీఎంగా నియమితులయ్యారు. గత ఏడాది నవంబరులో హౌరాకు జిల్లా మేజిస్టేట్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీపప్ ప్రియ ముగ్గురిలో జూనియర్. 2011 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తర 24 పరగణాలు జిల్లా అడిషనల్ డీఎంగా ఉన్నారు. దక్షిణ దినాజ్‌పుర్, డార్జిలింగ్ జిల్లాల డీఎంగా పని చేశారు. ఈ ఫిబ్రవరిలో హూగ్లీ జిల్లా మేజిస్ట్రేట్‌గా వచ్చారు. చదవండి: టైమిస్తారా ఇవాళైనా? -
ఆ లంచం కేసుతో నాకు సంబంధం లేదు
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదన్నారు. కీసర తహసీల్దార్ విచారణ సమయంలో తనపై తప్పుడు ప్రచారం కొనసాగటంపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. ‘మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్ పరిధిలోనే ఉంటుంది. కలెక్టర్ వద్దకు కనీసం ఫైలు కూడా రాదు.. ఈ కేసులో నా పాత్ర ఉందనే ఆరోపణలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు సమస్యల తో వచ్చినప్పుడు విచారణ చేసి, నిబంధనల ప్రకారముంటేనే వాటిని పరిష్క రించాలని చెబుతాను. రోజూ విజిటింగ్ సమయంలో కలసిన ప్రతి ఆర్జీదారుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఆ అధి కారులూ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది’అని అన్నారు. -
కలెక్టర్ కనుమరుగు
సాక్షి, హైదరాబాద్ : కలెక్టర్ అనే పదం ఇక కనుమరుగు కానుంది. రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలు తేవాలని నిర్ణయించిన సర్కారు.. అధికారుల హోదాలో కూడా మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పాలనాధి కారిగా వ్యవహరించే కలెక్టర్ పేరును ఇకపై జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)గా మార్చాలనుకుంటోంది. ప్రస్తుతం జిల్లా పాలనాధికారిని సీడీఎం (కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్)గా పిలుస్తున్నప్పటికీ ఇం దులో కలెక్టర్ అనే పదాన్ని తొలగిం చాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలి సింది. బ్రిటిష్ పాలనలో భూమి శిస్తు వసూలు చేసే అధికారులను కలెక్ట ర్లుగా పిలిచేవారు. ప్రస్తుతం భూమి శిస్తు రద్దయినా కలెక్టర్ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రస్తుత కాలంలో కలెక్టర్ పదం సరికాదని పలు సంద ర్భాల్లో సీఎం కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టా లని భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చే విధంగా ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో జిల్లా పాలనాధికారిని కలెక్టర్ బదులు జిల్లా మేజిస్ట్రేట్‌గానే పిలుస్తున్నందున రాష్ట్రంలోనూ ఆ విధానాన్నే వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే జిల్లా అదనపు కలెక్టర్ల పోస్టుల్లోనూ మార్పులు జరగనున్నాయి. కొన్నాళ్ల క్రితం జాయింట్ కలెక్టర్ (జేసీ) పేరు, స్థాయి మార్చిన ప్రభుత్వం... ప్రతి జిల్లాకు జేసీ స్థానే ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించింది. ఇకపై వారి పేర్లలోనూ కలెక్టర్ అదృశ్యం కానుంది. వారిని అదనపు జిల్లా మేజిస్ట్రేట్లుగా పరిగణించాలని చట్టంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్ పోస్టులోనూ.. మండల స్థాయిలో ముఖ్య అ«ధికారిగా వ్యవహరించే తహసీల్దార్ పేరు మార్పుపైనా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రెవెన్యూ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపెట్టాలని భావిస్తున్న సర్కారు.. రిజిస్ట్రేషన్ శాఖతో వారిని అనుసంధానం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే భూముల క్రయవిక్రయాలు జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పాస్ పుస్తకాలను అక్కడికక్కడే జారీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త చట్టంలో కీలక సంస్కరణలు చేయాలని భావిస్తున్న సర్కారు.. తహసీల్దార్ అనే పదంపైనా పునరాలోచన చేస్తోంది. మండల వ్యవస్థ అమలులోకి రావడంతో అప్పటివరకు ఉన్న తహసీల్దార్ పేరును రద్దు చేసిన అప్పటి సీఎం ఎన్టీ రామారావు.. దాని స్థానే మండల రెవెన్యూ అధికారిగా నామకరణం చేశారు. అయితే దేశవ్యాప్తంగా తహసీల్దార్ హోదా ప్రాచుర్యం చెందడంతో కొన్ని ధ్రువపత్రాల చెలామణిలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఎమ్మార్వో పేరును మార్చిన వై.ఎస్. సర్కారు.. మళ్లీ తహసీల్దార్‌గా పిలవడం మొదలుపెట్టింది. అయితే తాజాగా కొత్త రెవెన్యూ చట్టంలో ఈ పేరు మార్పిడిపైనా ఆలోచన జరుగుతోంది. భూ నిర్వహణాధికారి లేదా భూ మేనేజర్‌గా పిలిచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఒకవేళ పాత సమస్యలే ఉత్పన్నమవుతాయని భావిస్తే మాత్రం ప్రస్తుత పేరును కొనసాగించే వీలుందని ప్రచారం జరుగుతోంది. -
