
హైదరాబాద్, సాక్షి: కొరియోగ్రాఫర్ జానీ పోలీసులకు పట్టుబడ్డానన్న వార్తల తర్వాత ఆయన భార్య అయేషా అలియాస్ సుమలత బయటకు వచ్చారు. గురువారం మధ్యాహ్నాం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె మీడియాపై చిందులు తొక్కారు.

ఓ ఫేక్ కాల్ రావడంతో తాను పీఎస్‌కు రావాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు. అయితే.. భర్త లైంగిక వేధింపుల వ్యవహారంపై స్పందించాలని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను కోరారు. ఏం సమాధానం ఇవ్వాలో అర్థంకాని అయేషా.. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నాకే కెమెరా పెడతారా? అంటూ వాళ్ల మీద ఫైర్ అయ్యారు.

మరోవైపు మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జానీ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ.. 24 గం.లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుర్చాలని తెలంగాణ ఎస్‌వోటీని ఆదేశించింది. ఇక ఈ కేసులో.. తనపై అయేషా సైతం దాడికి పాల్పడిందని బాధితురాలు ఆరోపించడం గమనార్హం.

ఇదీ చదవండి: ఆపరేషన్ జానీ.. సాగిందిలా!
Comments
Please login to add a commentAdd a comment