వైరల్: ఇంగ్లిష్ రెండు లైన్లు చదవలేని టీచర్
లక్నో: కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో కళ్లకు కట్టే ఉదంతం ఇది. ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే దారుల్లో కొలువు కొట్టేసిందో తెలియదు గానీ.. ఆ ఇంగ్లిష్ టీచర్ ఇంగ్లిష్ పాఠ్య పుస్తకంలోని కనీసం రెండు లైన్లు కూడా సరిగా చదవలేక అడ్డంగా దొరికిపోయింది. తనిఖీకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా సికందర్పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ పాండే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఓ తరగతి గదిలో ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలి బోధన తేడాగా ఉండడంతో ఆమెకు ఇంగ్లిష్ పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. ఆమె పిల్లలకంటే దారుణంగా చదవడం మొదలెట్టింది. దీంతో వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఉపాధ్యాయురాలితో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు మెజిస్ట్రేట్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పిల్లల భవిష్యత్తు ఇలాంటి వారి చేతుల్లో పెడితే వారి భవిష్యత్తు ఏంటి అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించడంతో వారు కూడా చేసేదేమీ లేక మిన్నుకుండిపోయారు. -
ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది
-
ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది
అమేథి : జిల్లా కలెక్టర్‌గా ప్రజా సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తి తన బాధ్యతను విస్మరించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ కుమార్ శర్మ అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్ సింగ్ అలియాస్ సోనుసింగ్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి గుర్తు తెలియని యువకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కాగా, సోనుసింగ్ మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదో తెలుసుకుందామని అతని బంధువు, ట్రైనీ పీసీఎస్ ఆఫీసర్ సునీల్ సింగ్ బుధవారం ప్రశాంత్‌కుమార్‌ను కలిసేందుకు వచ్చారు. 'సోనూసింగ్ మృతదేహానికి పోస్టుమార్టమ్ ఎందుకు నిర్వహించలేదని, తన కజిన్‌ను చంపిన వ్యక్తులను ఎందుకు పట్టుకులేదో చెప్పాలని' సునీల్ సింగ్ ప్రశ్నించారు. ఈ విషయం తన పరిధిలో లేదని, అయినా అది అడగానికి నువ్వెవరు అంటూ ప్రశాంత్ కుమార్ సునీల్ కాలర్ పట్టుకొని దౌర్జన్యంగా బయటికి ఈడ్చుకువచ్చాడు. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియోను సునీల్ సింగ్ సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ..' ప్రశాంత్ కుమార్ ! నీవు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావన్న విషయాన్ని మరిచిపోయావు. న్యాయం అడగడానికి వచ్చిన వ్యక్తి పట్ల నువ్వు ప్రదర్శించిన తీరు ఆగ్రహం తెప్పించింది. మనం ప్రజలకు సేవకులగా పని చేయాలే తప్ప నియంతలా వ్యవహరించకూడదంటూ' ట్వీట్ చేశారు. కాగా, ఉన్నతస్థాయి అధికారి పదవిలో ఉంటూ ప్రశాంత్ వ్యవహరించిన తీరును పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. మొరాదాబాద్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న అరుణ్‌కుమార్‌ను ప్రశాంత్ కుమార్ స్థానంలో అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు. 'మంగళవారం రాత్రి హత్యకు గురైన సోనూసింగ్ స్థానికంగా ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి శివనాయక్ సింగ్ స్థానిక బీజేపీ నేతగా ఉన్నారు. కాగా, మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు అతన్ని అడ్డగించి రూ. 2లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగి జిల్లా ఎస్పీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో సోనూసింగ్ను హత్య చేసి పారిపోయారు. అయితే సోనూను హత్య చేసిన ఐదుగురిపై ఎప్ఐఆర్ నమోదు చేశామని' పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోనూ హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వచ్చిన సునీల్‌కుమార్‌పై జిల్లా మెజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ దౌర్జన్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. विनय शील एवं संवेदनशील बने हम यही प्रयास होना चाहिए । जनता के हम सेवक है , शासक नहीं @DmAmethi 🙏 — Smriti Z Irani (@smritiirani) November 13, 2019 -
కాస్గంజ్ అల్లర్లు.. కలెక్టర్ పోస్టుతో ప్రకంపనలు
లక్నో : కాస్గంజ్ మత ఘర్షణలపై బరేలీ కలెక్టర్ తన ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టు ప్రకంపనలు రేపుతోంది. అల్లర్లపై కలెక్టర్ ఆర్ విక్రమ్ సింగ్ ఆదివారం అల్లర్లపై ఓ సందేశం పోస్టు చేశారు. ముస్లింల ప్రాంతాల్లోకి వెళ్లి వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేయాల్సిన అవసరం ఏంటన్న? ప్రశ్నను ఆయన సంధించటంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది. పోస్ట్ పూర్తి సారాంశం... ‘‘ఓ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. ఘర్షణలు చెలరేగినప్పుడల్లా కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. మాట్లాడితే ఇస్లాం ప్రజల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? వారేమైన పాకిస్థాన్ వాసులా? కాదు కదా! అని పేర్కొంటూ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్టు ఒకదానిని పెట్టారు. గతేడాది బరేలీలో జరిగిన ఘర్షణల ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. కొందరు కన్వరియాలు(శైవ భక్తులు) ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలోకి పాక్ వ్యతిరేకంగా వెళ్లి నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలోనే నా నివాసం కూడా ఉంది. బయటికొచ్చిన నేను వారిని అలా చేయొద్దని వారించాను. కానీ, వారు నా మాట వినలేదు. ఇంతగా మత పిచ్చి వాళ్లకు ఎందుకు? ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయి అంటూ పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజ్యాంగబద్ధమైన పదవి హోదాలో మతపరమైన వ్యాఖ్యలు చేయటాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పుబడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రాజేష్ అగర్వాల్(బరేలీ ఎమ్మెల్యే కూడా) ‘సింగ్ పోస్టు’పై స్పందించారు. ‘‘ఆయన(ఆర్వీ సింగ్) చేసిన పోస్ట్‌ను చూడలేదు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సొంత దేశానికి వ్యతిరేకంగా.. పాక్‌కు అనుకూలంగా ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకోను’ అని మంత్రి మీడియాతో చెప్పారు. విక్రమ్ సింగ్ అధికారిక ఫేస్ బుక్‌లోని కొంత భాగం స్క్రీన్ షాట్ ఇక విమర్శలపై సింగ్ స్పందించారు.‘ఇది చాలా చిన్న విషయం. అయినా భూతద్ధంలో చూస్తున్నారు. కాస్గంజ్ ఎస్పీని బదిలీ చేశారు. నిజాయితీగా పని చేస్తున్న నాలాంటి అధికారిపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అభివృద్ధికి ఆటంకాలే’అని సింగ్ చెప్పారు. గణతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా విద్యార్థి సంఘాలు బద్దూ నగర్లో ‘తిరంగ ర్యాలీ’ నిర్వహించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. మరుసటి రోజు చెలరేగిన ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను నిలిపవేశారు. మొత్తం 80 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరిస్థితి సర్దుమణగటంతో మంగళవారం ఉదయం నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించారు. -
హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
కర్నూలు(లీగల్): ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.35 వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే.. కర్నూలుకు చెందిన ఈశ్వరమ్మకు అరోరానగర్‌కు చెందిన సి.తిమ్మయ్యతో వివాహేతర సంబంధం ఉంది. తిమ్మయ్య తన లైంగింక కోరికను ఈశ్వరమ్మ కుమార్తెతో తీర్చమని వేధించాడు. దీంతో అతడిని అంతం చేయాలని భావించి కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన బోయ విజయసేనతో కలిసి ఆమె పథకం వేసింది. 2011 సంవత్సరం డిసెంబరు 24న కసాపురం ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్దామని తిమ్మయ్యను నమ్మించి తీసుకెళ్లింది. కసాపురంలో విజయసేనను పరిచయం చేసి కారులో కర్నూలుకు బయలుదేరారు. డోన్ మండలం కొత్తకోట గ్రామ సమీపం చేరగానే అక్కడ తిమ్మయ్యను కారు దింపి బండరాయితో తలపై మోది చంపేశారు. మతదేహాన్ని వెంగలాంపల్లె చెరువు సమీపంలోని గుంతలో పడేసి రాత్రి కర్నూలుకు చేరుకున్నారు. రెండు రోజుల తర్వాత మతదేహం బయటపడింది. అయితే ఆచూకీ లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేశారు. హతుడిని ఎవరు గుర్తుపకట్టకపోవడంతో పోలీసులు కేసును మూసివేశారు. రెండు సంవత్సరాల తర్వాత విజయసేన మరో కేసులో ఆదోని రెండో పట్టణ పోలీసులకు పట్టుబడి తిమ్మయ్య హత్య ఉదంతాన్ని బయటపెట్టాడు. దాంతో మూసివేసిన కేసును అప్పటి డోన్ సీఐ డేగల ప్రభాకర్ పునర్విచారణ చేశారు. అప్పటి మతదేహం పొటోలను హతుడు కుమారుడు రవికుమార్ గుర్తు పట్టాడు. ఈ మేరకు ఈశ్వరమ్మ, విజయసేలపై కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితులపై హత్యానేరం రుజువు కావడంతో వారికి జీవితఖైదు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.